• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కవిత : దశలు

బొల్లిముంత వెంకటరమణారావు by బొల్లిముంత వెంకటరమణారావు
July 10, 2026
in అనువాద కవితలు
0
ఆంగ్ల కవిత : దశలు

ఆంగ్ల కవిత: హెర్మన్ హెస్సే
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణారావు

ప్రతి పువ్వూ వాడిపోతుంది.
ప్రతి యౌవనమూ
ఒక రోజు వెనుదిరుగుతుంది.

అలాగే
జీవితంలోని ప్రతి దశ,
ప్రతి సద్గుణం,
మనం గ్రహించిన ప్రతి సత్యం—
మన పయనంలో
కొంతకాలమే తోడుంటాయి;
శాశ్వతంగా మనతో ఉండవు.

జీవితం-
ఏ వయసులోనైనా
మనల్ని కొత్త పిలుపుతో ఆహ్వానించవచ్చు.

అందుకే,
ఓ హృదయమా,

విడిపోవడానికి సిద్ధపడు.
కొత్త ప్రయాణాన్ని ఆహ్వానించు.

ధైర్యంగా ముందుకు సాగు;
పశ్చాత్తాపానికి చోటివ్వకు.

ఎందుకంటే
పాత అనుబంధాల్లో దొరకని వెలుగు
కొత్త దారుల్లోనే కనిపిస్తుంది.

ప్రతి ఆరంభంలోనూ
ఒక అద్భుత శక్తి దాగి ఉంటుంది.
అదే
మనల్ని కాపాడుతుంది;
మనల్ని జీవింపజేస్తుంది.

ప్రశాంతంగా
దూర దిక్కుల వైపు సాగిపోదాం.

‘ఇదే నా ఇల్లు’
అనే మమకారం
మన అడుగులను నిలువరించనివ్వకు.

విశ్వాత్మ
మనల్ని బంధించదు;
దశల దశలుగా
ఇంకా విశాలమైన ప్రపంచాల వైపు
మనల్ని నడిపిస్తుంది.

మనమే నిర్మించుకున్న
ఒక గూటినే
శాశ్వత నివాసంగా భావిస్తే,

పరిచయం
నెమ్మదిగా జడత్వంగా మారుతుంది.

అందుకే
విడిపోవడం నేర్చుకోవాలి;
వీడ్కోలు చెప్పడం అలవాటు చేసుకోవాలి.

లేకపోతే
శాశ్వతత్వమనే భ్రమకు
బానిసలమైపోతాం.

మన మరణ ఘడియ కూడా
మనల్ని
ఇంకా కొత్త విశాలతల వైపు
వేగంగా తీసుకెళ్లవచ్చు.

జీవితం
ఇంకా కొత్త జీవన దశల వైపు
మళ్లీ మనల్ని పిలవవచ్చు.

అలా జరగనీ,

ఓ హృదయమా—

వీడ్కోలు చెప్పడం
ఎన్నటికీ మరువకు.

హెర్మన్ హెస్సే 

హెర్మన్ హెస్సే (1877–1962) జర్మన్ మూలాలున్న స్విస్ రచయిత, కవి, వ్యాసకర్త, చిత్రకారుడు. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప సాహితీవేత్తలలో ఒకరైన ఆయన రచనలు వ్యక్తి ఆత్మాన్వేషణ, జీవిత పరమార్థం, ఆధ్యాత్మిక వికాసం, స్వేచ్ఛ, ప్రకృతి, ఒంటరితనం, నిరంతర మార్పు వంటి అంశాల చుట్టూ తిరుగుతాయి. మతపరమైన కుటుంబంలో జన్మించిన హెస్సే చిన్నప్పటి నుంచే సంప్రదాయ విశ్వాసాలకూ, వ్యక్తిగత స్వేచ్ఛకూ మధ్య సంఘర్షణను అనుభవించాడు; అదే ఆయన సాహిత్యానికి జీవం పోసింది. భారతీయ ఉపనిషత్తులు, బౌద్ధ తత్వం, తూర్పు ఆధ్యాత్మిక చింతన ఆయన ఆలోచనా ప్రపంచాన్ని గాఢంగా ప్రభావితం చేశాయి. సిద్ధార్థ, డెమియన్, స్టెప్పెన్‌వుల్ఫ్, నార్సిసస్ అండ్ గోల్డ్‌మండ్, ది గ్లాస్ బీడ్ గేమ్ వంటి రచనలతో ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన ఆయన, మానవ అంతరంగాన్ని అసాధారణమైన సున్నితత్వంతో ఆవిష్కరించినందుకు 1946లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని అందుకున్నాడు. జీవితం అనేది నిరంతర పరివర్తన; ప్రతి ముగింపు మరో ఆరంభానికి నాంది అనే ఆయన తాత్విక దృష్టి నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పాఠకులను ఆలోచింపజేస్తూనే ఉంది.

బొల్లిముంత వెంకటరమణారావు
బొల్లిముంత వెంకటరమణారావు
Previous Post

ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న

Next Post

ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 

Next Post
ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 

ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా... 

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply