• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )

admin by admin
May 25, 2026
in అనువాద కథలు
0
ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )

మూలం : ఇస్మత్  చుగ్తాయి
తెలుగు అనువాదం : గీతాంజలి

 

చలికాలంలో నేను నా మెత్తటి బొంత కప్పుకున్నప్పుడల్లా నా పక్కనే ఉన్న గోడమీద నా నీడ ఒక ఏనుగు ఆకారం లో కనిపించి నాకు నా గతమంతా కళ్లముందు కదలాడుతుంది. ఏవేవో జ్ఞాపకాలు నాలో సుళ్ళు తిరగడం మొదలవుతుంది.

నన్ను క్షమించాలి . నేను మీకు నా బొంతకి{చిక్కటి చలికాలపు చలిని ఆపే దుప్పటి}  సంబంధించిన శృంగార కథనేమీ చెప్పబోవడం లేదు. దాని కంత కథ లేదు. నిజానికి  దుప్పటి మెత్తటి బొంత  అంత వెచ్చగా ఉండకపోయినా గోడ మీద బొంత సృష్టించే భయంకరమైన కదిలే నీడల్ని మాత్రం సృష్టించవు.

నేనప్పుడు చాలా చిన్నపిల్లని. నిత్యం నా అన్నలతో వాళ్ళ దోస్తులతో  దెబ్బలాడుతూ ఉండేదాన్ని. నేనంత భీభస్థమైన అల్లరిగా ఎందుకు ఉండేదాననో ఏమో నాకే అర్థం అయ్యేది కాదు. అలా ఉన్నందుకు ఆశ్చర్యం కూడా వేసేది. అదె సమయంలో నా మిగతా అక్కలంతా తమని ఆరాధించే అబ్బాయిలని ఆకర్షించే పనిలో ఉంటే., నేనేమో అబ్బాయిలతో ఉరికనే గొడవ పడుతుండే దానిని. అందుకేనేమో ఒక వారం రోజుల కోసం ఆగ్రా వెళ్ళేప్పుడు  అమ్మీ ఈ సారి నన్నుతన చెల్లెలి వరుస అయిన వాళ్లింట్లో వదిలి వెళ్ళింది. అక్కడ మనుషులతో కాదు కదా ఎలుక పిల్లలతో కూడా నేను గొడవ పడనని  అమ్మీకి బాగానే  తెలుసు. అవును అమ్మీ నన్ను బేగం జాన్ ఇంట్లో వదిలి ఆగ్రా వెళ్ళిపోయింది. ఇది ఒక రకంగా నాకు చాలా పెద్ద శిక్షే అనుకోండి. అదే బేగం జాన్., ఎవరి బొంత  అయితే ఇప్పటిదాకా నా శరీరం మీద ఒక కాలిన లోహపు మచ్చలా ఉండి  పోయిందో ఆ బేగం జాన్ అన్న మాట! పాపం ఆమె బీద తల్లిదండ్రులు ఆమెని ఒక వయసులో చాలా పెద్దవాడైన, ధనవంతుడైన  నవాబుకి ఇచ్చి నిఖా చేశారు. ఆయన మాత్రం మంచి నీతిమంతుడని చెప్పుకుంటారు. అతని ఇంటికి ఎప్పుడూ ఒక నృత్యం చెసే  అమ్మాయి కానీ, వేశ్య కానీ వచ్చి పోవడం చూడనే లేదంటే నమ్మండి. ఆయన స్వయంగా  మక్కాకి వెళ్లొచ్చిన హాజీ మాత్రమే కాదు ఎంతో మందిని దగ్గరుండి మక్కాకి పంపిన మహానుభావుడు మరి.

కానీ అతనికి  ఒక విచిత్రమైన అభిరుచి ఉంది.

ఏదేమైనాప్పటికీ అతనికి ఒక వింత అభిరుచి ఉన్నది. కొంతమందికి పావురాళ్ళను పెంచడంలో, మరి కొంతమందికి కోడిపందాలలో ఇష్టం ఉంటుంది. కానీ నవాబు గారికి అవంటే పరమ అసహ్యం. ఆయన.. అందమైన తెల్లని రంగులో సన్నని నడుము ఉండే విద్యార్థులకే వసతి గృహం నడపడమే కాదు, దానికి కావాల్సిన ఖర్చంతా తానే భరిస్తాడు కూడా..

బేగంజాన్ ని నిఖా (పెళ్లి) చేసుకున్నాక నిఖాలో వచ్చిన కట్నం సామాన్లతో పాటుగా ఆమెను కూడా బంగాళాలోకి పంపించేసి మర్చిపోయాడు. వయసులో చిన్నదైన,అందమైన బేగంజాన్ ఒంటరితనంలో మగ్గిపో సాగింది.

బేగంజాన్ జీవితం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. ఆమె పుట్టి నేరం చేసిందో.. లేదా ఆమె నవాబుకు భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టడమే నేరమో.. తెలియదు. కానీ, ఆ అందంగా ఉండే మంచం మీది పరుపుపై పడుకొని తన జీవితాన్ని నిస్సారంగా ఎలా గడప సాగిందో తెలియదు. చాలాసార్లు, కాదు ఎప్పుడూ నవాబు గదిలోకి అందమైన యువతులు వెళ్లడం, రావడం.. వాళ్ల కోసం రసూల్ వంటగదిలోంచి రుచికరమైన భోజనాలు వెళ్లడం గమనించింది.

నవాబు కూర్చునే ముందు గదిలోకి అబ్బాయిల రాకపోకలు రోజురోజుకీ ఎక్కువ అవ్వడం కూడా ఆమె దృష్టిని తప్పిపోలేదు. కొత్త కొత్త బట్టలలో రకరకాల అత్తర్ల పరిమళాలు వెదజల్లుతూ దివాన్ ఖాన్ లోకి వెళ్తున్న ఆ ధృడ కాయులైన యువకులను చూస్తున్న కొద్దీ.. బేగంజాన్ కి కోరికల జ్వాలలు రేగసాగాయి. అప్పటినుంచి ఆమె జీవితంలో ఈ మార్పు కలగసాగిందా.. లేక తన తిరుగుబోతు భర్తను కాపాడుకోలేక, తన దగ్గరకు కట్టిపడేసుకోలేక, తంత్రాలు, మాయలు, చేతబడి లాంటి వాటిని వదిలేసుకున్నప్పటి నించా.. ఇక బేగం నిద్ర పట్టని తన రాత్రులను పుస్తక పఠనానికి కేటాయించింది. కానీ కఠినమైన రాయి నుంచి ఎవ్వరూ కూడా రక్తాన్ని పిండలేరు కదా నవాబు కనీసం కొంచెం కూడా కరగనే లేదు. బేగం హృదయం పగిలిపోయింది.

ఆమె ఇక పూర్తిగా పుస్తకాల వైపు మళ్ళిపోయింది. పోనీ, ఆ మార్గం ఎన్నుకుంది కానీ, ఆమెకు దీనివల్ల కూడా సాంత్వన కలగలేదు. సరస శృంగారం రంగరించిన నవలలు, భావోద్వేగాల, కరుణరసాత్మక నవలలు, ఆమెను మరింత కుంగదీసాయి. ఆమె నిద్రలేని రాత్రులను తనకు ఎటు దిక్కు నుంచి కూడా దొరకని ప్రేమ కోసం, అల్లాడుతూ దుర్భరంగా గడప సాగింది. నిరాశలో కూరుకుపోయిన బేగం తన అందమైన బట్టలను భగభగ మండే పొయ్యిలో పడేయాలని అనుకుంది. ఎవరైనా తమ ప్రియమైన వారిని ఆకర్షించడానికి మంచి బట్టలు వేసుకుంటారు. కానీ తనకెందుకు బట్టలు? ఎవరికోసం వేసుకోవాలి? అని ఆమెలో బాధ రెట్టింపు అయింది.

నవాబు కైతే ఆమెతో గడపడానికి ఒక్క క్షణం కూడా తీరికలేదు. ఎంతసేపు నవాబు ధగధగలాడే సిల్క్ చొక్కాల వెంట పడేవాడు. బేగంజాన్ ను బయటకు కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇంకా.. బంధువులు అంటారా చాలామంది వస్తూనే ఉండేవాళ్ళు. నెలల తరబడి అక్కడ మఖాం వేసి ఉండేవాళ్ళు. బేగంజాన్ మాత్రం ఇంట్లోనే తను గదిలోనే ఖైదీ అయిపోయింది. ఈ బంధువు లందర్ని చూస్తుంటే బేగం జాన్ రక్తం సలసలా కాగిపోయేది. ఎవరికి వాళ్లు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ.. మంచి రుచికరమైన భోజనాన్ని చేయించుకుని తింటూ ఉండేవాళ్లు. చలి కాలం వెచ్చని దుస్తులు కొనుక్కొని వేసుకునేవాళ్లు.

మరోపక్క బేగం చలికి బిగుసుకుపోయేది. ఆమె దగ్గర కొన్ని బొంతలు, కొత్త దూదితో తయారైన వాటి మీద రకరకాల అందమైన బొమ్మలు ఉండేవి. వాటిని గోడ మీద వేలాడదీస్తే ఆ గోడల మీద ఆ బొంతల నీడలు కనిపించేవి. నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నప్పుడల్లా ఆ బొమ్మలు నీడలు మరీ కవ్వించేవి. కానీ గోడ మీద పడే ఏ బొమ్మ నీడ కూడా ఆమెలో జీవితేచ్ఛ కలిగించేవిగా ఉండేవి కావు. ఇంకా ఆమె దేనికోసం బతకాలి అనుకునేది. అలాంటి నిస్సార జీవితం బేగంజాన్ అదృష్టంలో రాసి ఉందా..? ఉంది కాబోలు.

కానీ ఒక్కసారి గా ఆమె జీవించడం మొదలు పెట్టింది. అది మామూలుగా కాదు. అత్యద్భుతంగా పరిపూర్ణంగా.. అవునండీ.. అవును. అది రబ్బూతోనే సాధ్యమైంది. రబ్బూ ఆమెను నిరాశా నిస్పృహల ఊబిలో కూరుకుపోకుండా కాపాడగలిగింది. ఆమె బక్కజిక్కిన శరీరం పుష్టిగా కాసాగింది. ఆమె బుగ్గలు నున్నగా మెరుస్తూ.. ఆమె అమితమైన సౌందర్యంలో మెరిసి పోసాగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఏంటా రహస్యం? అది ఒక ప్రత్యేకమైన నూనెతో చేసిన మాలిష్ వలన మారిన బేగంజాన్ లో ప్రాణం తిరిగి వచ్చింది. క్షమించాలి మీరు ఈ అద్భుతమైన నూనెలో ఏ మూలికలు నిండి ఉన్నాయో.. ప్రత్యేకమైన పత్రికల్లో కూడా సమాచారం దొరకదు సుమా.. అది రహస్యం. అంతే..

నేను మొదటిసారి బేగంజాన్ని చూసినప్పుడు ఆమెకు ఒక నలబై ఏళ్లు ఉంటాయేమో.. ఎంతో రాజసంతో ఆమె దివాన్ మీద ఒరిగి  ఉండింది. రబ్బూ ఆమె వెనుక ఆమె వీపును అనుకొని కూర్చొని, ఆమె నడుముకు మాలిష్ చేస్తూ ఉన్నది. వంగపండు రంగు శాలువా ఆమె పాదాలని కప్పి ఉంచింది. ఆమె ఒక మహారాణిలా కనిపించింది. ఆమె పట్ల నేను ఎంతో తీవ్రంగానో ఆకర్షించబడ్డాను. అట్లా ఆమె పక్కనే గంటల తరబడి కూర్చోవడానికి ఇష్టపడేదాన్ని. అలా ఆమెని ఆరాధించేదాన్ని. ఆమె చర్మం పాలరాయంత తెల్లగా ఉండేది. ఎక్కడ ఇంత మచ్చ కూడా ఉండేది కాదు. దట్టమైన ఆమె జుట్టు నల్లగా ఉండేది. బహుశా మంచి నూనె బాగా పెట్టేది కాబోలు. తల వెంట్రుకలు ఎప్పుడూ కూడా అల్లిబిల్లిగా కనబడేవి కాదు. చక్కగా కుదురుగా ఉండేవి. ఆమె కనుపాపలు నల్లగా ఉండేవి. మత్తుగొలిపే కళ్ళ పైన కనుబొమ్మలు విల్లుల్లా పరిచినట్లు ఉండేవి. ఆమె కనుబొమ్మలు ఏవో బరువుకు వంగుతున్నట్లుగా.. కనురెప్పల మీది వెంట్రుకలు ఒత్తుగా ఉండేవి. అసలైతే ఆమె ముఖంలో అత్యంత ఆకర్షణీయమైనవి ఆమె పెదాలనే చెప్పాలి. ఘాడమైన లిప్స్టిక్ తో మెరిసిపోయేవి. పొడవైన జుట్టు ఆమె నుదుటినీ కొద్దిగా కప్పెట్టి ఉంచేవి. కొన్నిసార్లు ఆమె ముఖం మారుతున్నట్లుగా అనిపించేది. నా కళ్ళకి ఒక యవ్వనుడైన పిల్లవాడి ముఖం లాగా తోచేది. ఎందుకో చర్మం మెత్తగా తెల్లగా ఉండే ఆమెకు, ఎవరో ఆమె చర్మాన్ని బిగుతుగా కుట్టారా అనిపించేది.

ఆమె తన కాళ్ళను మాలిష్ చేయించుకోవడం కోసం, ముందుకు చూసినప్పుడల్లా, ఆ కాళ్ళ మెరుపుని చూసేదాన్ని. నిజం చెప్పొద్దూ.. ఆమె భలే పొడుగ్గా ఉండేది. దేహమంతా మంచి పాలల్లో ముంచినట్లు పరిపుష్టంగా ఉండేది. కళ్ళు చెదిరిపోయేటట్లు ఉండేది. ఆమె చేతులు పొడవుగా మెత్తగానూ ఉండేవి. ఆమె సన్నని నడుము పైభాగానికి తగ్గట్టుగా ఉండేది. రబ్బు ఆమె నడుముని గంటలు తరబడి మాలిష్ చేస్తూనే ఉండేది. అదేదో ఆమె జీవన అవసరాల్లో అతి ముఖ్యమైన భాగంలా.. ఆమె కందే జీవిత అవసరాల కంటే కూడా మించిన అతి ముఖ్యమైన, అత్యంత అవసరమైన దానిలాగా ఉండేది, ఆమెకు రబ్బు చేసే మాలిష్. ఏ రకమైన ఇంటి పనులు రబ్బూకు ఉండేవి కావు. ఎప్పుడు చూడు దివాన్ మీద కూర్చుని బేగం శరీరంలో ఏదో ఒక భాగాన్ని మర్దన చేస్తూనే ఉండేది.

నాకు చాలాసార్లు రబ్బు ఆమెను మర్దన చేయడం అసలు నచ్చేది కాదు. భరించలేకపోయేదాన్ని. ఎవరైనా నా శరీరాన్ని అలా మర్దన చేస్తుంటే నేనైతే అక్కడికక్కడే మళ్ళీ మళ్ళీ చచ్చిపోతాను. ఇక ఏం చెప్పమంటారు.. రోజు చేసే ఈ మర్దన కూడా సరిపోయేది కాదు. ఆమె స్నానం చేసే రోజుల్లో ప్రత్యేకమైన నూనెతో ఆమె శరీరం అంతా మర్దన చేసిన తర్వాత రెండు మూడు గంటలు అలానే నూనెతో దట్టంగా అలిమి ఉంచేది. రబ్బూ ఎంతో శక్తితో ధాటిగా మర్దన చేసేదంటే ఊహించుకుంటేనే నాకు నీరసం వచ్చేసేది అనుకోండి.

తలుపు మూసేసి, దీపాలు వెలిగించి, ఇక రబ్బూ మర్దన మొదలు పెట్టేది. మామూలుగా అలాంటి ప్రత్యేక సందర్భాల్లో కేవలం రబ్బూకు మాత్రమే స్నానాల గదిలో అనుమతి ఉండేది. మిగతా పని వాళ్లంతా వాళ్లకు కావాల్సిన వస్తువులు అందిస్తూ, తలుపు బయటే, అసభ్యంగా గుసగుసలాడుతూ, నిలబడి ఉండేవాళ్లు. నిజానికి బేగంజాన్ కి ఒక చెప్పరాని దురద ఉండేది. ఎన్ని రకాల బాములు, నూనెలు రాసిన ఆ దురద పోకుండా అక్కడే ఉండిపోయేది. హకీములు, డాక్టర్లు చాలామంది చూసి “ఏమీ రోగం లేదు. అక్కడి చర్మం మందబారి ఉందనీ, బహుశా అక్కడ చర్మం కింద ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండడం వలన, అలా దురద పుడుతుందని” చెప్పేవారు.

“ఈ డాక్టర్లకు పిచ్చి. ఏమీ తెలీదు. ఇది కేవలం నీ చర్మం లోపల వేడి వల్ల వస్తుంది” అనేది రబ్బూ నవ్వుతూ.. బేగంజాన్ ని కలలో చూస్తున్నట్లు చూస్తూ..

అవును ఇంతకీ రబ్బూ ఎలా ఉంటుంది అంటే.. బేగంజాన్ ఎంత తెల్లగా ఉంటుందో, రబ్బు అంత నల్లగా ఉంటుంది. ఆమె మండి వేడెక్కిన ఇనుములా ఉండేది. అమ్మవారు పోసిన ఆమె ముఖం స్ఫోటకపు మచ్చలతో నిండి ఉండేది. ఆమెదిట్టంగా బలిష్టంగా పొడుచుకొచ్చిన పొట్టతో ఉండేది. చేతులు చిన్నవి. ఆమె ఉబ్బిన పెదాలు ఎప్పుడూ తడిగా ఉండేవి. ఒక వింతైన కమురువాసన ఆమె నుంచి వస్తుండేది. ఆమె చిన్నవైన రెండు చేతులు ఒకసారి బేగంజాన్ నడుము పైన ఉంటే.. మరోసారి ఆమె తొడలు పైన ఉండేవి. మరోసారి ఆమె పాదాల మీద దూసుకుపోవే పోయేవి. బేగంజాన్ పక్కన కూర్చున్నప్పుడల్లా నా కళ్ళు బేగంజాన్ శరీరం మీద కదిలే రబ్బు చేతుల్ని చూస్తుండేవి. సంవత్సరమంతా బేగంజాన్ తెల్లని జాలీలున్న హైదరాబాద్ జాలి (గర్గా) కుర్తాలు వేసుకునేది. వాటి కింద గాఢమైన రంగులు ఉన్న పైజామాలు వేసుకునేది. వాతావరణం వేడిగా ఉన్నా పైన ఫ్యాన్ తిరుగుతున్నా పల్చని షాల్ ఎప్పుడు కప్పుకునేది బేగం. బేగం జాన్ కి చలికాలం అంటే చాలా ఇష్టం. నాకు కూడా అంతే ఇష్టం. చలికాలంలో ఆమె దగ్గరగా ఉండడం అంటే మరీ ఇష్టం. ఆమె ఎక్కువగా బయటకు వెళ్ళదు, దివాన్ మీద ఒరిగి డ్రై ఫ్రూట్స్ను నములుతూ ఉండేది. రబ్బు ఆమె వీపు మీద మెల్లగా మర్దనా చేస్తున్నట్టు ఉండేది. ఇక ఇంట్లోని మిగతా పనికత్తెలంతా రబ్బుని చూస్తూ అసూయతో రగిలిపోయేవారు.

“ఒట్టి మంత్రగత్తె బేగంతో కలిసి ఉంటుంది. ఎప్పుడూ ఆమెతోనే కూర్చుంటుంది. అవ్వ ఇంకా ఏం చెప్పాలి, బేగంజాన్తో ఈరబ్బు పడుకుంటుంది కూడా.. ఛీ” ఇవి వాళ్ళు మాట్లాడుకునే మాటలు. వాళ్ళ ఖాళీ సమయం అంతా రబ్బు బేగంజాన్ గురించి వాళ్లు గాలి కబుర్లు చెప్పుకుంటారు. రసవత్తరమైన కథలు అల్లడంలో ఉద్దండులు. ఎవరో ఒకరు రబ్బు పేరు తీస్తారో లేదో.. ఇక గుంపు అంతా ఆమె గురించి చాడీలు, లేనిపోని పుకార్లు చెప్పుకుంటూ నవ్వుకోవడం షురూ చేస్తారు. బేగంజాన్ కి ఇవన్నీ తెలిసినా.. తెలియనట్లు నటిస్తూ.. తన ప్రపంచంలో తాను ఉండేది. ఆమె ధ్యాసంతా కూడా కేవలం తన ఆనందం మీద. తన ప్రత్యేకమైన దురద మీద ఉండేది. ఇక వేరే లోకమే అక్కర లేనట్లు.

ముందే చెప్పినట్లు నేను నవయవ్వనంలో ఉన్నాను. పైగా బేగంజాన్ ని ప్రేమిస్తున్నాను. ఆమెకు కూడా నేనంటే చాలా ఇష్టం. అమ్మీ ఆగ్రాకి వెళ్లే ముందు ఒక ఒక వారం రోజుల కోసం నన్ను బేగంజాం దగ్గర వదిలి వెళ్ళింది. ఇంట్లో ఒంటరిగా వదిలి వెళితే.. నేను నా అన్నలతో కొట్లాడుతానని, లేదా బజార్లో తిరుగుతానని, భయం కూడా ఉంది. అమ్మి చేసిన ఈ పని నాకు బేగంజానికి ఇద్దరికీ చాలా నచ్చింది కూడా.. ఆఖరికి ఆమె మా అమ్మ దత్తత తీసుకున్న చెల్లెలాయే మరి. కానీ ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే నేను ఎక్కడ పడుకోవాలి అన్నది. సందేహం ఏముంది ? బేగంజాన్ గదిలోనే ఆమె మంచం పక్కనే నాకోసం చిన్న మంచం వేశారు. రాత్రి పది,పదకొండు వరకు ఎన్నో ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం, తర్వాత పత్తాలాట ఆడుకునే వాళ్ళం, తర్వాత నేను నిద్రపోయేదాన్ని. అప్పుడు కూడా రబ్బు బేగంజాం నడుము వీపు మర్ధన చేస్తూనే ఉండేది. “గలీజు ఆడది” అని అనుకునే దాన్ని మనసులో నిద్రలో రాత్రులు ఉన్నట్టుండి మెలుకువ వచ్చేది, భయం వేసేది. చీకట్లో బేగంజాం కప్పుకున్న బొంత కదులుతున్నది. గోడమీద నీడలు ఆ కదిలే బొంతల్లో ఏనుగు పెనుగులాడు తున్నట్లుగా అనిపించేది.

నేను భయంతో “బేగంజాన్” అని అరిచాను. ఏనుగు వణకడం ఆపేసింది. బొంత ఆమె మీద నుండి కిందకు జారింది.

“ఏంటి పడుకో..” బేగంజాన్ గొంతు, ఎక్కడో దూరాన్ని నుంచి వినిపించినట్లు ఉంది.

” నాకు భయం వేస్తున్నది” నేను మెల్లగా అన్నాను.

“భయం వేయిడానికి ఏమైంది ఇప్పుడు. నిద్రపో కావలిస్తే, అయాతుల్ ఖుర్సీని జపం చెయ్యి భయం పోతుంది” అన్నది బేగంజాన్.

అలాగే అంటూ నేను ప్రార్థన మొదలు పెట్టాను. కానీ ‘యలము మా బిన్’ దగ్గరికి వచ్చేసరికి తర్వాత చరణాలు మర్చిపోయాను నాకు ఆ ప్రార్థన పూర్తిగా వచ్చినప్పటికీ..

“నీ దగ్గర పడుకుంటాను బేగంజాన్. భయంగా ఉంది” అన్నాను.

“వద్దు పాపా.. అక్కడ నిద్ర పోవడానికి ప్రయత్నించు” అన్నది బేగంజాన్ ఆమె గొంతులో కొద్దిగా ఏదో అలజడి. వెంటనే నాకు ఎవరో ఇద్దరూ గుసగుసలాడుకోవడం వినిపించింది. ఓ అల్లా ఎవరా వ్యక్తి నాకు నిజంగా భయం వేసింది.

“బేగంజాన్.. ఈ గదిలో ఎవరో దొంగ ఉన్నట్లు గా అనుమానంగా ఉంది” అన్నాను నేను.

“నిద్రపో పాపా.. ఇక్కడ ఎవ్వరూ దొంగలు లేరు” అదేంటి అది రబ్బు గొంతు కదా.. ఏమోలే నేను బొంతను నెత్తిమీద వరకు కప్పుకున్నాను. ఉదయం. రాత్రి జరిగిన ఆ భయం కొలిపే సంఘటన పూర్తిగా మర్చిపోయాను. నాకు చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. రాత్రి భయాలు, నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడడం లేదా కలవరించడం అనుకోండి. నా బాల్యంలో నిత్యం జరిగినవి. అందరూ నాకు దయ్యం పట్టిందని అనేవారు. అందుకే రాత్రి జరిగిన సంఘటన నా ఊహల్లోంచి పారిపోయింది. బేగంజాన్ రాత్రి కదులుతున్న బొంత మాత్రం ఏమీ ఎరగనట్లు అమాయకంగా కనిపించింది నాకు.

కానీ మరునాడు రాత్రి నాకు మెలకువ వచ్చినప్పుడు గదిలో బేగంజాన్ రబ్బు ఇద్దరి లో గొంతుతో వాదించుకోవడం వినిపించింది. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో స్పష్టంగా అర్థం కాలేదు. కానీ రబ్బు ఏడుస్తున్నదని మాత్రం అర్థం అయింది. వెంటనే పాల కంచం నాకుతూ పిల్లి చేసే గుటక శబ్దం వినిపించింది. నాకు భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోయే ప్రయత్నం చేశాను.

మరునాడు రబ్బూ కొడుకుని చూడడానికి ఊరు వెళ్ళింది. వాడు నవ యువకుడు. బేగంజాన్ అతనికి ఎంత సహాయం చేసిందో.. అతని కోసం ఒక దుకాణం కొన్నది. ఊర్లో ఒక ఇల్లు కొన్నది. కానీ అతగాడికి సంతృప్తి లేదు. బేగంజాన్ ఇంత చేసిన అతడు నవాబ్ తో కొన్ని రోజులు పాటు ఉన్నాడు. నవాబ్ అతనికి కొత్త బట్టలు, కొన్ని కానుకలు కొనిచ్చాడు. కానీ విచిత్రంగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. కనీసం తన అమ్మి రబ్బుని చూడడానికి కూడా..

రబ్బూ తన కొడుకుని చూడడానికి తన బంధువుల ఇంటికి వెళ్ళింది. బేగంజానికి అస్సలు ఇష్టం లేదు ఆమె వెళ్లడం. కానీ రబ్బూకి తప్పలేదు వెళ్లడం. బేగంజాం కూడా ఆమెను ఆపలేకపోయింది. దినమంతా బేగంజాన్ అదుపులో లేని అసహనంతో ఇల్లంతా తిరిగేది. ఆమె కీలుకీలు నొప్పి పెట్టేది. కానీ బేగంజాన్ని ఎవరినీ తనని ముట్టనిచ్చేది కాదు. ఆమె ఏమి తినేది కాదు కూడా.. దివారాత్రులు దివాన్ మీద నీరసంగా పడుకొని ఉండేది.

ఆ రోజు పత్తాలాట ఆపి, “బేగంజాన్.. నీ నడుము నేను మర్దన చేయనా..” అని అడిగాను ఆమెని. ఆమె నా వైపు అదోలా చూసింది. వెంటనే నేను నా చేతుల్లోని పత్తాలు పక్కన పడేసి, నిశ్శబ్దంగా పడుకున్న ఆమె వెనుక చేరి నడుము మర్దనా చేయసాగాను. అసలు రబ్బూ ఆ మరుసటి రోజు రావాలి. కానీ రాలేదు బేగంజానికి కోపం ఎక్కువ కాసాగింది. ఆమె కప్పుల కొద్ది చాయ్ తాగుతోంది అసహనాన్ని అదుపులో పెట్టుకోలేక. ఇక ఆమెకు విపరీతమైన తలనొప్పి వచ్చేసింది. నేను మళ్ళీ ఆమె వీపు మర్ధనా మొదలు పెట్టాను. టేబుల్ మీద అద్దం అంత నున్నగా ఉంది ఆమె వీపు. మెల్లగా రుద్దుతూ.. నేను ఆమెకామాత్రం సాయపడుతున్నందుకు సంతోషపడ్డాను. “ఇంకొంచెం గట్టిగా రుద్దు. బ్లౌజ్ తాడ్లు తీసేయ్” బేగంజాన్ అన్నది.

“ఇక్కడే.. కొద్దిగా భుజం కింద.. కుడి వైపు, అది… ఓ ఎంత హాయిగా.. ఉంది” ఊపిరి దీర్ఘంగా వదులుతూ బేగంజాన్ సంతృప్తిగా అంటుంది.

“ఇంకొంచెం ముందుకు..” అంటూ బేగంజాన్ ఎక్కడ మర్దన చేయాలో ఆ చోటు తన చేతులతో చూపించింది. కానీ ఆమె అక్కడ చేత్తో కదిలిస్తూ మర్దన చేయాలన్నట్టు.

ఇక ఆ క్షణాల్లో నాకు చెప్పొద్దూ.. చాలా గర్వంగా అనిపించింది అంటే నమ్మండి. “ఇక్కడ.. ఊం.. ఓహో.. నువ్వు నాకు చెక్కిలిగింతలు పెడుతున్నావు..” ఆమె ఆనందంగా నవ్వుతూ అంటుంది. ఇక నేను ఆమెతో ముచ్చట్లు పెడుతూ ఆమె ఎలా చెప్తే అలా మర్దన చేయసాగాను.

“రేపు నిన్ను బజారుకు పంపిద్దాం అనుకుంటున్నా.. నీకేం కావాలో చెప్పు”అని నిద్రపోయి, మళ్లీ నిద్రలేచి “బొమ్మలు కొనాలా చెప్పు ఇప్పిస్తాను” అడిగింది నన్ను. “వద్దు బేగంజాన్ నాకు బొమ్మలు వద్దు. నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నారా.. ఇంకా” అన్నాను నేను.

“ఓహో అయితే నువ్వు పెద్దమ్మాయి అన్నమాట..” అంటూ బేగంజాన్ నవ్వింది. “బొమ్మ కాకపోతే.. నీకు నేను మంచి డ్రెస్ కొనిస్తాను. నీకు కావలసినప్పుడు వేసుకో. నేను నీకు బోలెడన్ని గుడ్డలు కొనిస్తాను సరేనా..” అంది బేగం. నేను సరే అంటూ తలుపాను.

ఇక్కడ అంటూ ఆమె తనకు తరచూ దురద వచ్చే జాగాలో నా చేతిని పెట్టింది. నేను ఆమె కొనబోయే ‘బొబ్బువా’ ఊహల్లో ఉన్నానేమో.. ఆ మైకంలో ఆమె చెప్పినచోట మర్దన చేసేను. కానీ “ఇదిగో విను.. నీకు ఇంకొన్ని గౌన్లు అవసరం. రేపు దర్జీని పిలిపించి, నీకు వేసుకోవడానికి కొత్త గౌన్లు కుట్టిస్తాను. మీ అమ్మకు ఉన్న కొత్త బట్టలు ముక్కలు ఇక్కడ వదిలి వెళ్ళింది” అన్నది.

“నాకు ఆ పరుపు బట్ట వద్దు. అది చాలా సస్తా బట్టలాగా ఉంది” నేను మాట్లాడుతూనే అన్నాను. అయినా నా చేతులు ఆమె దేహం మీద ఎక్కడ మర్దన చేస్తున్నాయో సోయి లేకుండా.. బేగంజాన్ కదలకుండా పడుకొని ఉంది కదా, ఓహ్.. ఖుదా.. నేను నా చేతులు ఒకసారి తీసేసాను ఆమె మీద నుంచి.

“హే అమ్మాయి.. చేతిలు ఎక్కడ ఉన్నాయో కొంచెం చూసుకో.. నువ్వు నా పక్కటెముకలకు నొప్పి పుట్టేలా మర్ధనా చేస్తున్నావు” కొంటెగా నవ్వుతూ అన్నది బేగంజాన్. నాకు ఎలాగో అనిపించింది ఇబ్బంది పడ్డాను.

“రా.. ఇక్కడికి నా పక్కన కూర్చో..” అంటూ ఆమె నన్ను తన పక్కనే తన చేతుల మీద నా తలను పెట్టుకుంటూ పడుకోబెట్టుకుంది. “ఎంత బక్క పల్చగా ఉన్నావో చూడు. నీ పక్కటెముకలు ఎలా పొడుచుకుని వస్తున్నాయో” అంటూ ఆమె నా పక్కటెముకల్ని లెక్కపెట్ట సాగింది. తన చేతులతో.. నేను ఆమెను ఆపే ప్రయత్నం చేశాను.

“అబ్బో నేనేం నిన్ను తినేయను లే.. ఈ స్వెటర్ చూడెంత బిగుతుగా ఉందో.. నీకు వెచ్చని కోటు లేదు కదా… అందుకే..” అంటూనే లెక్క పెట్టే పని ఆపకుండా..  చెప్పొద్దూ నాకు ఎలాగో అనిపించింది. “అవును ఒక మనిషికి ఎన్ని పక్కటెముకలు ఉంటాయి చెప్పు” ఆమె మాటలు పక్కదారి పట్టిస్తూ అన్నది.

“ఒకపక్క తొమ్మిది మరోపక్క పది ఉంటాయి” అన్నాను. “ఏదీ నీ చేయితో తీసేయ్ లెక్క పెడతా.. ఎన్ని ఉంటాయో ఒకటి.. రెండు.. మూడు..” నాకాక్షణంలో అక్కడి నుంచి పారిపోవాలి అనిపించింది. కానీ ఏమైనా గట్టిగా పట్టుకుందా.. నేను గింజుకోసాగాను బేగంజాన్ పెద్దగా నవ్వసాగింది.

ఈరోజుకి కూడా ఆమె నవ్వుతున్న ముఖాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నేను భయంతో వణుకుతాను. అలా నవ్వుతున్నప్పుడు ఆమె కనురెప్పలు ముందుకు వాలిపోయి ఆమె పై పెదవుల మీద నల్లని నీడ పడింది. చమట నీటి ముత్యాల లాగా ఆమె పై పెదవి ముక్కు మీద మెరవసాగింది. అంత చలికాలంలో కూడా బేగంజాన్కి చెమట పట్టడం విచిత్రంగా అనిపించింది. ఆమె చేతులు మంచులా చల్లగా చెమట వల్ల తేమగా ఉన్నాయి. ఆమె తన షాల్ తీసి విసిరి కొట్టింది. ఆమె కార్గా కుర్తాలో ఆ మె శరీరం ఒక మైదా ముద్దలా అనిపించింది. బరువైన బంగారు బటన్లం తెరిచి ఒక వైపు వేలాడుతున్నాయి.

అది చలి కాలపు సాయంకాలం గదిలో మెల్లగా చీకటి అలుముకోబోతోంది. ఒక వింత భయం నన్ను ఆవరించింది. బేగంజాన్ లోతైన కళ్ళు నన్నే చూస్తున్నాయి. నాకు ఏడుపు వచ్చేసింది. ఆమె నన్ను మెల్లగా నలప సాగింది. నేను ఏదో పిండి బొమ్మనైనట్లు. ఆమె వెచ్చని శరీరం నుండి ఒక రకమైన వాసన నన్ను అక్కడి నుంచి పారిపో పారిపోమ్మంటూంది.. కానీ ఆమె ఏదో దయ్యం పట్టిన దానిలాగా నన్ను నలిపేయ సాగింది. నేను ఆ క్షణాల్లో అరవలేకపోయాను కనీసం ఏడవలేకపోయాను కూడా.. కొంచెం సేపు అయ్యాక ఆమె అలసిపోయి, పరుపు మీద వెనక్కి వాలిపోయింది. ఆమె బరువుగా శ్వాస తీసుకుంటుంది. ఆమె ముఖం పాలిపోయింది. ఆమె దిగులుగా కూడా కనిపించింది. నాకు ఆమె ఆ క్షణాల్లో చనిపోతుందేమో అనిపించింది. మరుక్షణం గదిలోంచి పారిపోయాను..

అమ్మయ్య రబ్బు ఆ రాత్రి తిరిగి వచ్చింది. అందుకు ఖుదాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆ రాత్రి భయంతో చాలా త్వరగా మంచం మీద పడుకొని నా బొంతను నిండుగా కప్పుకొని పడుకున్నాను. కానీ చాలాసేపు నిద్ర పట్టలేదు.

ఆగ్రా నుంచి అమ్మి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకో నాకు బేగంజాన్ అంటే ఎంత భయం వేసిందంటే.. నా సమయాన్ని ఇంట్లో ఉండే ఇతర నౌకరులతో గడపడం మొదలుపెట్టాను. ఆమె గదిలోకి కాలు పెట్టాలంటేనే చాలా భయం వేస్తున్నది. ఆమె గదిలోకి ఎందుకు ఎందుకు వెళ్లట్లేదని ఎవరైనా అడిగితే, నేనేమి సమాధానం చెప్పాలి. బేగంజానంటే భయమని చెప్పాలా.. ఏ బేగంజాన్ తో అయితే నాకు అత్యంత సాన్నిహిత్యం ఉందో, ఆ బేగంజాన్ అంటేనే భయం అని చెప్పాలా.. ఎలా ఆ రోజు బేగంజానికి రబ్బూకి ఏదో గొడవ అయింది. అది శుభంగా అనిపించలేదు నాకు. ఎందుకంటే బేగంజాన్ కళ్ళు నా మీద ఉన్నాయి కాబట్టి.

అక్కడే ఉన్న నన్ను సూటిగా పరీక్షగా చూసింది. ఆమెకెందుకో నేను తనని తప్పించుకొంటూ చాలాకాలం బయట తిరగడం వలన న్యూమోనియా వచ్చి చనిపోతానేమో అనిపించింది ! బిడ్డా… ! ఏంటిది? నన్ను నలుగురిలో పెట్టి పరువు తీద్దామనా? అలా చేస్తే ఎంతటి ఘోరం అవుతుందో తెలుసా నీకు?’’ అంది. తన ముఖం, చేతులు వాష్ బేసిన్ లో కడుక్కున్నాక నన్ను తన పక్కనే కూర్చో బెట్టుకుంది.

చాయ్ అక్కడి టీపాయ్ మీద ఉంది. “పద చాయ్ చేసి నాకివ్వు’’ తన ముఖాన్ని టవల్ తో తుడ్చుకొంటూ అంది “నేను నా బట్టలు మార్చుకొని వచ్చేస్తాను ఇంత లోపల‘‘ అంది. ఆమె బట్టలు మార్చుకుంటుంటే నేను చాయ్ తాగాను.

ఆమె మర్దనా చేయించుకుంటూ ఉన్నపుడు ఆమె నా కోసం చాలా సార్లు కబురు చేసింది. నేను లోపలికి వెళ్లాను కానీ మొఖం పక్కకి తిప్పుకుని ఆపని చేసి బయటకు పారిపోయాను. ఆమె తన బట్టలు మార్చుకుంటు ఉన్నప్పుడు నాకు ఎందుకో భయం వేసింది ఆమె నుంచి చూపు తిప్పుకొని టీ తాగాను.

మా అమ్మ మీద నాకు పట్టరాని కోపం వచ్చింది. ఇట్లా నా అన్నలతో గొడవ పడ్డప్పుడు పడే శిక్షకంటే ఇది చాలా దారుణమైన శిక్ష నాకు.

అమ్మకి ఎప్పుడూ నేను అబ్బాయిలతో ఆడుకోవడం ఇష్టం ఉండేది కాదు. వాళ్ళేమన్నా నరమాంస భక్షకులా నన్నేమైనా తినేస్తారా అమాంతం చెప్పండి? ఇంకా ఆ మగ పిల్లలు ఎవరు? నా స్వంత అన్నలు ఇంకా వాళ్ళ ప్రియమైన దోస్తులూ అంతే! కానీ మా అమ్మ ఉంది చూసారూ ఆమెకి ఆడవాళ్ళు మగపిల్లలతో అస్సలు కలిసి ఆడుకోకూడదన్న విషయంలో బలమైన విశ్వాసం ఉంది.

కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి మరి? ఈ బేగం జాన్ ఈ లోకంలో ఉండే చాలా మంది లోఫర్ల కింద కూడా ఘోరంగా భయపెడుతున్నది కదా? నాకైతే ఇక్కడినుంచి దూరాలకు ఏదైనా పారిపోవాలన్పిస్తుంది. కాని నా కోరికకి వ్యతిరేకంగా అక్కడే ఉండాల్సిన ఖర్మ పట్టింది నాకు అమ్మ ఆగ్రా నుంచి తిరిగి వచ్చేంతవరకూ!

బేగం జాన్ తనని అలంకరించుకొని ఒళ్ళంతా గాఢమైన చిక్కని అత్తరు చల్లుకుంది. ఇక నాపై ప్రేమ కురిపించడం మొదలెట్టింది.

‘‘నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది’’ ఆమె అన్న ప్రతీ మాటకు నేను ఇదే సమాధానం  చెప్తూనే ఏడ్చేయసాగాను.

‘‘ఓహ్… ఆగాగు ఏడవకు… ఈ రోజు నేను నిన్ను బాబోరుకు తీసుకెళతాను సరేనా?

కానీ నేను నా ఇంటికి వెళ్ళిపోతాననే మొండిగా అడాయించుకుని కూర్చున్నాను. ఈ లోకంలో ఉన్న అన్నీ రకాల బొమ్మలు, మిఠాయిలు నాకేం ఆసక్తి కలిగించట్లేదు. నాచెంపపై మెల్లిగా తడుతూ “నీ అన్నలు నిన్ను చావగొడతారు పిచ్చి పిల్లా’’ అంది నైసుగా

‘‘కొట్టనివ్వు’’ అన్నాను నేను నిర్లక్ష్యంగా ‘‘పచ్చి మామిడి కాయలు తినడానికి పుల్లగా ఉండి తినలేరు బేగం జాన్’’ అంది రబ్బూ బుసకొడ్తున్నట్లు అసూయతో దహించుకుపోతూ.

ఆమరుక్షణమే బేగం జాన్కి మూర్ఛ వచ్చేసింది.  కానుకగా ఇచ్చిన బంగారు నెక్లెస్ ముక్కలైంది. ముస్లిన్ జాలీ దుపట్టా చిరిగి చీలికలు పేలికలు అయ్యింది.

ఆమె చక్కని కుదురైన జుట్టు చిందరవందరై మెలికలు మెలికలుగా చుట్టుకు పోయింది.

‘‘ఓ…ఓ…. హమ్మ్’’ అంటూ ఆమె బిగుసుకుపోతూ అరవసాగింది. నేను భయంతో బయటకు పరిగెత్తాను.

బేగం జాన్ పరిచర్యలు అయ్యాక మెల్లగా కోలుకుని మామూలు స్థితికి వచ్చింది. నేను మెల్లగా మునికాళ్ళమీద నడుస్తూ ఆమె గదిలోకి తొంగి చూసాను.

ఎపుడు లాగే రబ్బూ ఆమె శరీరాన్ని చేతులతో రుద్దుతూ నడుము మీద మర్ధనా చేస్తున్నది.

నీ చెప్పులు తీసెయ్యి బేగం అంది రబ్బూ బేగమ్ జాన్ పక్కటెముకలను రుద్దుతూ.

ఆ రాత్రి నేను ఎలుకపిల్లలాగా నా బొంతలోకి దూరిపోయాను. ఇంతలో అక్కడ ఒక వింత శబ్దం వినిపించసాగింది.  ఆ మసక చీకట్లో బేగం జాన్ మెత్తటి బొంత గోడ మీద ఏనుగు ఆకారంలో వణుకుతూ ఊగసాగింది. ‘‘అల్లాహ్! ఆహ్! అంటూ నేను చిన్న కేక లాంటిది వేసాను భయంతో. బొంత లోపల ఉన్న ఏనుగు కాస్తంత ఎగిరి లేచి మంచంపైన కూర్చుంది. నేను మూగదానిలా నిశ్శబ్దంగా ఉండిపోయాను. కానీ మళ్ళీ ఆ ఏనుగు ఊగసాగింది. నాకు చాలా భయం వేసింది. ఇంక లేచి వెంటనే లైట్ వేసేసాను ఏది జరిగితే అది జరగనీ అని. ఏనుగు మళ్ళీ బొంతలోపల పెనుగులాడుతున్నట్లు కదలసాగింది లేచి కూర్చేనే ప్రయత్నం చేస్తున్నట్లు లోపల్నించి ఊరగాయ ముక్కను చప్పరిస్తున్నట్లు ఎవరో ఆమె పెదాలను ముద్దు పెట్టుకుంటున్నట్లు శబ్దాలు వస్తున్నాయి.

అప్పుడు నాకు అర్థమైంది. పొద్దుట్నుంచీ బేగం జాన్ ఏమీ తిననే లేదు. ఇక ఈ రబ్బూ ఉందే మంత్రగత్తె ఏవో తినిపిస్తూ ఉండి ఉంటుంది బొంత కింద దూరి! నేను ఆ గదిలోని గాలిని గాఢంగా పీల్చాను ఏదైనా ఆహార పదార్థం వాసన వస్తుందేమోనని కానీ బేగం జాన్ అద్ధుకునే గాఢమైన అత్తరు వాసన, గంధం, ఆమె తలకు వేసుకునే హెన్నా వాసనే నాకు తగిలింది.

ఖర్మ! మరోసారి మంచంమీద ఆ బొంత ఊగసాగింది. నేను నిద్రపోవడానికి శతధా ప్రయత్నించాను. కానీ ఆ బొంత గోడమీద ఏనుగు ఆకారంలో నే కాదు రక రకాల ఆకారాలు మారి ఊగసాగింది. నేను అమితమైన భయంతో వణికిపోయాను.

‘‘ఒహ్హ్… అమ్మ’’ నేను గుసగుసలాడినట్లే అన్నా ధైర్యంగానే అన్నాను. కానీ ఎవరూ గమనించనే లేదు.  ఆ బొంత నామెదడులో దూరిపోయి మెల్లగా పెద్దగా పెరిగిపోవడం మొదలెట్టింది. భయంతో నేను నా కాలును మంచానికి మరోవైపు సాగదీసి స్విచ్ ఉన్న వైపుగా కాలు చాపి లైట్ ఆన్ చేద్దామని ప్రయత్నం చేసాను.

బొంత లోపలి ఏనుగు పిల్ల గంతులేసిందేమో బొంత మరికాస్త ఉబ్బినట్లుగా అయిపోయింది. బొంత లోపలి ఏనుగుపిల్ల మొగ్గలు వేసేప్పుడు బొంత దాదాపు ఒక అడుగుపైకి లేచింది…. ఓహ్…. ఖుదా నాకు ఊపిరాగినంత పనయిందనుకోండి. మరుక్షణం నేను నా మంచంలో మరింత లోతుకు కూరుకు పోయాను! ఓష్… అమ్మ… ఎప్పుడొస్తావు? నా మనసు ఆక్రోశించింది.

ఇస్మత్ చుగ్తాయ్

154. Ismat Chughtai - The Quilt and Other Stories with Tania Malik — Lost  Ladies of Lit Podcast1915, ఆగస్ట్ 21న సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో బదయోన్, ఉత్తరప్రదేశ్లో జన్మించింది. విప్లవకర భావాలున్న రచయిత్రి. భారతీయ సాహిత్యంలో ఇస్మత్ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇస్మత్ పద్మశ్రీ గారీబ్ అవార్డు గ్రహీత. విప్లవాత్మకంగా రాయడంలో పూర్తి స్వేచ్ఛను తీసుకునే ఈ సాహసోపేతమైన రచయిత్రిని Grand Dame of Urdu literature అంటారు. ఉర్దూ సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాకరమైన సాహసోపేతమైన రచయిత్రి అని అర్థం. స్త్రీల స్వేచ్చా,  సమానత్వం హక్కుల కోసం, స్త్రీ సాధికారత కోసం గొప్పగా గళమెత్తి పుంఖాను పుంఖాలుగా సాహితీ సృజన చేసిన రచయిత్రి. స్వేచ్చగా తన భావాలు ప్రకటించే స్త్రీవాదిగానే కాదు వర్ణ లైంగికత మీద తొలిసారిగా సాహిత్యంలో వైరుధ్యం ఫెమినిజం రాసిన రయిత్రిగా ఆమె ఉర్దూ సాంఘిక చరిత్రలో నిలిచిపోయింది. ఛుగామ్ ఆలీఘర్, యూపీ, లాహోర్ కేంద్రంగా ఉండే ప్రచురణ సంస్థల కోసం 1940 దశకంలో చాలా సాహిత్యం రాసారు. లాహోర్ లో ఆమెరాసిన ఈ లీహాఫ్ కథ మీద బ్రిటన్ కోర్ట్ ట్రయల్ జరిగినప్పుడు ఇస్మత్ చుగ్తాయ్ వాళ్ళు కోరిన క్షమాపణలు.

admin
admin
sahityam.adarsini.com
Previous Post

హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ

Next Post

కెనడా కవిత : My heart soars

Next Post
కెనడా కవిత : My heart soars

కెనడా కవిత : My heart soars

Discussion about this post

ఈ సంచికలో…

  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com