ఆంగ్ల మూలం సమ్రీన్ సాజెదా
తెలుగు సేత.మందరపుహైమవతి
సన్నగా గొణిగే ఒకే ఒక్క శ్వాస
కాలాన్ని అనంతంతో కలిపే వారధిలా
అందుకే శ్వాసించడం
క్షణికమైన జీవితాన్ని శ్వాసించండి
అర్ధ సత్యాలకాటుక చీకటి కథల్లో కూడా శ్వాసించండి
ఏమీ పట్టనట్లు నిర్లిప్తంగా
సూర్యుడు
అస్తమిస్తున్నాడనడానికి సాక్ష్యంగా శ్వాసించండి
ఈ తమాలవృక్ష శ్యామల వర్ణ తిమిరంలోనే
లెక్కపెట్టవచ్చు అనంత తారకలను
పీడకలలు ముంచుకు రాకముందే శ్వాసించండి
సీతాకోకచిలుకని పూలరెక్కలమీదకి లాగినట్లు
ప్రాణం నిలుపుకోవడానికి శ్వాసించండి
పెఠేలున పేలుతున్న బుల్లెట్లకింద
రెక్కలు తెగుతున్న పక్షులఆర్తనాదాన్ని
వినడానికి శ్వాసించండి
బూడిద కమ్ముకోకముందు
తళతళమెరిసిన
సినాయి ఇసుక తిన్నెల అందాలను
ఊహించుకోవడానికైనా శ్వాసించండి
ఆశ
ఒక నయం కాని వ్యాధి
శ్వాసించండి
చివరి అంత్యక్రియల్లనీ చిన్నచెల్లెలు నవ్వవచ్చు
శ్వాసించు
ఆ చివరి ఉద్వేగాన్ని
నువ్వు అదుపు చేసి కోవాలి
![]()

స్త్రీవాద కవయిత్రి. మూడు దశాబ్దాలుగా రాస్తున్నారు. బాల్యం నుంచి కవిత్వం రాస్తున్నారు. సూర్యుడు తప్పిపోయాడు, నిషిధ్ధాక్షరి, నీలి గోరింట, రాతి చెయ్యి కవితా సంపుటాలు.. వానచినుకులు వ్యాస సంకలనం ప్రచురించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ శర్మ అవార్డులు, తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం సహా పదివరకు పురస్కారాలు లభించాయి. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ, బెంగాలీ లలోకి ఆమె కవితలు అనువదించబడ్డాయి.































