• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

గుజరాతీ కథ: కాకాజీ నీతికథ

పాలెపు బుచ్చిరాజు by పాలెపు బుచ్చిరాజు
July 10, 2026
in అనువాద కథలు
0
గుజరాతీ కథ: కాకాజీ నీతికథ

గుజరాతీ మూలం: సుమన్ షా
అనువాదం: పాలెపు బుచ్చిరాజు

ఓ ! పురజనులారా! కర్ణావతి నగరాన్ని ఏలిన దూర్వాసావతార, రాజా ఆవంతిసేన్ కాలంలోజరిగిన యదార్థగాధ వినండి.

అవంతిసేన్ రాజ్యంలో సేవంతిలాల్ అనే వర్తకుడు ఉండేవాడు. అతనికి భార్య రామాగౌరి ద్వారా సంతానం కలగలేదు. అందువల్ల వారు ఒక పంచరంగుల రామచిలకని పెంచుకున్నారు. రామాగౌరి దానికి “కాకాజీ” అని పేరు పెట్టుకుంది. సమయం చిక్కినప్పుడల్లా ఆమె దానికి మనుషుల భాష నేర్పే ప్రయత్నం చేసేది. పంజరం బంగారంది అయితే కాదు గాని, సేవంతిలాల్ తన గుండులా ప్రకాశించే ఇత్తడిది చేయించాడు. ఆ పక్షి దానిలో ఆనందంగా ఉంటూ, ఆ యింటి వారిని అలరిస్తూ ఉండేది. రోజులు గడి చాయి. నెలలు వెళ్ళాయి, ఋతువులు మారాయి. కాని కాకాజీ భాషలో ఏమి మార్పు రాలేదు. కాని, ఒకనాడు ఉన్నట్టుండి ఒక మిట్టమధ్యాహ్నం వేళ రామాగౌరి ఇంట్లో ఉండగా ఆ చిలక మొదటిసారిగా “సీతారాం! సీతారాం!”  అని అరిచింది. 

ఆ తరవాత మాత్రం, కాకాజీ, ఆ మాటనే మళ్ళీ మళ్లీ వల్లెవేయ సాగింది. పగలంతా బజార్లో తిరిగి తిరిగి అలసిపోయిన సేవంతిలాల్ మనసులా సాయంత్రానికి సూర్యుడు కాకాజీని నిద్రపోగోట్టేవాడు. తరవాత రామగౌరి ఆవులింతలా పశ్చిమానికి జారిపోయేవాడు. కాకాజీ మాత్రం ఏ ప్రశ్న కైనా సమాధానం “సీతారాం! సీతారాం!” అనే ఇచ్చేది.  

రోజులు గడిచిన కొద్దీ కాకాజీ- ‘సీతారాం’ పలుకులతో ఆ దంపతులు విసిగి పోయారు. కాకాజీ దానంతట అది ఎగిరిపోతే బాగుండునని అనుకునే వారు. అందుకు వీలుగా సేవంతిలాల్ పంజరం తలుపులు ఎప్పుడూ తెరచే ఉంచేవాడు.  కాని కాకాజీకి ఆ పంజరం అంటే ప్రాణం. ఎందుకు ఎగిరిపోవాలి? ముక్తి ద్వారం తెరుచుకున్నా, అమాయకపు కాకాజీ అర్థం చేసుకోలేదు. కాకాజీ గుండ్రని కళ్ళకి ఆ పంజరం కరిగిపోయిన మంచులా కనిపించేది. గాభరా పడిపోయి అది “సీతారాం! సీతారాం!” అని అరిచేది. రామాగౌరికి ఆ యింట్లోనే కాకుండా ఆ వీధి అంతా “సీతారాం!” ధ్వనితో నిండిపోయినట్టు అనిపించేది. కాకాజీని ఎవరైనా ఎత్తుకెళ్ళినా బాగుండు ననిపించింది ఆమెకి. 

ఇలా ఉండగా, ఒక వైశాఖమాసపు మధ్యాహ్న సమయంలో తెల్లటి గడ్డాలు, మీసాలు ఉన్న ఒక సాధువు ఆ యింటికి వచ్చాడు. ఆ సమయంలో సేవంతిలాల్ ఇంట్లో లేడు. సాధువు రాకతో చాలా సంతోషించిన రామాగౌరి  అతని ఎదురుగా కాకాజీని “నీ పేరేంటి?” అని అడిగింది. సమాధానం “సీతారాం” అని వచ్చింది. అది విన్న సాధువుకి అది చాలా ధార్మిక స్వభావం ఉన్న పక్షిలా అనిపించింది. చొరవ తీసుకుని సాధువే దానిని “నీకేమిటంటే ఇష్టం?” అని అడిగాడు. మళ్ళి అదే జవాబు. “సీతారాం! సీతారాం.!” కాకాజీ  పలుకులకి విస్తుపోయిన సాధువు ఉండబట్టలేక, “నాతో రావడం నీకు ఇష్టమేనా?” అని అడిగాడు. “సీతారాం! సీతారాం” అని సమాధానం. ప్రత్యేకించి అడగవలసిన అవసరం లేకుండానే  కాకాజీని రామాగౌరి సాధువుకు అప్పగించింది. 

ఇప్పుడు కాకాజీ నివాసం అడవిలో ఎండిపోయిన నది ప్రక్కన ఉన్న చిన్న కుటీరంలోకి మారింది. పంజరం ఇనుప ఊచలతొ చేసినది. సాధువు కాకాజీని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఆయన తన ఆశ్రమంలోని నూతి నీళ్ళతో రోజూ కాకాజీకి స్నానం చేయిస్తున్నాడు.  బజారు నుంచి తినుబండారాలు తెచ్చి తినిపిస్తున్నాడు. పండు మిరపకాయలు కొరికిస్తున్నాడు. కాకాజీకి కూడా ఆ పర్వత ప్రాంతపు గాలి బాగా నచ్చింది. అప్పుడప్పుడూ నోరుచాపి, నీళ్ళు తాగుతూ ఉన్నట్టుగా ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉండేది. సాధువుకి కూడా ఆ నిర్జనారణ్యంలో  ఒంటరి జీవితం కాకుండా కాలక్షేపానికి ఈ పక్షి దొరికినందుకు సంతోషంగా ఉంది. ఆయన చింతలన్నీ మరిచిపోయి, కాకాజీకి మాటలు నేర్పసాగాడు. “చెప్పు కాకాజీ! నీ పేరేమిటి?” సమాధానం వస్తుంది. “నీ అమ్మ నాన్నల పేరేమిటి?”  “సేవంతిలాల్, రామాగౌరి.”  “నీకు మిరపకాయలు ఎవరు కొరికిస్తారు?” “మీరే! సాధుమహరాజ్!”  “ఈ రోజు ఏ వారం?”  “ఆదివారం” ‘‘ఇది ఏ ఋతువు?” “వసంతం.”  

రాను రాను సాధువుకి కూడా కాకాజీ అంటే విసుగెత్తసాగింది. దానిని ప్రశ్నించి ప్రశ్నించి సాధువు అలసి పోయాడు. కాకాజీతో మాట్లాడాలంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన పళ్ళు తోముకున్నంత నిర్లక్ష్యంగా దానితో మాట్లాడ సాగాడు. ఈ పక్షిని ఎలాగైనా వదిలించుకోవాలని అనిపించేది. ఒకనాడు పక్క ఊరికి  భిక్షాటనకి పోతూ కావాలనే పంజరం తలుపు తెరిచి వదిలేశాడు. కాని, కాకాజీని  ఆ కాస్త తలుపు మధ్యలోంచి కనిపించే నీలి ఆకాశం ఆకర్షించ లేకపోయింది. సాయంత్రం తిరిగి వచ్చిన సాధువుకి నిరాశే ఎదురయ్యింది. మర్నాడు ఉదయమే స్నానం చేయిస్తున్న సమయంలో కపట ప్రేమ ఒలక బోస్తూ, సాధువు కాకాజీని ఎన్నో ప్రశ్నలు వేశాడు. అన్నిటికి, సమాధానం, “సీతారాం! సీతారాం” అనే వచ్చింది. దీనికి ఏమయింది? మళ్ళీ పాత పాటే పాడుతోంది? అని ఆలోచనలో  పడ్డ సాధువు గొంతు ఎండి పోయింది.

ఇలా ఉండగా ఒక వైశాఖమాసపు మధ్యాహ్నం ఆ ఆశ్రమానికి పెద్దనల్లని జుట్టు, గడ్డాలు మీసాలు , చేతిలో తుపాకి, తూటాల బెల్టు ఉన్న గజదొంగ మాన్ సింగ్ వచ్చాడు. సాధువు ఆ రోజు అతనికి ఆశ్రయం ఇచ్చాడు. తెల్లవారుఝామున  ఇంకా చీకటి ఉండగానే  మాన్ సింగు వెళ్ళడానికి తయారు అయ్యాడు. సాధువు దగ్గర ఉన్న కాకాజీ మాటలు అతనికి ఎంతో నచ్చాయి. అతను నవ్వుముఖంతో, సాధువుని “ఆ చిలకని నాకివ్వండి” అని అడిగాడు.  అదే అవకాశంగా తీసుకుని సాధువు పంజరంతో సహా దానిని అతనికిచ్చి వదిలించుకున్నాడు. “సీతారాం! సీతారాం!” అని పలికే పక్షిని చూసి, మాన్ సింగ్ సాధువు దగ్గర పెరిగిన పక్షి అమాయకంగానే ఉంటుంది అనుకున్నాడు.  

కాకాజీని మాన్ సింగ్ తన నివాసం అయిన కొండ గుహలో  పంజరంతో సహా వేలాడ గట్టాడు. ఇప్పుడు కాకాజీ గుహలో చల్లని గాలిని ఆస్వాదిస్తోంది. కాని, ఆ గజదొంగ రాత్రిపూట దొంగతనాలకి పోయినప్పుడు మాత్రం తనకి భయం వేసేది. రాత్రంతా తిరిగి, తిరిగి అలసిపోయి వచ్చిన మాన్ సింగ్ పగలంతా కొబ్బరి తాళ్ళ మంచం మీద పడి నిద్రపోయేవాడు. ఒకనాటి సాయంత్రం వాడు కాకాజీని “నీకు ఇక్కడ బాగానే ఉందా?” అని అడిగాడు. “బాగానే ఉంది” జవాబు. “ఆ సాధువు ఎప్పుడైనా గుర్తుకి వస్తాడా?”  “వస్తాడు”  ‘‘నేను ఇక్కడ లేకపోయినా నీకు బాగానే ఉంటుందా?”  “బాగుండదు.”  జవాబు నోటి చివరి వరకు వచ్చి ఆగిపోయింది. 

మాన్ సింగ్ దయ, కోపం, క్రోధం, ప్రేమ కలిసిన మేళవించిన భావాలతో కాకాజిని తన చేతిలోకి తీసుకున్నాడు. “ఫో! ఇక్కడి నుంచి. నా తుపాకి గుండు శబ్దం ఈ గుహలో ప్రతిధ్వనించక ముందే ఎగిరి పో!” అని అరిచాడు. తుపాకి గుండు శబ్దం వినిపించే లోగా కాకాజీ, బైట వేపచెట్టు చిటారు కొమ్మ మీద అరుస్తూ కనిపించింది.

తరవాత చాలా రోజులు గడిచిపోయాయి.  

ఇప్పడు కాకాజీ ఆవంతిసేన్ అంతఃపురంలో బంగారు పంజరంలో ఆనందంగా ఉయ్యాల లూగుతోంది. ఎదురుగా నీలి రంగు కొండల మీది నుంచి వచ్చే చల్లగాలి కాకాజీ తోకని కదలిస్తోంది. రాజా, రాణి, మంత్రి, దాసదాసీలు ప్రేమతో ఆదరిస్తున్నారు. రాజావారు రోజూ తన తర్జనిని, కాకాజీ నోట్లో పెట్టికాని దర్బారుకి వెళ్లరు. ఇంకా పట్టపు రాణి అయితే, తన తాంబూలంలో సగం కాకాజీకే ఇస్తోంది. అంతా ఆనందంలో తేలియాడుతున్నారు. కాకాజీ బుద్ధి పుట్టినపుడల్లా ఓ పండు మిరపకాయ తిని ఆ రుచిని అస్వాదిస్తోంది. 

కానీ..

ఒక పౌర్ణమి నాడు కాకాజీకి పూర్వపు రోగం పొడసూపింది.  “సీతారాం! సీతారాం!” అని  ఒకే పనిగా అరవ సాగింది. పూజ గదిలో చంద్రుడిని పూజించి వస్తున్న రాణి వారిని ఈ మార్పు చింతలో ముంచింది. శుభమా అని వ్రతం చేసుకున్న సమయంలో ఇది ఇలా అరవడం ఆమెకు నచ్చలేదు. ఈ విషయం రాజావారితో ఫిర్యాదు చేసింది. రాజా ఆవంతిసేన్ మనసు క్రోధంతో నిండిపోయి, కళ్ళు ఎర్రబడ్డాయి. 

రాజావారు మంత్రి గారిని పిలిపించారు. “కాకాజీ ఎందుకు ఇలా అరుస్తోంది? “ అని  అడిగారు. మంత్రిప్రశ్నలకి కూడా అదే సమాధానం. ”సీతారాం! సీతారాం!”. ఈ సమస్య దర్బారుకి వెళ్ళింది. అక్కడ వారికి ఏమి తెలియలేదు. నగరంలో ప్రజల్ని అడిగారు. ఊరంతా దండోరా వేయించారు. కాకాజీ- ‘సీతారాం,సీతారాం’ తప్ప మరేమీ మాట్లాడక పోవడానికి కారణం చెప్పిన వారికి, వంద బంగారు నాణాలు ఇస్తారని.  దురదృష్టవశాత్తు ఎవరూ రాలేదు. సేవంతిలాల్ కాని, రామా గౌరి కానీ, సాధువు కాని, మాన్ సింగ్ కాని, ఎవరూ ముందుకు రాలేదు. 

అవంతిసేన్ మనసులో పక్షి మీద కోపం ఎక్కువై, అతన్ని దహించి వేయసాగింది. అసలే ఆయన దుర్వాసావతారుడని ప్రసిద్ది పొందినవాడు.  ఒకనాడు ప్రధాన మంత్రి ఎదురుగా ఉండగా, సింహాసనం మీద నుంచి ఎగిరి గంతేసి, అరవసాగాడు. “ఈ దుష్ట పక్షిని ఇంటిలోనుంచి తరిమేయండి.” అది విన్న మహారాణి, దాసిజనం, ప్రతిహారులు అందరు పరుగు, పరుగున అక్కడికి వచ్చారు. కాకాజీ భయంతో కుంచించుకు పోయింది. తన గుండ్రటి కళ్ళతో ఇటు, అటు చూడసాగింది. కోపంతో  ఊగిపోతున్న రాజావారిని, చూసి, ప్రధాని, చేతులు నలుపు కుంటూ, “రాజా! శాతించండి. ఇది  కేవలం ఒక పక్షి మాత్రమే.”అంటూ రాజుగారి పాదాలమీద పడ్డాడు. ఇంతలో, దర్బారు హాలులో, కర్నావతిలోని జనమంతా ఏకమయ్యారు. వారిలో సేవంతిలాల్, రామాగౌరి, సాధువు, మాన్ సింగ్ కూడా ఉన్నారు. అందరూ ఏమౌతుందా అని  మోరలెత్తి,  అంతఃపురం వైపు చూస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. 

ప్రధాన మంత్రి, “రాజా! నేను దానికి నేర్పిస్తాను. మీరు కాస్త శాంతించండి.”అంటున్నాడు.  కాని అవంతిసేన్ కోపం ఆపుకోలేకపోయాడు. అంతఃపురంలో గోడకి తగిలించి ఉన్న తుపాకీని చేతిలోకి తీసుకున్నాడు. వద్దు, వద్దని బతిమాలుతున్న రాణినీ, మంత్రిని లెక్క చేయకుండా పంజరం వైపు గురిపెట్టాడు. క్షణంలో ‘ఢాం’ అని శబ్దం. అక్కడ పంజరం లేదు. వ్రేలాడగట్టిన గొలుసు ఊగుతూ కనిపించింది. క్రింద దర్బారు ప్రాంగణంలో దభీమని పడిన పంజరాన్ని ప్రజలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. దానిలో కాకాజీ రంగు రంగుల ఈకలు రక్తసిక్తమై ఎర్రగా మారిపోయాయి. అక్కడ అందరూ క్రింద పక్షిని, మేడ మీద ఆవంతిసేన్ నీ మార్చి మార్చి చూసున్నారు. 

అదే సమయంలో ఒక శబ్దం పదే పదే వినిపించ సాగింది. “సీతారా! సీతారాం!” అని. కాని దానిలో కాకాజీ కలకంఠ స్వరం  లేదు. 

పురజనులారా! కర్ణావతి నగరంలో ఈ కాకాజీ కథని ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అవును! చెప్పగూడదన్న నియమం ఏమీ లేదుగా!

పాలెపు బుచ్చిరాజు

స్వస్థలం గునుపూడి, విశాఖపట్నం జిల్లా. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర పట్టా పుచ్చుకుని, ‘చమురు సహజవాయు సంస్థ’ లో భూభౌతిక శాస్త్రజ్జుడిగా, ఉద్యోగ రీత్యా 1965 డిశంబరు నెలలో మొట్టమొదటి సారిగా గుజరాత్ నేల మీద అడుగుపెట్టారు. 1968లో బరోడా వచ్చి స్థిరపడ్డారు. 40 సంవత్సరాలుగా కథలు, వ్యాసాలూ, నవలలు సుమారు రెండు వందల వరకు రాశారు. వీటిలో స్వంత రచనలేకాక , గుజరాతీ, ఆంగ్ల భాషల్లోంచి చేసిన అనువాదాలు కూడా ఉన్నాయి. నాలుగవ ప్రపంచ మహా సభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు, ‘రాష్ట్రేతరాంధృడిగా తెలుగు భాష వ్యాప్తికి వీరు చేస్తున్న కృషిని గుర్తించి 2012 లో సత్క రించారు.
2016 లో ”గుజరాతీ సాహిత్యం – ఒక విహంగ వీక్షణం” పేరున పుస్తకం ప్రచురించారు. శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు స్థాపించిన ‘కథానిలయం’ లో వీరి కథలు చదివిన ఒక విద్యార్థిని, వ్రాసిన సిద్ధాంత వ్యాసం ‘పాలెపు బుచ్చిరాజు కథలు – పరిశీలన’కు, 2022 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం పిహెచ్ డి ప్రదానం చేసింది.

Previous Post

ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు

Next Post

ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న

Next Post
హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!

ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply