• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కవిత : థర్మా మీటర్

మల్లేశ్వరరావు ఆకుల by మల్లేశ్వరరావు ఆకుల
March 24, 2023
in అనువాద కవితలు
0
హిందీ కవిత : థర్మా మీటర్

“Youth is not entirely a time of life, it is a state of mind”
..Douglas Mc Arthur

ఈ అర్థంలో వాట్సాప్, సోషల్ మీడియాలలో విస్తృతంగా వచ్చిన కవిత ఇది.

హిందీ మూలం : కవి వివరాలు అలభ్యం
తెలుగు అనువాదం : మల్లేశ్వర రావు ఆకుల

 

మీ స్నేహితుల సమూహం
మిమ్మల్ని రారమ్మని ఆహ్వానించినా,
మీరు వెళ్ళకపోతే,
వెళ్ళాలని మనసులోకోరిక కలగకపోతే..
అర్థం చేసుకోండి
మీరు వృద్ధాప్యంలో పడ్డారని…

కారణం లేకుండానే,
ఆనందంతో చిందులేసే పిల్లలను చూసి
మీరు కోపగించుకుంటున్నారంటే,
కోపంతో విరుచుకుపడుతున్నారంటే…

సహచరి స్నేహితురాళ్ళను చూసి కూడా
మీ భార్య మీదే చూపులు ఉంచారంటే
అర్థం చేసుకోండి,
మీరు వృద్ధాప్యంలో పడ్డారని…

అద్భుతమైన,
నవ్వుల మయమైన చిత్రాన్ని చూస్తూ కూడా
ఆలోచనల్లో పడుతూ ఉంటే..

మిత్రులంతా మజా చేస్తూ జోకులేస్తుంటే,
మీరు వారికి సలహాలు ఇవ్వజూస్తుంటే,
దాని అర్థం..

కొత్త బట్టలు కొనాలి,
ధరించాలనే ఉత్సాహం తగ్గిపోయిందంటే..
యువతరం కొత్తరకం దుస్తులు,
వేషభాషలు చూసినప్పుడల్లా విమర్శిస్తూ,
కామెంట్స్ చేస్తున్నారంటే …

పువ్వు చుట్టూ చక్కర్లు కొట్టే
సీతాకోక చిలుకను చూసి,
ఏదో ఒక ప్రణయ గీతం గుర్తు రాకపోతే…

బయట అల్పాహారం చేస్తున్నప్పుడు
ఇంటి వంటలు గుర్తు చేసుకుంటున్నారంటే..

ఏమీ పట్టనితనంతో ,
దేనికీ బాధపడకుండా ఉండలేక,
ఏదో ఒక చింతను ఎదపై భారంగా మోస్తున్నారంటే…

వానజల్లు పడుతుంటే
వేడి వేడి పకోడీలు కాక,
గొడుగును గుర్తు చేసుకుంటే ….

అందమైన ఉషోదయాల్ని చూస్తూ
హాయిగా నిద్రలేచి ఆహ్లాదాన్ని పొందడం కాకుండా,
రోజులో ఒక్కసారైనా నవ్వుకోకుండా,
సాయంత్రాల గురించి ఆలోచిస్తున్నారంటే…

జీవితాన్ని నవ్వుతూ
ఆడుతూ పాడుతూ సాగేలా మార్చుకో లేకపోతే..

మీ ముఖంలో వెలుగులు ఆరిపోతుంటే
అర్థం చేసుకోండి,
వృద్ధాప్యంలో పడటమే కాదు ..
దాన్ని కూడా దాటిపోయే సమయం మొదలైందని…

వయసు రాకుండానే
వృదులయ్యే ప్రమాదంలో పడకూడదని
తీర్మానించుకోండి.
ఏళ్ళు మీద పడుతున్న కొద్దీ
హృదయాన్ని పడుచుదనం వదలకుండా చూసుకోండి.
గుర్తుంచుకోండి..
వయసుతో ముడతలు ఏర్పడవచ్చు కానీ,
హృదయంలో వాటికి స్థానం లేకుండా చూసుకోండి!

మల్లేశ్వరరావు ఆకుల

ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా 2016 డిసెంబర్ లో రిటైర్ అయ్యారు. 1.1.1977 గుడివాడలో జననం. ఉద్యోగ విరమణ తర్వాత తిరుపతిలో నివాసం. B.com., MCJ, MA. (HINDI), రంగస్థల యోగా విజ్ఞాన్ లో సుశిక్షితులు. 28సం.ఆకాశవాణిలో ఉద్యోగం. అక్షరాలు నా ఆనవాళ్లు, ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే- కవితా సంపుటులు, వెన్నెలలో మల్లియలు- నాజీవన యానం. ఇప్పుడు ముద్రణలో చాంద్ ఫిర్ నికలా- 100 హిందీ పాటలకు వ్యాఖ్యానం, ఆయన రచనలు. రంగస్థల విమర్శ- సమీక్షకులు. వాట్సాప్ గ్రూపులో హిందీ అనువాదాలు. కథాయాత్ర పేరుతో కథల ఆడియో, చిత్ర కవితలు, పుస్తక సమీక్షలు, పరిచయాలు వగైరా.

Previous Post

హిందీ కవిత : సీత

Next Post

ఇంగ్లీషు కథ : ప్రతీకారం 

Next Post
ఇంగ్లీషు కథ : ప్రతీకారం 

ఇంగ్లీషు కథ : ప్రతీకారం 

Discussion about this post

ఈ సంచికలో…

  • పాలస్తీనా కథ: గుర్తింపు
  • సింహళి, అస్సామీ అనువాద కవితలు
  • గుజరాతీ కథ : గొలుసు
  • అపార్ట్మెంట్ మిస్టరీ
  • వయసు మరిచిన మనసు
  • ఇనుపచువ్వల దడి
  • కన్నడ కథ : తక్కువేమి మనకూ..
  • ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు
  • అనువాద కవిత: మౌనంగా..
  • మునుపెన్నడూ లేదు
  • అనువాద కవిత : ఒంటరి!
  • అనువాద కవిత : దుమ్ము
  • సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
  • హిరోషిమ – నాగసాకి శిథిలాల్లోంచి పిల్లల స్వరాలు
  • ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు
  • తమిళ కథ : బావా…
  • విను ద్రౌపదీ! ఆయుధం పట్టుకో! + విజ్ఞప్తి
  • గ్రీక్ అజ్ఞాత కవితలు 

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com