కుమార్ ఎస్.డి.

కుమార్ ఎస్.డి.

కన్నడ సాహిత్య ప్రపంచంలో, ముఖ్యంగా అనువాద సాహిత్య రంగంలో, ఎస్. డి. కుమార్ పేరు విశేషంగా పరిచితమైనది. రాష్ట్రంలోని దాదాపు ప్రతి ప్రధాన గ్రంథాలయంలోనూ ఆయన రచించిన లేదా అనువదించిన వందకు పైగా గ్రంథాలు అందుబాటులో ఉండటం ఆయన సాహిత్య సేవకు నిదర్శనం.

ఎం.కాం. చేసారు. తెలుగు, ఆంగ్ల భాషల నుండి కన్నడకు విస్తృతంగా అనువాదాలు చేశారు. ఇప్పటివరకు 700–800 వరకు చిన్నా–పెద్ద నవలలు, 300కు పైగా కథలు అనువదించారు. ఆయన రచనలు, అనువాదాలు కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి.

కథ, నవల, నాటకం, వ్యాసం, విజ్ఞాన సాహిత్యం, వ్యవసాయం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆయన కలం సమాన నైపుణ్యంతో సాగింది. విభిన్న అంశాలపై సమాన ఆసక్తితో రచనలు చేయడం ఆయన ప్రత్యేకత.

ఆరు వేలకుపైగా కవితలను తెలుగు, ఆంగ్లం, కన్నడ భాషల మధ్య పరస్పరం అనువదించిన విశేష అనుభవం ఆయనకు ఉంది. ఈ అనువాదాల ద్వారా భాషల మధ్య సాహిత్య సేతును నిర్మించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

పలు టెలివిజన్ ధారావాహికలకు స్క్రిప్ట్ రచయితగా పనిచేశారు. కొన్ని చలనచిత్రాలకు కథ, కథనం (స్క్రీన్‌ప్లే) రూపకల్పనలో భాగస్వామిగా,  సహాయ దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

కన్నడ కవిత: సీసా – ఓడ

కన్నడ కవిత: సీసా – ఓడ

కన్నడ మూలం : డాక్టర్ పి.చంద్రికా తెలుగు అనువాదం: ఎస్ డి కుమార్ వంట చేయడం ముఖ్యం అనిపించుకోదు...ఎప్పటికీ చేసిన వంటను కూసింతైనా తినేలా చేయటమే ముఖ్యం...

ఈ సంచికలో…

అభిప్రాయాలు