• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న

బొల్లిముంత వెంకటరమణారావు by బొల్లిముంత వెంకటరమణారావు
July 10, 2026
in అనువాద కవితలు
0
హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!

ఇంగ్లిషు మూలం : పాబ్లో నెరుడా
తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు

ప్రేమా, అనే ఒక ప్రశ్న
నిన్ను ఛిద్రం చేసింది.

ముళ్లతో నిండిన
అనిశ్చితి నుంచి
నేను మళ్లీ
నీ దగ్గరకు వచ్చాను.

కత్తిలా సూటిగా,
రహదారిలా నేరుగా సాగేలా,
నువ్వు ఎలాంటి ముసుగులు లేకుండా
స్పష్టంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.

కానీ నువ్వు మాత్రం
నాకు ఇష్టం లేని
ఒక చీకటి మూలను
ఇంకా నీలో దాచుకుని
ఉండాలని కోరుకుంటున్నావు.

నా ప్రేమను,
నన్ను అర్థం చేసుకో.

నీ కళ్ల నుంచి
నీ పాదాల వరకు,
పాదగోళ్ల వరకు,
నీ అంతరంగంలో
నువ్వు దాచుకున్న
వెలుగంతా—
దానినంతా మనసారా
నేను ప్రేమిస్తున్నాను.

నీ గడపను తాకేది నేనే, నా ప్రేమా.

అది దెయ్యం కాదు.
ఒకప్పుడు
నీ కిటికీ దగ్గర ఆగిపోయిన
ఆ జ్ఞాపకం కూడా కాదు.

నేను
తలుపును పగలగొట్టి
లోపలికి అడుగుపెడతాను.

నీ జీవితంలోకి
ప్రవేశిస్తాను.

నీ ఆత్మలో
నివసించడానికి
వస్తాను.

నన్ను
నువ్వు అడ్డుకోలేవు.

నీలోని
ప్రతి తలుపూ
తెరవాలి.

నన్ను
అంగీకరించాలి.

నీ కళ్లను తెరువు,
వాటిలో
నేను వెతికేలా.

నేను ఎలా
భారీ అడుగులతో
నడుస్తానో
నువ్వు చూడాలి—

ఇన్నాళ్లూ
గుడ్డిగా
నా కోసం
ఎదురుచూసిన
ఆ దారులన్నిటిమీదుగా.

భయపడకు.

నేను
నీ వాడినే.

కానీ
నేను ప్రయాణికుడిని కాదు,
భిక్షగాడిని కాదు.

నేనే
నీ అధిపతి,
నువ్వు ఎదురుచూసిన వాడిని.

ఇప్పుడు
నీ జీవితంలోకి
అడుగుపెడుతున్నాను.

ఇక
వీడ్కోలు చెప్పడానికి కాదు—

ప్రేమా,
ప్రేమా,
ప్రేమా—

నీలో
నిలిచిపోవడానికి.

పాబ్లో నెరూడా

Pablo Neruda (జూలై 12, 1904 – సెప్టెంబర్ 23, 1973) 20వ శతాబ్దంలోని అత్యంత ప్రభావవంతమైన కవులలో ఒకరు. ఆయన అసలు పేరు రికార్డో ఎలియేసర్ నెఫ్తాలి రేయెస్ బసోయాల్టో. ఆయన జన్మస్థలం Parral, చిలీ దేశంలోని ఒక చిన్న పట్టణం.

చిన్న వయసులోనే “పాబ్లో నెరూడా” అనే కలం పేరుతొ రచనలు ప్రారంభించిన ఆయన, ప్రేమ, ప్రకృతి, మానవ భావోద్వేగాలు, అలాగే రాజకీయ చైతన్యం వంటి విభిన్న అంశాలను తన కవిత్వంలో వ్యక్తపరిచారు. ఆయన రచనలు సాదాసీదా భావనలతో పాటు గంభీరమైన ప్రతీకలతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులను ఆకర్షించాయి.

ఆయన ప్రసిద్ధ రచనల్లో Twenty Love Poems and a Song of Despair, Residence on Earth, Canto General ముఖ్యమైనవి. 1971లో ఆయనకు సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన Nobel Prize in Literature లభించింది.

ప్రతి సంవత్సరం జూలై 12న ఆయన జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కవితాభిమానులు గుర్తుచేసుకుంటారు ఆయన కవిత్వం నేటి వర్తమాన ప్రపంచానికి తన కవితలతో ప్రేమకు, మానవ అనుభూతులకు, జీవన సత్యాలకు కొత్త అర్థాలను అందిస్తూ కొనసాగుతోంది.

బొల్లిముంత వెంకటరమణారావు
బొల్లిముంత వెంకటరమణారావు
Previous Post

గుజరాతీ కథ: కాకాజీ నీతికథ

Next Post

ఆంగ్ల కవిత : దశలు

Next Post
ఆంగ్ల కవిత : దశలు

ఆంగ్ల కవిత : దశలు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply