• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కవిత : మనం ఎవరము? ఎలా తయారయ్యాము?

మల్లేశ్వరరావు ఆకుల by మల్లేశ్వరరావు ఆకుల
December 11, 2025
in అనువాద కవితలు
0
హిందీ కవిత : మనం ఎవరము? ఎలా తయారయ్యాము?

హిందీ కవిత : మైథిలీ శరణ్ గుప్త
తెలుగు అనువాదం: మల్లేశ్వరరావు ఆకుల

మనమెవరం? ఎలా అయిపోయాము?
ఇంకెలా తయారవుతాం?.
రండి కలిసి ఆలోచన చేద్దాం.
ఈ సమస్యలన్నింటి గురించి…
గడిచిపోయిన కాలం తిరిగిరాదు, మళ్లీ ఎప్పటికీ.
ఓ మనిషీ! నీ నొసట ఏమి రాయబడలేదనీ.. చూసుకో!
నీ వ్యక్తిగత ప్రతిష్టను మతిమరుపుతో మరిచిపోవద్దు.
అమృతం గెలుచుకుని, నింపుకొని కూడా
విషం నిండిన లోకం గురించి ఎందుకు ఆలోచిస్తావ్?
నీ లక్ష్యం పట్ల దృఢ సంకల్పం చేసుకో!
మనసును దాని నుంచి వేరు చేయకు, విరిచేయకు.
సంఘర్షణా పథంలో నడుస్తూ నీ ధ్యాసను మళ్లించకు.
జీవితం క్షుద్రమైనదైతే కావచ్చు..
కానీ నీవు చేయవలసిన పనులెన్నో ఉన్నాయి.
ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ కూడా,
నీకు నీవే అడ్డుపడుతున్నావు.
పడిన వాడే లేచి నిలబడతాడు. పడిపోయిన వాడేవరంటే..
మరి లేవలేకపోయిన వాడు.
తన మార్గంలో ముందుకు సాగిపోయేవాడే
ఇంకా మునుముందుకు సాగిపోవాల్సిన వాడు.
చేయవలసిన పనులకు కట్టుబడి ఉండు.
తప్పించుకొని తిరగొద్దు.
సత్యమార్గమేదో తెలుసుకొని కంటక మార్గాల నుండి విముక్తం చేసుకుంటూ సాగిపో!..
నీ శక్తి పరిధిని గుర్తించి,
నీ అడుగులను దృఢంగా మార్చుకో!
విఘ్నాలు ముళ్ళు రాళ్లు ఎదురైనా, దారి నుండి తొలగిపోకు.
ఓ మనిషి లే! నిర్భీకుడవై, నీలోని శక్తికి పూర్ణ రూపం ఇవ్వు.
నీకోసమే ఈ విశాల విశ్వ ద్వారాలు తెరిచి ఉంచబడ్డాయి.
ఓడిపోయి కూడా
ఎవరైతే ఓటమిని అంగీకరించక తిరిగి ప్రయత్నిస్తారో.. వారే విజేతలు.
సగర్వంగా తలపైకెత్తి అరిచి మరీ చెప్పు
ఓటమిని నేనెప్పుడూ అంగీకరించనని.

7981872655

మల్లేశ్వరరావు ఆకుల

ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా 2016 డిసెంబర్ లో రిటైర్ అయ్యారు. 1.1.1977 గుడివాడలో జననం. ఉద్యోగ విరమణ తర్వాత తిరుపతిలో నివాసం. B.com., MCJ, MA. (HINDI), రంగస్థల యోగా విజ్ఞాన్ లో సుశిక్షితులు. 28సం.ఆకాశవాణిలో ఉద్యోగం. అక్షరాలు నా ఆనవాళ్లు, ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే- కవితా సంపుటులు, వెన్నెలలో మల్లియలు- నాజీవన యానం. ఇప్పుడు ముద్రణలో చాంద్ ఫిర్ నికలా- 100 హిందీ పాటలకు వ్యాఖ్యానం, ఆయన రచనలు. రంగస్థల విమర్శ- సమీక్షకులు. వాట్సాప్ గ్రూపులో హిందీ అనువాదాలు. కథాయాత్ర పేరుతో కథల ఆడియో, చిత్ర కవితలు, పుస్తక సమీక్షలు, పరిచయాలు వగైరా.

Previous Post

అనువాద కవిత : ప్రేమ ఒక జ్వాల

Next Post

ఆంగ్ల కవిత : చివరి ఉద్వేగం

Next Post
ఆంగ్ల కవిత : చివరి ఉద్వేగం

ఆంగ్ల కవిత : చివరి ఉద్వేగం

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply