• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ: నాలుగో ఆయామం

కోడిహళ్లి మురళీ మోహన్ by కోడిహళ్లి మురళీ మోహన్
July 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ: నాలుగో ఆయామం

కన్నడ మూలం: సవితా శ్రీనివాస
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్

స్క్రీన్ తెరుచుకోగానే, ఒక్కొక్క ఎంపికను ఎగుడుదిగుడుల సమీకరణాలతో ముందు వేసుకున్న హోలోగ్రాఫిక్ కాంతి ప్రతిబింబ కంప్యూజెక్టర్, రజత్‌కు తనలో నిక్షిప్తమైన అపార సమాచార భాండాగారాన్ని ఆవిష్కరిస్తోంది. రజత్ మనసులో ప్రస్తుతానికి మెదులుతున్న ఆలోచన ‘వ్యక్తి జీవనశైలి‘. అది వ్యక్తిగత స్థాయిలో వ్యక్తమైనప్పటికీ, క్షేత్ర స్థాయి మ్యాప్ యొక్క నిర్మాణాత్మక భూగర్భ శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకుని, భౌగోళిక కాలక్రమ శాస్త్రపు అన్ని పరిమితులను ప్రదర్శిస్తోంది.  

‘హే… మొదట నా వంతు. ఈ ప్రయోగానికి నేనే మొదటి ప్రయోగ వస్తువును‘ అనుకుంటూ, తన చిన్ననాటి నుంచి ప్రారంభమైన దైనందిన జీవన విధానాన్ని, ప్రస్తుత ఉద్యోగ జీవితంతో అనుసంధానించి, భవిష్యత్తు వైపు కూడా  తొంగి చూసాడు. తాను స్కూల్ బస్సు కోసం తల్లితో కలిసి వేచి ఉన్న స్థలం, పాఠశాల వార్షికోత్సవం జరిగిన వేదిక, సమయం దొరికినప్పుడు స్నేహితుల ఇంటికి పరుగెత్తిన వీధులు, తనకిష్టమైన షాపు, హోటల్… ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్లే క్లినిక్… తీరిక వేళల్లో గడిపే క్లబ్… ఒకటి కాదు, రెండు కాదు. తన దినచర్యను రూపొందిస్తూ, ఈనాటి తనను తీర్చిదిద్దిన ఆ రోజులు, ఆ కాలక్రమంలో తన ఇరవై ఏడేళ్ళ జీవితాన్ని గడిపిన రోజులకు ముగింపు పలుకుతూ ప్రస్తుత దశ తెరచుకుంది. దాన్ని తెరపైకి తెచ్చే ఆత్రుతలో అతనుండగా, అతని సహోద్యోగి భవిత అతని గదిలోకి వచ్చి, అతని పనిని గమనిస్తూ నవ్వుతూ అడిగింది— “రజత్… నీ ‘ఈ రోజు‘తో నా జీవిత సమీకరణం మొదలైందా?” ఆమె ప్రశ్న ప్రశ్న సహజంగానే ఉన్నప్పటికీ, రజత్ ఆమెను ఆటపట్టిస్తూ అన్నాడు— 

“అవును డియర్, ‘ఈ రోజు‘ గానీ, ‘రేపు‘ గానీ నువ్వు లేకుంటే ఖాళీగానే ఉంటాయి.” “హుమ్, చూశానులే రజత్, నీ పెట్ ప్రాజెక్ట్ కోసం నీ జీవితాన్నే పరీక్షగా ఎంచుకుని ప్రయోగ వస్తువుగా మారావు. అభినందనలు. కానీ అప్పుడప్పుడు ఆ వర్చువల్ ప్రపంచం నుంచి బయటికి వచ్చి, భోజనం, నిద్రల గురించి కూడా కొంచెం  దృష్టి పెడితే బాగుంటుంది.”

“అయ్యో… ఖచ్చితంగా డియర్, ఇంట్లో అమ్మ వంటను వదులుకోలేను కదా! ఇక ముందు నీ చేతి వంటను కూడా రుచి చూడవచ్చు…” అన్నప్పుడు, భవిత దానికి మరికొన్ని జ్ఞాపకాలను జోడించింది.  

“మనం డ్రాఫ్ట్ రూమ్‌లో తొలిసారి కలిసిన  రోజు గుర్తుందా? మన మేనేజర్ మ్యాప్‌కు డ్రోన్ వ్యూ గురించి వివరిస్తున్నప్పుడు నువ్వు నా ప్రాజెక్ట్‌కు సహాయం చేసిన సందర్భం… తర్వాత మనిద్దరం కలిసి ఆధునిక టెక్ పార్కుల మ్యాపులను రూపొందించిన రోజులు…” భవిత ఆ రోజులను గుర్తుచేస్తుంటే, రజత్ మనసులోనే ఆ సమయానికి సంబంధించిన బ్లూప్రింట్ మళ్ళీ రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది.  జీవితంలో కూడా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న ఆ రోజు నుంచే, తమ ఉమ్మడి భవిష్యత్తుకు సంబంధించిన ఒక చిన్న దృశ్యం అప్పుడే కనిపించినట్లనిపించింది. ప్రముఖ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా మ్యాపులు రూపొందించమని కోరినప్పుడు, భవిత క్షేత్ర స్థాయి సర్వేల బాధ్యతను తీసుకుంటే, రజత్ ఆ సమాచారాన్ని సమీకరించి, దానికి 3డి రూపాన్ని ఇచ్చేవాడు.

ఒకసారి పక్షుల వలస విధానాన్ని ఖండాల వ్యాప్తంగా ట్రాక్ చేస్తూ మ్యాప్ తయారుచేస్తున్నప్పుడు, ఆ పక్షులు ఎక్కడ సంతానోత్పత్తి చేశాయి, శీతాకాలంలో ఎక్కడ నివసించాయి, వేసవిలో నీటి కోసం ఏ నదీమూలాలకు గుంపులుగా చేరుకున్నాయి వంటి వివరాలను మ్యాప్‌లో ప్రతిబింబించడానికి నెలల తరబడి శ్రమించాల్సి వచ్చింది.

సాంప్రదాయ మ్యాప్ తయారీ కంటే భిన్నంగా, రజత్ ప్రభుత్వం కోసం ప్రమాదకర ప్రాంతాల మ్యాపులను రూపొందించే ప్రాజెక్ట్‌ను చేపట్టినప్పుడు, సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భవిత తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి, కొత్తవి కొనాల్సి వచ్చింది. ప్రభుత్వ అధికారుల ధోరణికి అనుగుణంగా వారి అభిప్రాయాలను వినడం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సమాచారాన్ని సేకరించడం ఆమె బాధ్యతగా మారింది. 

మ్యాప్ అంతటా పుర్రె గుర్తుతో ప్రమాద సంకేతాన్ని ముద్రించే కంటే, ‘ప్రమాదకర ప్రాంతాలు‘ అని ఎరుపు రంగులో చూపించడమే సరైనదిగా భావించారు. దాని వివిధ దశలను సిద్ధం చేయడానికి భవిత తిరగని ప్రభుత్వ శాఖ లేదు. ఏ ప్రాంతం ఎందుకు ప్రమాదకరమో తెలుసుకునే క్రమంలో, అక్కడ పాటించాల్సిన భద్రతా చర్యలు, సురక్షిత ప్రాంతాల గురించిన సమాచారాన్ని, ఇతర వివరాలను కూడా భవిత సేకరించి,  ఒక సమగ్ర “గ్రీన్ మ్యాప్“ రూపొందించేందుకు వీలు కల్పించింది. ఈ సంస్థకు కొత్త కస్టమర్లు, కొత్త ప్రాజెక్టులు రావడంలో భవిత చేసిన కృషి ఎంతో ఉంది. ఆ తర్వాత టెక్నీషియన్లు చేసిన పని రజత్ వద్దకు వచ్చేది. దానిని త్రీ డైమెన్షన్ రూపంలో సమీకరించడం ఒక సవాలుగా ఉండేది. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తూ, సంపూర్ణ రూపం ఇవ్వడానికి ఎంతో శ్రమించేవాడు. అయితే అతని పనులన్నీ ఇలాంటి సాంకేతిక ప్రాజెక్టులే కావు. ఏ మ్యాప్‌నైనా భౌతికంగా రూపొందించే ముందు, దానికి మానసికంగా సిద్ధం కావడం అత్యవసరమని అతడు నమ్మేవాడు. ఒక ప్రాజెక్ట్ పని పూర్తి కాగానే ఒక ఔటింగ్ (విహారయాత్ర)కు వెళ్ళి రావడం అతనికి అలవాటు. అలా చేయడం వల్ల శరీరానికీ, మనసుకీ విశ్రాంతి లభించి, తదుపరి సవాళ్ళను స్వీకరించడానికి మనస్సు సిద్ధమయ్యేది. ఇలా క్రమం తప్పకుండా సాగుతున్న దినచర్యలో భవిత ప్రవేశించింది, కొద్ది రోజుల్లో వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు.

 ఇంట్లో కూడా ఎటువంటి వ్యతిరేకత ఎదురు కాలేదు, పైగా కొడుకు పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నదే ఎక్కువ అన్నట్లుగా తల్లిదండ్రులు భావించారు. ఒక్కగానొక్క కుమారుడైన రజత్‌పై అతని తల్లిదండ్రులకు అపారమైన ప్రేమ.  అతని ఇష్టానికి అడ్డు చెప్పే మనస్తత్వం వారిది కాదు. అదీ కాక భవిత కూడా అదే వృత్తికి చెందిన అమ్మాయి కావడంతో, వృత్తి జీవితంలో కలిసి పనిచేసినట్లే ఇంట్లోనూ అలాగే అన్యోన్యంగా జీవిస్తారని వారు నమ్మారు. కొడుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే అన్ని కోణాల్లో ఆలోచించే ఉంటాడని నమ్మారు. ప్రవహించే నదికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయకుండా, కొడుకు నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించారు. కుటుంబ సభ్యులు తన ఇష్టానికి అంగీకరించడంతో భవితకు ఒక ప్రత్యేక పార్టీ ఇచ్చాడు రజత్. పెళ్ళి ముహూర్తం నిర్ణయించే బాధ్యతను పెద్దలకే వదిలేసి, ఈలోగా తన అత్యవసర ఆఫీస్ పనులను పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. 

గత జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టాన్ని తన డిజిటల్ మ్యాప్‌లో గుర్తించుకుంటూ, ముఖ్యమైన సంఘటనలు, దైనందిన కార్యకలాపాలను నమోదు చేస్తున్న సమయంలో అతని మొబైల్ లొకేషన్ ట్రాకర్ మరిన్ని ఆధారాలను అందిస్తూ అతని పనిని సులభతరం చేస్తోంది. హోలోగ్రాఫిక్ తెరపై వేళ్ళను కదుపుతూనే, రజత్ తన తండ్రికి ఫోన్ చేశాడు.

“డాడ్, మీ లొకేషన్ హిస్టరీని నాకు షేర్ చేయగలరా?”

“ఎందుకు రజత్? నా యాక్టివిటీ హిస్టరీ నీకెందుకు?”

“డాడ్, మా పెళ్ళి సందర్భంగా అందరికీ మా జీవిత ప్రయాణాన్ని ఒక  ప్రత్యేకమైన దృశ్యరూపంలో ప్రదర్శించాలనే ఆశ ఉంది. అది మిగిలిన పెళ్ళిళ్ళ కంటే భిన్నంగా ఉండాలి. అందుకోసం మీ జీవిత ప్రయాణాన్ని నా జీవితంతో అనుసంధానించాలి, అలాగే మమ్మీది కూడా కావాలి” అన్నప్పుడు, అతని తండ్రి ధారేశ్వర్, తన కొడుకు ఎలాంటి కొత్త సాహసానికి పూనుకున్నాడో అని కాసేపు బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. ఆ తర్వాత దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని భావించి, తన లోకేషన్ హిస్టరీని అతనితో పంచుకున్నాడు. అలాగే తన భార్య సుగుణ వివరాలను కూడా పంచుకోవడం మరచిపోలేదు.

కానీ పెళ్ళి రోజు దగ్గరపడుతుండటంతో రజత్ ఇలా బిజీగా ఉండటం వారికి నచ్చలేదు. బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు అందజేసే పని నెల రోజుల ముందే ప్రారంభం కావాలి. పెళ్ళి ఏర్పాట్లు చేయడం అంత సులువు కాదు. రెండు కుటుంబాలు కలిసి చేసే ఈ శుభకార్యంలో మొదటి నుండి రజత్, భవిత ఇద్దరూ చురుకుగా పాలుపంచుకోవడం అవసరం. కానీ రజత్ మాత్రం తన సొంత లోకంలో విహరిస్తూ, చేపట్టిన పనిని పూర్తి చేయకుండా వదలనన్నట్లుగా పట్టుదలతో కొనసాగుతున్నాడు భవితను కూడా తన లోకేషన్ హిస్టరీని పంచుకోమన్నాడు. ఇలా  వీరందరి కార్యకలాపాలు మ్యాప్‌లో రూపుదిద్దుకుంటుండగా, రజత్ అప్పుడప్పుడు భవితతో చర్చిస్తూ తన ఆశలను, కలలను ఆమెతో పంచుకునేవాడు. అందరి కార్యకలాపాలను ఎలా సమన్వయం చేస్తున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం ఆమెకు కలిగేది. కానీ రజత్ ఆ విషయాన్ని పక్కన పెట్టి తన భవిష్యత్తు ప్రణాళికల గురించే మాట్లాడేవాడు.

“భవితా, మన మేనేజర్ ఆశిష్‌కు ఈ యాక్టివిటీ–బేస్డ్ మ్యాపింగ్ గురించి చెప్పాను, దీనికి ఇప్పుడు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.”

భవిత ఆశ్చర్యంగా అడిగింది. “అంటే… మన జీవిత కదలికల్నీ నువ్వు మ్యాప్ చేస్తున్నావా, రజత్?”

“అయ్యో కాదు భవితా! వ్యాపార ప్రయోజనం కోసం మీ లోకేషన్ హిస్టరీని తీసుకోలేదు. నా జీవితంలోని వ్యక్తిగత క్షణాలను శాశ్వతంగా భద్రపరచాలనే కోరికతో చేస్తున్న పని ఇది.”

“ఇప్పుడే ఈ ఆలోచన రావాలా? మన పెళ్ళికి ఇంకా నెల రోజులే ఉందని గుర్తుందా?”  అని గుర్తు చేసింది.

రజత్ ప్రశాంతంగా నవ్వుతూ— “తెలుసు, నా వృత్తి నైపుణ్యంలోని ఒక చిన్న భాగాన్ని మన బంధువులతో పంచుకోవాలని అనిపించింది.”

“అర్థమైంది, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం నువ్వు కొంచెం పెళ్ళి ఏర్పాట్ల మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు.”  అని చెప్పాల్సింది చెప్పింది.

“పెళ్ళి పనుల్లో పూర్తిగా మునిగిపోయే ముందు ఈ ప్రాజెక్ట్ ముగించాలని నా ఆశ. దీని విజయం ఆధారంగానే భవిష్యత్తులో ఇంకా పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం వస్తుంది. అందరూ ప్రాజెక్ట్ విజయవంతం కావడాన్ని బట్టే కదా దాని విలువను కొలుస్తారు?”

“అది నిజమే. కానీ నువ్వు నీ పని గురించి మేనేజర్‌కు గానీ, నాకు గానీ అర్థమయ్యేలా ఎందుకు చూపించడం లేదు? ఆయనకు పని ప్రగతి తెలియాలి కదా?”

“భవితా… నేనేమీ దాచడం లేదు. నీకు తెలిసిందే కదా నేను ఉదయం నుండి రాత్రి వరకు ఈ పనిలోనే ఉన్నాను. పుట్టబోయే బిడ్డ పుట్టక ముందే ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆత్రుత ఎందుకు?” అని రజత్ చిరునవ్వుతో శాంతంగా బదులిచ్చాడు. కానీ అతని సమాధానం భవితకు సంతృప్తినివ్వలేదు. అతడిని కాస్త రెచ్చగొట్టయినా సరే ఆ పనిని చూడాలని ఆమె పట్టుబట్టింది. ఒకవైపు మేనేజర్ ఆశిష్ ఒత్తిడి… మరోవైపు భవిత ఆసక్తి…

రెండు కోరికలూ సహజమైనవే, ఇంకో వారం మాత్రమే. ఈ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చినట్లే. తానే ఎక్కువ కుతూహలం పెంచేశాడేమోనని రజత్‌కు లోలోపల నవ్వొచ్చింది. కానీ మరీ ఎక్కువ లాగితే ఓపిక నశించి ఏదైనా సమస్య వస్తుందని జాగ్రత్తపడి, రజత్ ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించి మేనేజర్ ఆశిష్‌ను ప్రాజెక్ట్ సమీక్షకు ఆహ్వానించాడు. ఆశిష్ కూడా దీని కోసమే చూస్తున్నట్లు వెంటనే అంగీకరించాడు. 

 గత రెండేళ్ళుగా రజత్‌తో కలిసి పనిచేస్తుండటం వల్ల వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆశిష్ గదిలోకి రాగానే రజత్ సాదరంగా ఆహ్వానించి, ఆయన కూర్చోవడానికి తన కుర్చీని ముందుకు లాగాడు. ఆశిష్ ప్రాజెక్ట్, మార్కెట్ వ్యవహారాల మధ్య ఒక వారధి లాంటివాడు. కొత్త ప్రాజెక్టులను తీసుకురావడం, వాటి ప్రమోషన్ బాధ్యతలు నిర్వహించడం అన్నీ ఆశిష్ బాధ్యత.

“హాయ్ రజత్! నువ్వు మొదట్లో ఒక మాట చెప్పావు కదా… ‘నిన్నటి జ్ఞాపకాలు… నేటి అనుభవాలు… రేపటి కలల విక్రయం.’ ఎంత అద్భుతమైన స్లోగన్ నీది! కానీ నీ ఈ త్రీ–డైమెన్షనల్ మ్యాప్ పూర్తయిందా లేదా?”

“పని దాదాపు అయిపోయింది బాస్. మూడు వంతులు యాక్టివిటీ లొకేషన్ల మ్యాపింగ్ పూర్తయింది. దానికి భవిష్యత్తు తాలూకు ఒక చిన్న దృశ్యం జోడించాల్సి ఉంది.” 

ఆశిష్ కొద్దిగా గంభీరంగా అన్నాడు. “నువ్వు ఎక్కువ సమయం తీసుకోకూడదు రజత్. కొన్ని కంపెనీల నుండి ఇతర ప్రాజెక్టుల కోసం డిమాండ్ వచ్చింది. వాటిని ఆలస్యం చేస్తే మన కంపెనీ బిజినెస్ దెబ్బతింటుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను ‘డ్రాయింగ్ బెంచ్‘కి పంపించాను.  అక్కడ అధ్యయనం పూర్తయ్యాక అవి  ఫీల్డ్ వర్క్‌కు వెళ్తాయి. ఆ తర్వాత నీ వద్దకు వస్తాయి. ఈలోగా నువ్వు సిద్ధంగా ఉండాలి.”

“ఇప్పుడు నేను చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు బాస్, కేవలం ఇంకొన్ని రోజులు మాత్రమే.”

“ఇప్పుడు దాన్ని చూడవచ్చా?”

“ఓ తప్పకుండా…” అంటూ రజత్ అతన్ని ఒక సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధం చేశాడు. హోలోగ్రాఫిక్ బింబాలలోని ఒక రంధ్రం ద్వారా లోపలికి వీక్షించే అవకాశం కల్పించాడు. ఆశిష్ ప్రత్యేక గాగుల్స్ ధరించి చూస్తుండగా, రజత్ కూడా ఆ ప్రయాణంలో తోడయ్యాడు. ఆ రంధ్రం గుండా వారి దృష్టి చాలా ఏళ్ళ వెనక్కి వెళ్లింది. రజత్ చిన్ననాటి అల్లరి, స్కూలుకు వెళ్ళే దారులు, తరగతి గదులు, బాల్య స్నేహితులతో ఆడిన క్రికెట్ ఆట, హాస్టల్ జీవితం, ఆ తర్వాత కాలేజీ రోజులు, మధ్యలో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో గడిపిన రోజులు…, ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగంలో చేరిన తొలి క్షణాలు… వీటి మధ్యలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఆ దృశ్యాలలో సజీవంగా ప్రత్యక్షమవుతూ సాగింది.

“నువ్వు కొన్ని చేదు జ్ఞాపకాలను కూడా ఇందులో ఉంచావు కదా, ఆ ఘట్టానికి వచ్చినప్పుడు సాఫీగా సాగుతున్న ప్రయాణంలో పెద్ద బండరాయి అడ్డొచ్చినట్లు అనిపిస్తోంది.” 

“ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నామనే అవగాహన కల్పించడమే నా ఉద్దేశం.”

హోలోగ్రాఫిక్ ప్రకాశ బింబం మ్యాప్‌లో జీవితం వైకుంఠపాళి లాగా కనిపించింది. ఆనంద క్షణాలు అనుకునేలోపే జీవితంలో కుంగిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇది చూస్తుంటే ఎన్నో ఏళ్ళ క్రితం నాటి దినచర్యను గుర్తుకు తెచ్చేలా ఉంది. రేడియోలో ఉదయం సుప్రభాతం వినే రజత్ తండ్రి ధారేశ్వర్ అలవాటు, ఇళ్ళను శుభ్రం చేసి గుమ్మం ముందు ముగ్గులు పెట్టే తల్లి సుగుణ అలవాట్లు, ఆ ముగ్గుల క్షణాలన్నీ లొకేషన్ హిస్టరీ నుండి డౌన్‌లోడ్ చేసుకుని మ్యాప్‌లో పొందుపరిచారు. ఆశిష్ రజత్ క్రికెట్ ఆట ప్రయాణాన్ని చూసినప్పుడు అతనిపై ఉన్న పాత అభిప్రాయం మర్చిపోయి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు: “నువ్వు ఈ ఫీల్డ్‌కి రాకుండా క్రికెట్ పైనే దృష్టి పెట్టి ఉంటే ఈపాటికే పెద్ద క్రికెటర్ అయ్యేవాడివి రజత్! నువ్వు కొట్టిన సిక్సర్లు చూసి ప్రేక్షకులు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు.”

మ్యాప్ భూతకాలం నుండి బయటకు రావడానికి ఒక వెలుతురు కిటికీ లాంటి ప్రవేశ ద్వారం ఉంది, దాని గుండానే ఆ కాల పరిధి నుండి బయటకు రావచ్చు. వచ్చిన తర్వాత వర్తమానానికి పూర్తిగా అలవాటు పడేందుకు కొన్ని నిమిషాలు పట్టింది. కొద్దిసేపటికి ఆశిష్ నిద్ర నుండి లేచినట్లు, తాను చూసింది నిజమో, భ్రమో అన్న గందరగోళానికి గురై, రజత్ వీపు తట్టాడు.

“ఇదేం మాయ రజత్! నేను కేవలం పది నిమిషాలు మాత్రమే చూసినా, ఒక సుదీర్ఘ కాల ప్రయాణం చేసినట్లు అనిపించింది. ఇక భవిష్యత్తును చూస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోతానేమో! ఈ పని పూర్తిగా అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది?”

“అబ్బే, గరిష్ఠంగా ఇంకో వారం రోజులు పట్టవచ్చు…” అని అంచనాగా చెప్పాడు.

“సరే, నీ కోసం మరో ప్రాజెక్ట్ వేచి ఉంది. ఈ శీతాకాలంలో సూర్యస్నానం చేయడానికి ఎండ కోసం చూసే ప్రజల కోసం లొకేషన్ బేస్డ్ స్థలాలు అవసరమయ్యాయి. ఆ కంపెనీ అక్కడ సన్‌డెక్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దానికి మ్యాపింగ్ చేసివ్వాలి.” కస్టమర్‌ను వదులుకోకూడదనే ఆందోళన ఆశిష్‌ది. 

“లిస్ట్‌లో పెట్టి, వెయిటింగ్ ఆర్డర్ ప్రకారం చేస్తామని చెబితే సరిపోతుంది.”

“నేనూ అదే చెప్తున్నాను, కానీ ఈ ప్రయోగాన్ని త్వరగా ముగించు” అని వీపు తట్టి ఆశిష్ వెళ్ళిపోయాడు.

రజత్‌కు ఏకాంతం అవసరమైంది. దానికి తగ్గట్టుగానే ఆ గదిలోని హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వ్యవస్థ మళ్ళీ వెలుగులతో నిండిపోయింది. భూతకాలానికి ద్వారం కల్పించినట్లే, వర్తమానం నుండి భవిష్యత్తుకు మ్యాపింగ్ ప్రవేశ ద్వారం రూపొందించాల్సి ఉంది. దాన్ని ముందుగా సృష్టించి, బలోపేతం చేసి, ఆ తర్వాత కొన్ని సంభావ్యతలను జాబితా చేయాల్సి ఉంది. జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టానికీ ఇది వర్తిస్తుంది. దాంతో పాటు సుఖదుఃఖాల మధ్య వచ్చే పరిస్థితులను, వ్యక్తిగత స్వభావం, ఆశలు, బాహ్య పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తు అంత సులువుగా తన రహస్యాలను వెల్లడించదు.  అది ముత్యపు చిప్పలో దాగి ఉండి సమయం వచ్చినప్పుడు మాత్రమే తన ఆశ్చర్యాలను బయటపెడుతుంది. 

సాంప్రదాయాలపై ఆసక్తి ఉన్న తండ్రి ధారేశ్వర్‌ను భవిష్యత్తు ఆశల గురించి రజత్ అడిగినప్పుడు, ఆయన చెప్పడానికి వెనుకాడాడు. “రేపు ఏం జరుగుతుందో చెప్పగలమా రజత్? ఆ భగవంతుడు మన నొసట ఏం రాశాడో అదే జరుగుతుంది, విధి రాతను మార్చగలమా? అంచనా వేయగలమా?” అన్నప్పుడు రజత్ నిరాశకు గురయ్యాడు. అయినా పట్టువదలకుండా తండ్రి దినచర్య, తిరిగే స్థలాల వివరాలు సేకరించాడు. ఆయన శారీరక స్థితి, ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకుని అంచనా వేసి, ఇన్నేళ్ళు జీవిస్తారని లెక్కగట్టి భవిష్యత్తు పాత్రకు రంగులు అద్దాడు. తండ్రి గుణానికి భిన్నంగా లేదు తల్లి సుగుణ ప్రభావం. వయసు పెరిగినా రజత్‌ను ‘బాబు‘ అని పిలవడం ఆమెకు అలవాటు.

“బాబూ, కర్మ ఎవరినీ వదలదు. వారి పాపపుణ్యాల ఆధారంగానే భవిష్యత్తు ఉంటుంది. పిచ్చివాడిలా ప్రజల వినోదం కోసం మన జీవితాలనే పాచికలను చేసి ప్రయోగాలు చేస్తున్నావు కదా” అని సున్నితంగా మందలించింది. రజత్ తల్లిదండ్రులకు సాంప్రదాయబద్ధంగా, సరళంగా వివాహ మహోత్సవం జరిపించాలని ఉంది. ఎక్కువ ఆడంబరమైతే పనులన్నీ తామే చూసుకోవాల్సి వస్తుందని, వీలైనంత సరళంగా, అచ్చుకట్టుగా పూర్తి చేయాలనుకున్నారు. కానీ కొడుకు నూతన ఆలోచన వారికి అర్థం కాలేదు. వారికి వివరించి ఒప్పించడానికి రజత్ తన శక్తినంతా ధారపోయాల్సి వచ్చింది.

చివరికి తండ్రే అతని సహాయానికి వచ్చాడు. “పోనీలే సుగుణా, రజత్‌కు ఏదో ఆశ ఉంది. పెళ్లికి జనాలు వస్తారు, ఆర్కెస్ట్రా వినే బదులు ఈ కొత్త అనుభూతిని పొందుతారు. మన జీవితం చివరి వరకు చూపించడట, అంచనాగా ఇన్నేళ్ళు అనే ఊహతో భవిష్యత్తు చూపిస్తాడట. నువ్వు జీవితంలో ఏం చేయాలనుకున్నావో అవే చెప్పు” అన్నప్పుడు సుగుణ గొణుగుతూనే తన ఆశలన్నింటినీ ఒక్కొక్కటిగా రజత్ ముందు చెప్పడం ప్రారంభించింది.

ఆ తర్వాత భవితను కూడా ఇదే ప్రశ్నలు అడిగినప్పుడు, ఆమె మాత్రం రజత్ తల్లిదండ్రుల్లా సందేహించలేదు. ఎంతో ఉత్సాహంగా తన కలలు, ఆశలు, భవిష్యత్తు లక్ష్యాలను ఒక్కొక్కటిగా వివరించింది. వీటన్నింటి మధ్య తన జీవిత గమనాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఇంతలో ధారేశ్వర్ ఒకసారి గొణుగుతూ అన్న మాటలు అతని చెవుల్లో మారుమోగాయి: “ఏం పిచ్చి కుర్రాడో, గతంలో సప్తర్షులలో ఒకరైన అగస్త్య మహర్షి తాళపత్రాలపై వ్యక్తుల భూత, వర్తమాన, భవిష్యత్తుల గురించి ముందే రాసి ఉంచాడని చెబుతారు. నువ్వేమో అదే జీవిత చరిత్రను ఇప్పుడు మ్యాప్‌లో గీయాలని చూస్తున్నావు!” 

“అయితే అగస్త్య మహర్షి ఆ సమాచారాన్ని ఏ కాల పరిమాణంలో, ఏ దృష్టికోణంలో దర్శించి రచించి ఉంటారు?

ఆ తర్వాత రజత్ వీటన్నింటినీ ఎక్కువగా బుర్రకెక్కించుకోకుండా తన తదుపరి పనిపై దృష్టి పెట్టాడు. వర్తమానం నుండి భవిష్యత్తు వైపు సాగడానికి మరొక ప్రవేశ ద్వారం అవసరమైంది. దాన్ని సరైన స్థలంలో సృష్టించి భవిష్యత్తులోని ప్రధాన ఘట్టాలను గుర్తించాడు. దానికి సంభావ్య అంశాలను పరిగణనలోకి తీసుకుని, అంచనా వేసిన ప్రదేశాలలో జీవిత చిత్రాలను గీశాడు. రిటైర్మెంట్ వయస్సు వరకు చాలని అక్కడితో ముగించాడు. భవితలాగే తనకూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. వాటి ఉన్నత సమ్మేళనంతో ఒక జీవిత చిత్రాన్ని ఖచ్చితంగా గీయవచ్చు. తను వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ఒక లక్ష్యంతో ముందుకు సాగాలనే పట్టుదల ఉంది.

పెళ్ళయిన తర్వాత భవిత కూడా తన వృత్తిని కొనసాగిస్తుంది. పెళ్ళయిన ఒకటి రెండేళ్ళ వరకు పిల్లలు వద్దని తను చెప్పింది కదా… ఆ సమయంలో వారిద్దరూ వృత్తి జీవితాన్ని, బాహ్య ప్రపంచాన్ని మరింత అన్వేషించే ఉత్సాహంతో ప్రయాణాలు చేసే సంభావ్యత ఎక్కువగా ఉంది. ఆమె తన తల్లిదండ్రులకు ఒకే ఒక కుమార్తె, కాబట్టి వయసైన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది, ఏదో ఒక రోజు వారు కూడా తమ ఇంటికి వచ్చి కలిసి నివసించవచ్చు. రజత్ ఆలోచనా తరంగాలు మ్యాపింగ్‌తో కలిసి కాలప్రవాహంలో కొట్టుకుపోయి, తన సొంత లోకంలో విహరిస్తున్నప్పుడు భవిత అక్కడకు వచ్చింది.

రజత్ హోలోగ్రాఫిక్ స్క్రీన్‌పై సంభావ్య దృశ్యాలను చిత్రించడాన్ని ఆమె శ్రద్ధగా గమనించింది. ఆ దృశ్యాలను చూస్తుండగానే ఆమె మనసులో ఒక్కసారిగా ఒక అనుమానం మెదిలింది. అది నిజమే అయితే రజత్‌ను వెంటనే ఆ పని నుండి మేల్కొలపాలి, లేదంటే అతను ‘కాలం‘ అనే నాల్గవ డైమెన్షన్‌లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.

“రజత్… రజత్…” అంటూ అతడిని పిలవడానికి ప్రయత్నించినప్పుడు, అతను నిద్రలోకి జారుకున్నట్లు ఏదో మైకంలో ఉన్నట్లు కనిపించాడు. కానీ కంప్యూజెక్టర్‌లో అమర్చిన టైమర్ ప్రకారం ఆ కాల చక్రం ముగియడానికి ఇంకా అరగంట మాత్రమే సమయం మిగిలి ఉంది. భవిష్యత్తులోకి వెళ్ళాలంటే దానికి ప్రత్యేకంగా కేటాయించిన ప్రవేశ ద్వారం ద్వారా మాత్రమే సాధ్యం. భవిత దిగ్భ్రాంతి చెంది ఆ హోలోగ్రాఫిక్ మ్యాప్‌ను పరిశీలిస్తుండగా, ఒక చోట తలుపు చిత్రం ఎరుపు రంగులో వెలిగింది. అదే భవిష్యత్తు కాలపు ప్రవేశ ద్వారం అయి ఉంటుందని ఊహించి, గాగుల్స్ ధరించి లోపలికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆమెకున్న లక్ష్యం ఒక్కటే… రజత్‌ను ఎలాగైనా తిరిగి వర్తమానంలోకి తీసుకురావాలి.  

శ్రీమతి సవితా శ్రీనివాస్ సంక్షిప్త పరిచయం 

బెంగళూరుకు చెందిన సవితా శ్రీనివాస్ IPS గారు 2006లో పోలీస్ శాఖలో చేరి, ప్రస్తుతం కర్ణాటక పోలీసు శాఖలో హోంగార్డ్స్ అదనపు డైరెక్టర్ జనరల్ గా సేవలందిస్తున్నారు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన సవితా శ్రీనివాస్ కన్నడ భాషలో విభిన్నమైన సామాజిక, వైజ్ఞానిక కథాంశాలతో దాదాపు 16 పుస్తకాలను రచించారు. వాటిలో  “త్రిలోక సంచారి నీరె”, “గాళక్కె సిక్క చందిర”, “మధుమాస” మొదలైన నవలలు, “కత్తల గర్భదల్లడిగిద బెళకు”, “పంచబళ్ళియ కథెగళు”, “శతమానదంచిన మించు” వంటి కథాసంకలనాలు ఉన్నాయి. వీరి సాహిత్య సేవలకు 2012లో ‘కెంపేగౌడ అవార్డు‘, పోలీస్ సేవలకు 2013లో ‘ముఖ్యమంత్రి బంగారు పతకం‘ 2026లో ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పతకం‘ లభించాయి. ఆమె రచనలపై ప్రస్తుతం కొందరు విద్యార్థులు పీహెచ్‌డీ పరిశోధనలు చేస్తున్నారు.

కోడిహళ్లి మురళీ మోహన్

రచయిత, సాహిత్యాభిమాని, అనువాదకుడు, సంపాదకుడు వికీపీడియన్. తెలుగు కన్నడ భాషలలో అనువాదాలు చేస్తున్నారు. కథాజగత్, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు, రైలు కథలు, దేశభక్తి కథలు, తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులంకథ, క్రీడాకథ, రామకథాసుధ, పదచదరాలు, స్వాతంత్ర్యభారతికి అమృతోత్సవ హారతి అనే పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. ప్రముఖ హేతువాది, విద్యావేత్త డా.హెచ్.నరసింహయ్య ఆత్మకథను పోరాటపథం పేరుతో తెలుగు ప్రజలకు పరిచయం చేశారు.

Previous Post

ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !

Next Post

టర్కిష్ కథ : వలసపిట్ట

Next Post
టర్కిష్ కథ : వలసపిట్ట

టర్కిష్ కథ : వలసపిట్ట

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply