• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ: బడిపంతులు

కేశవ్ గోపాల్ by కేశవ్ గోపాల్
November 19, 2026
in అనువాద కథలు
0
రష్యన్ కథ: బడిపంతులు

రష్యన్ మూలం : అంతోన్ చేహొవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్

కులికిన్ సన్స్ మాన్యుఫ్యాక్టరీ నిధులతో నడిచే ఫ్యాక్టరీ పాఠశాలలో ఉపాధ్యాయుడైన ఫ్యోదర్ లుకిచ్ సిసోయెవ్ ఒక విందు భోజనానికి హాజరు అయ్యేందుకు సిద్ధమౌతున్నారు. ప్రతిఏటా పరీక్షల తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యం ఒక విందు ఏర్పాటు చేసేది. దానికి ప్రభుత్వ పాఠశాలల ఇన్స్‌పెక్టర్, పరీక్షలకు హాజరైన వారందరూ విచ్చేసేవారు. ఆ విందులు గంభీరంగా వున్నప్పటికీ, అవి ఎప్పుడూ సుదీర్ఘంగా, ఉల్లాసంగా, రుచికరంగా వుండేవి. హోదాపట్ల గౌరవాన్ని పూర్తిగా మర్చిపోయి, కేవలం ధర్మబద్ధమైన తమ శ్రమను మాత్రమే గుర్తుంచుకుని, ఉపాధ్యాయులు కడుపు నిండా తిని, స్నేహపూర్వకంగా తాగి, గొంతు బొంగురు పోయేవరకు కబుర్లు చెప్పుకుని, ఆ తర్వాత ఫ్యాక్టరీ గ్రామమంతా పాటలతో ముద్దుల సవ్వడితో నిండిపోయేలాగా గడిపి అక్కణ్నించి వెళ్లిపోయేవారు. ఫ్యాక్టరీ పాఠశాలలో తాను పనిచేసిన సంవత్సరాలకు అనుగుణంగా సిసోయెవ్ అలాంటి పదమూడు విందుభోజనాలను రుచిచూశాడు.

ఇప్పుడు తన పద్నాలుగో విందుకు సిద్ధమౌతూ అతడు వీలైనంత పండుగ వాతావరణంలో అందంగా కనిపించడానికి ప్రయత్నించాడు. తన కొత్త నల్ల సూట్ ను బ్రష్ చేయడానికిక ఒక గంట మొత్తం గడిపాడు. తన సొగసైన సరికొత్త చొక్కా వేసుకునేటప్పుడు అద్దం ముందు దాదాపు అంతే సమయం తీసుకున్నాడు. గుండీ రంధ్రాల్లో కప్లింగ్స్ పట్టలేదు. ఇది అతని భార్యపై ఫిర్యాదులు, బెదిరింపులు, నిందల తుఫాను రేపింది. అతని చుట్టూ తిరుగుతూ పాపం ఆ భార్య అలసిపోయింది. చివరికి అతడు కూడా అలసిపోయాడు. పాలిష్ చేసిన బూట్లు ఆమె తీసుకొచ్చినప్పుడు, వాటిని వేసుకునే బలం కూడా అతడికి లేదు- పడుకుని కొంచెం నీళ్లు తాగాల్సి వచ్చింది.

‘‘ఎంత బలహీనపడ్డావు!’’ అని అతడి భార్య నిట్టూర్చింది. ‘‘అసలు ఈ విందుకే వెళ్లొద్దు!’’

‘‘దయచేసి ఎలాంటి సలహాలూ వద్దు!’’ అంటూ ఉపాధ్యాయుడు మధ్యలోనే ఆమెను ఆపేశాడు.

ఇటీవలి పరీక్షల పట్ల తీవ్ర అసంతృప్తితో అతడు చెడ్డ చిరాకుగా వున్నాడు. పరీక్షలు బాగా జరిగాయి. సీనియర్ డివిజన్ లోని అబ్బాయిలందరూ సర్టిఫికెట్లు, అవార్డులు అందుకున్నారు. ఫ్యాక్టరీ, ప్రభుత్వం అనే రెండు యాజమాన్యాలు ఈ విజయంతో సంతోషించాయి. కానీ ఉపాధ్యాయుడు సంతృప్తిగా లేడు. ఎప్పుడూ ఒక తప్పు కూడా చేయకుండా రాసే తన విద్యార్థి బాబ్కిన్ పరీక్ష డిక్టేషన్ లో మూడు తప్పులు చేసినందుకు, తన విద్యార్థి సెర్గేయెవ్ తీవ్ర ఆందోళనతో 17ను 13తో గుణించడంలో విఫలమైనందుకు, యువకుడైన అనుభవం లేని ఇన్‌స్పెక్టర్ డిక్టేషన్ కోసం ఒక కష్టమైన పాఠాన్ని ఎంచుకున్నందుకు, ఇన్స్‌పెక్టర్ డిక్టేట్ చేయమని కోరిన పక్క పాఠశాల ఉపాధ్యాయుడు ల్యాపునొవ్ ‘సహచర’ భావానికి భిన్నంగా ప్రవర్తించినందుకు అతడు చిరాకుపడ్డాడు: డిక్టేట్ చేస్తున్నప్పుడు పదాలను ల్యాపునొవ్ తప్పుగా ఉచ్చరించాడు. వాటిని గొణుగుతున్నట్టుగా పలికాడు.

తన భార్య సహాయంతో బూట్లు తొడుక్కుని, అద్దంలో మరోసారి తనను తను చూసుకున్న తరువాత ఉపాధ్యాయుడు తన చేతికర్ర తీసుకుని భోజనానికి బయలుదేరాడు. వేడుక జరుగుతున్న ఫ్యాక్టరీ డైరెక్టర్ అపార్ట్‌మెంట్ లోకి ప్రవేశిస్తుండగా అతనికి చిన్న ప్రమాదం జరిగింది. అతడు దగ్గడం మొదలెట్టాడు.. ఆ దగ్గు తీవ్రతకు తలపై వున్న టోపీ ఎగిరిపోయింది. చేతిలో కర్ర జారిపడింది. అతడి దగ్గు విని ఉపాధ్యాయులు, పాఠశాలల ఇన్‌స్పెక్టర్ పరుగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి, అతడు కింది మెట్టుమీద కూచుని వున్నాడు. విపరీతంగా చెమటలు పడుతున్నాయి.

‘‘ఫ్యోదర్ లుకిచ్, మీరేనా? మీరు వచ్చేశారా?’’ అంటూ ఇన్‌స్పెక్టర్ ఆశ్చర్యపోతూ అడిగాడు.

‘‘మరి, ఏమిటి?’’

‘‘మీరు ఇంట్లోనే వుండాల్సింది. ఈ రోజు మీకు ఒంట్లో బాగాలేదు…’’

‘‘నేను నిన్న ఎలా వున్నానో ఈరోజూ అలాగే వున్నాను. ఒకవేళ నేను రావడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే వెళ్లిపోతాను.’’

‘‘ఫ్యోదర్ లుకిచ్! ఈ మాటలతో ప్రయోజనమేమిటి? ఇలా ఎందుకంటున్నారు? మీకు స్వాగతం! ఈ సందర్భానికి హీరోలం మేం కాదు, మీరే! మేము చాలా సంతోషిస్తున్నాం కూడా!’’

ఫ్యాక్టరీ డైరెక్టర్ అపార్ట్‌మెంట్‌లో వేడుకకోసం అప్పటికే అంతా సిద్ధంగా వుంది. రంురంగుల జర్మన్ తెరలతో అలంకృతమై వుంది. జెరానియం పూలు, వార్నిష్ సువాసనలతో నిండిన ఆ పెద్ద భోజన శాలలో రెండు బల్లలున్నాయి. ఒకటి పెద్దది- మధ్యాహ్న భోజనానికి. మరొకటి- చిరుతిళ్లకు చిన్నది. దించివుంచిన కిటికీ తెరల సందుల్లోంచి ఉక్కపోతతో కూడిన మధ్యాహ్నవెలుగు సన్నగా లోపలికి వస్తోంది. గదిలోని మందమైన వెలుగు, తెరలపై వున్న స్విస్ దృశ్యాలు, జెరానియం పూలు, పళ్లెంలో సన్నగా తరిగిన సాసేజ్‌లు- అవన్నీ అమాయకంగా యజమానినే పోలివున్నాయి. అతడు పొట్టిగా, గుండ్రని పొట్టతో, నూనె పూసినట్టు మెరిసే కళ్లతో వున్న ఒక జర్మన్- అడాల్ఫ్ అంద్రేయిచ్ బ్రూని (అదే యజమాని పేరు). చిరుతిళ్ల బల్ల దగ్గర ఎవరో మంటల్లో కాలిపోతున్నట్టు హడావుడి చేస్తున్నాడు. గ్లాసుల్లో పానీయం పోస్తూ, పళ్లెంలో చిరుతిండ్లు నింపుతూ, అందర్నీ సంతోషపెట్టడానికి, నవ్వించడానికి, తన స్నేహభావాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు. భుజాలను తడుతున్నాడు. కళ్లలోకి చూస్తున్నాడు. కిలకిల నవ్వుతున్నాడు. చేతులు రుద్దుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక మంచి కుక్కలా ప్రేమ కనబరుస్తున్నాడు.

సిసోయెవ్ ను చూసి ‘‘ఫ్యోదర్ లుకిచ్! నేను ఎవర్ని చూస్తున్నాను?’’ అడాల్ఫ్ అంద్రేయిచ్ గొంతు తడబడుతూ అన్నాడు. ‘‘మాకు ఎంతో సంతోషంగా వుంది. అనారోగ్యంగా వున్నప్పటికీ మీరు వచ్చారు..! మహాశయులారా! మీకొక శుభవార్త చెప్పనివ్వండి: ఫ్యోదర్ లుకిచ్ విచ్చేశారు!’’

ఉపాధ్యాయులు అప్పటికే చిరుతిండి బల్ల చుట్టూ గుమికూడి తింటున్నారు. సిసోయెవ్ ముఖం చిట్లించాడు. తనకోసం వేచి వుండకుండా అందరూ తినడం, తాగడం మొదలుపెట్టిన తీరు అతనికి నచ్చలేదు. వాళ్ల మధ్యన పరీక్షా సమయంలో డిక్టేట్ చేిన ల్యాపునొవ్ అతణ్ని గుర్తించి, దగ్గరికి వెళ్లి ఇలా మొదలెట్టాడు:

‘‘ఇది స్నేహభావం కాదు! అయ్యా… మంచి వాళ్లు అలా డిక్టేట్ చేయరు!’’

‘‘అయ్యో! మీరెప్పుడూ దాని గురించే మాట్లాడతారు!’’ అని ల్యాపునొవ్ ముఖం చిట్లించాడు. ‘‘మీకు విసుగు పుట్టదా?’’

‘‘అవును, అదే విషయం! బాబ్కిన్ నా విషయంలో ఎప్పుడూ ఎలాంటి తప్పులూ చేయలేదు! మీరు అలా ఎందుకు డిక్టేట్ చేశారో నాకు తెలుసు- నా విద్యార్థులు ఫెయిల్ కావాలని, మీ పాఠశాల నా పాఠశాలకంటే గొప్పగా కనిపించాలని అనుకున్నారు. నాకు అంతా అర్థమైంది!’’…

‘‘మీరెందుకు గొడవ పడుతున్నారు?’ అని ల్యాపునొవ్ విసుక్కున్నాడు.

‘‘ఇక చాలు మహాశయులారా!’’ ఏడుపుముఖంతో ఇన్‌స్పెక్టర్ కల్పించుకున్నాడు. ‘‘ఇంత చిన్న విషయాలకు ఇంతగా ఆవేశపడటం అవసరమా? మూడు తప్పులు.. ఒక తప్పు కాదు.. మరి, తేడా ఏముంది?’’

‘‘లేదు, దాని వల్ల తేడా వుంటుంది. బాబ్కిన్ నా విషయంలో ఎప్పుడూ ఎలాంటి తప్పూ చేయలేదు!’’

‘‘అతడు నన్ను విసిగిస్తున్నాడు!’’ ల్యాపునొవ్ కోపంగా గొణుగుతూ అన్నాడు. ‘‘తన అనారోగ్య స్థితిని ఆసరాగా చేసుకుని అందర్నీ వేధిస్తున్నాడు. అయితే అయ్యా! నేను మిమ్మల్ని అనారోగ్యంతో వున్న వ్యక్తిగా చూడను!’’

‘‘నా అనారోగ్యాన్ని పక్కన పెట్టండి!’’ అని సిసోయెవ్ కోపంగా అరిచాడు. ‘‘దాంతో మీకేం సంబంధం? అందరూ ఒకే మాట చెప్తున్నారు: అనారోగ్యం! అనారోగ్యం! అనారోగ్యం!… నిజంగా నాకు మీ సానుభూతి కావాలి! అసలు నేను అనారోగ్యంగా వున్నానని మీకెలా తెలుసు? పరీక్షలకు ముందు నేను అనారోగ్యంగా వున్నమాట నిజమే. కానీ, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. కేవలం నీరసం మాత్రమే మిగిలింది!’’

‘‘దేవుడి దయ వల్ల ఆయన కోలుకున్నారు.’’ అన్నాడు గోధుమరంగు కాసోక్, వదులైన ప్యాంటు ధరించిన యువ పూజారి ఫాదర్ నికలాయ్. ‘‘మనం సంతోషించాలి. కానీ మీరు చిరాకు పడుతున్నారు.’’

‘‘మీరుకూడా భలే వాళ్లే!’’ అని సిసోయెవ్ అడ్డుపడ్డాడు. ‘‘ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా వుండాలి. కానీ, మీరు పొడుపు కథలు అడుగుతూనే వున్నారు. అది సరికాదు!’’

అందరూ కలిసి అతణ్ని శాంతపరిచి, బల్లదగ్గర కూచోబెట్టారు. ఏమి తాగాలా అని అతడు చాలాసేపు ఆలోచించి, చిరాగ్గా ముఖం పెట్టి ఆకుపచ్చ రంగులో వున్న ఏదో ఒకరకమైన మద్యాన్ని అరగ్లాసు తాగేశాడు. తర్వాత ఒక పూర్ణాన్ని తనవైపు లాక్కుని, అందులోంచి గుడ్లను, ఉల్లిపాయలను జాగ్రత్తగా ఏరుకున్నాడు. నోట్లో పెట్టుకోగానే చప్పగా అనిపించింది. ఉప్పుకలుపుకుని, అది మరీ ఉప్పగా వుండటంతో వెంటనే కోపంగా పక్కకు తోసేశాడు.

రాత్రి భోజన సమయంలో ఇన్‌స్పెక్టర్, బ్రూనీల మధ్య కూచున్నాడు సిసోయెవ్. మొదటి వంటకం తర్వాత చాలాకాలంగా పాటిస్తున్న ఆచారం ప్రకారం టోస్టులు మొదలయ్యాయి.

‘‘ఇక్కడ హాజరుకాని పాఠశాల ట్రస్టీలకు, డానియెల్ పెత్రోవిచ్ కు- ఇంకా.. ఇంకా.. ఇంకా.. గారికి ధన్యవాదాలు చెప్పడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాను’’ అని ఇన్‌స్పెక్టర్ మొదలుపెట్టాడు.

‘‘ఇంకా ఇవాన్ పెత్రోవిచ్..’’ అని బ్రూని సూచించాడు.

‘‘ఇంకా.. ఎంత ఖర్చయినా పాఠశాల కోసం వెచ్చించిన ఇవాన్ పెత్రోవిచ్ కులికిన్ గారితో కలిసి, వారి ఆరోగ్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ తాగుదామని నేను ప్రతిపాదిస్తున్నాను!’’

ఏదో కుట్టినట్టుగా ఉలిక్కిపడి లేస్తూ, బ్రూని అన్నాడు: ‘‘గౌరవనీయ పాఠశాలల ఇన్‌స్పెక్టర్ పావెల్ గెన్నాదివిచ్ నదరోవ్ గారి ఆరోగ్యానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను!’’

కుర్చీలు కదిలాయి. ముఖాలు నవ్వాయి. ఎప్పట్లాగే గ్లాసుల చప్పుడు మొదలయింది. మూడవ టోస్ట్ ఎప్పుడూ సిసోయెవ్ దే. ఈసారికూడా అతడు లేచి మాట్లాడ్డం మొదలెట్టాడు. ముఖం గంభీరంగా పెట్టి, గొంతు సవరించుకుని తనకు వాక్చాతుర్యం లేదని, అందుకే మాట్లాడ్డానికి సిద్ధపడలేదని ప్రకటిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించాడు. తన పద్నాలుగేళ్ల సేవలో తనపై అనేక కుట్రలు, పన్నాగాలు జరిగాయని, నిందలు వచ్చాయని చెప్పాడు. తన శత్రువులు, తనకు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చేవాళ్లు ఎవరో తనకు తెలుసుననీ, కానీ, వాళ్ల ఆకలిని పాడు చేస్తాననే భయంతో వాళ్ల పేర్లు ెప్పడానికి ఇష్టపడడం లేదనీ అన్నాడు. కుట్రలు చేస్తున్నప్పటికీ, కులికిన్ పాఠశాల మొత్తం ఆ ప్రాంతంలో నైతికంగానే గాక, భౌతికంగా కూడా మొదటి స్థానాన్ని ఆక్రమించిందని చెప్పాడు.

‘‘మిగతా చోట్ల ఉపాధ్యాయులకు 200 లేదా 300 రూబుళ్లు వస్తాయి. కానీ నాకు 500 రూబుళ్లు వస్తాయి. అంతేగాక ఫ్యాక్టరీ ఖర్చుతో నా అపార్ట్‌మెంట్‌ను తిరిగి అలంకరించి, సామాన్లను కూడా సమకూర్చారు. ఈ ఏడాది గోడలన్నింటికీ కొత్తగా వాల్ పేపర్లు అంటించారు..’’ అని అన్నాడు.

ఆ తర్వాత అతడు జేమ్ స్త్వొ, ప్రభుత్వ పాఠశాలతో పోలిస్తే తమ విద్యార్థులకు రాత సామగ్రిని ఎంత వుదారంగా సరఫరా చేశారో వివరించాడు. ఈ ఘనత అంతా విదేశాలలో నివశిస్తూ, పాఠశాల వునికి గురించి కూడా పెద్దగా తెలీని ఫ్యాక్టరీర యజమానుల వల్ల కాదనీ, జర్మన్ మూలాలు, లూథరన్ విశ్వాసం వున్నప్పటికీ రష్యన్ ఆత్మ కలిగివున్న ఒక వ్యక్తి వల్లే సాధ్యమైందని అతడు నమ్మాడు. సిసోయెవ్ సుదీర్ఘంగా, మధ్యలో ఆగిఆగి అలంకార ప్రాయంగా మాట్లాడాడు; అతడి మాటలు సాగదీసినట్టుగా, విసుగు పుట్టించేలా మారాయి. పదేపదే కొంతమంది శత్రువుల గురించి ప్రస్తావించాడు. సూచనల రూపంలో మాట్లాడ్డానికి ప్రయత్నించాడు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పాడు. దగ్గాడు. ఇబ్బందిగా వేళ్లను తిప్పాడు. చివరకు, అలసిపోయి చెమటలు పట్టి తనలో తనే మాట్లాడుకోవడం మొదలెట్టాడు. ఆఖరికి పూర్తిగా పొంతన లేకుండా ముగించాడు.

కాబట్టి మనం బ్రూనీకి, అంటే అడాల్ఫ్ అంద్రేయిచ్ కు, ఇక్కడ మన మధ్య వున్న ఆయనకు… సాధారణంగా… ఒక పానీయం తాగుదామని నేను ప్రతిపాదిస్తున్నాను.

అతడు ముగించగానే, ఎవరో గాలిలో చల్లటి నీళ్లు చల్లి ఉక్కపోత పారదోలినట్లుగా అంతా వూపిరి పీల్చుకున్నారు. బ్రూనీకి తప్ప మరెవ్వరికీ అసౌకర్యం కలగలేదు. చిరునవ్వుతో, భావోద్వేగంతో కళ్లు తిప్పుతూ ఆ జర్మన్ వ్యక్తి సిసోయెవ్ చేతిని ఆప్యాయంగా పట్టుకుని, మళ్లీ కుక్కలాగా గారాబం చేయడం మొదలెట్టాడు.

‘‘ఓ… ధన్యవాదాలు!’’ అతడు ‘ఓ’ అక్షరాన్ని నొక్కి పలుకుతూ, తన ఎడమ ేతిని గుండెలకుహత్తుకుంటూ అన్నాడు: ‘‘మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది! మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! కానీ, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు నా ప్రాముఖ్యతను అతిగా అంచనా వేస్తున్నారు. నా అత్యంత ప్రియమైన మిత్రుడు, ఫ్యోదర్ లుకిచ్!- ఈ పాఠశాల అభ్యున్నతి మీ వల్లనే సాధ్యమైంది! మీరు లేకపోతే, ఇది ఇతర పాఠశాలల కంటే ఏ మాత్రం భిన్నంగా వుండేది కాదు! మీరు అనుకుంటారు: ఒక జర్మన్ పొగుడుతాడు, ఒక జర్మన్ చాకచక్యంగా మాట్లాడుతాడు.. అని! కాదు, నా ప్రియమైన ఫ్యోదర్ లుకిచ్! నేను నిజాయితీ పరుణ్ని. పొగడ్తలు మాట్లాడను. మేము మీకు ఏడాదికి ఐదువందల రూబుళ్లు చెల్లిస్తున్నామంటే, మీరు మాకు ప్రియమైన వారని అర్థం. అవునా? మహాశయులారా! నేను నిజం చెప్తున్నాను- మరెవరికీ అంత చెల్లించం… దయచేసి అర్థం చేసుకోండి. ఒక మంచి పాఠశాల అనేది ఫ్యాక్టరీకి గౌరవం!’’

‘‘మీ పాఠశాల నిజంగా అసాధారణమైనదని నేను నిజాయితీగా ఒప్పుకోవాలి.’’ అని ఇన్‌స్పెక్టర్ అన్నాడు. ‘‘ఇవి వట్టి మాటలు అనుకోవద్దు. కనీసం, నా జీవితంలో ఇలాంటిది మరొకటి చూళ్లేదు. నేను మీ పరీక్షకు హాజరయ్యాను. నిరంతరం ఆశ్చర్యపోతూనే వున్నాను.. ఈ పిల్లలు ఎంతో అద్భుతమైన వాళ్లు! చాలా విషయాలు తెలిసిన పిల్లలు. చాలా వేగంగా సమాధానాలు చెప్తారు. అంతేగాకుండా, వాళ్లు ఎందుకో ప్రత్యేకంగా, నిర్భయంగా, నిజాయితీగా వుంటారు… ఫ్యోదర్ లుకిచ్! వాళ్లు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మీరు నూటికి నూరుపాళ్లూ ఉపాధ్యాయులే. మీరు ఉపాధ్యాయుడిగా పుట్టి వుంటారు. మీలో అన్నీ వున్నాయి: సహజసిద్ధమైన వృత్తి నైపుణ్యం, ఎన్నో ఏళ్ల అనుభవం, పని పట్ల ప్రేమ… మీ ఆరోగ్యం బాగా లేకపోయినా, మీలో ఎంతో శక్తి, విషయ పరిజ్ఞానం… అంటే ఓర్పు, ఆత్మవిశ్వాసం వున్నాయో చూస్తే ఆశ్చర్యంగా వుంది! పాఠశాల మండలిలోని ఒకరు మీరు మీ రంగంలో కవి అని చెప్పింది నిజమే… అవును కవి!’’

విందులో వున్న ప్రతి ఒక్కరూ సిసోయెవ్ కున్న అసాధారణ ప్రతిభ గురించి మాట్లాడటం మొదలెట్టారు. ఆనకట్ట బద్ధలైనట్లుగా అనిపించింది… ఉత్సాహభరితమైన ప్రసంగాలు వెల్లువెత్తాయి. సిసోయెవ్ ప్రసంగాన్ని, భరించలేని అతని స్వభావాన్ని, అతని ముఖంలోని కోపంతో కూడిన, అసహ్యకరమైన భావనను- అన్నిట్నీ మర్చిపోయారు. మౌనంగా, బిడియంగా వుండే కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు, ఇన్‌స్పెక్టర్ ను కేవలం ‘‘మహోదయా!’’ అని మాత్రమే సంబోధించే పేద, అణగారిన వర్గాల యువకులు కూడా- అందరూ మాట్లాడ్డం ప్రారంభించారు. స్పష్టంగా, సిసోయెవ్ తన పరిధిలో ఒక విశిష్టమైన వ్యక్తి.

పద్నాలుగేళ్ల సేవలో ప్రశంసలకు అలవాటు పడిన సిసోయెవ్ తన అభిమానుల ఉత్సాహభరితమైన కేకలను వుదాసీనంగా విన్నాడు.

బ్రూని మాత్రం ఆ ప్రశంసలలో మునిగిపోయాడు. ఆ ప్రశంసలను ఉపాధ్యాయునికి గాక, తనకే అన్నట్లుగా చిరునవ్వులు చిందిస్తూ, చప్పట్లు కొడుతూ సిగ్గుతో ముఖం ఎర్రబడగా, ప్రతిమాట శ్రద్ధగా విన్నాడు.

‘‘శభాష్! శభాష్!’’ అని అతడు అరిచాడు. అవును! నా ఆలోచనలు మీరు వూహించారు! అద్భుతం!’’

అతడు తన ఆనందాన్ని గురువుతో పంచుకోవాలి అన్నట్లుగా ఆయన కళ్లలోకి చూశాడు. చివరికి, ఇక భరించలేక ఒక్కసారిగా లేచి నిలబడి, తన కీచుగొంతుకతో అరిచాడు:

‘‘మహాశయులారా! నన్ను మాట్లాడనివ్వండి. ష్ష్.. మీ మాటలన్నిటికీ నేను చెప్పగలిగింది ఒకటే: ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యోదర్ లుకిచ్ రుణాన్ని వుంచుకోదు.

అంతా నిశ్శబ్దంగా వుండిపోయారు. సిసోయెవ్ ఎర్రబారిన ఆ జర్మన్ వ్యక్తి ముఖంవైపు చూశాడు.

‘‘అభినందించడం మాకు తెలుసు!’’ బ్రూని గంభీరమైన ముఖం పెట్టి గొంతు తగ్గించి కొనసాగించాడు. ‘‘మీరు చెప్పిన వాటన్నిటికీ ప్రతిస్పందనగా నేను మీకు చెప్పాల్సింది ఏమంటే.. ఫ్యోదర్ లుకిచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. ఆ మూలధనం నెలరోజుల క్రితమే బ్యాంకులో జమ చేయడం జరిగింది.’’

సిసోయెవ్ అయోమయంగా ఆ జర్మన్ వైపు, అతని సహచరుల వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తనను గాక, తన కుటుంబాన్ని పోషించడం ఎందుకు? అనుకున్నాడు. ఆపై, తనపై నిశ్చలంగా నిలిచిన ప్రతి ముఖంలో, ప్రతిచూపులో తాను అసహ్యించుకునే సానుభూతి, లేదా కరుణ కాకుండా మరేదో అతనికి కనిపించింది. అది మృదువైన, సున్నితమైన, అదే సమయంలో అత్యంత అశుభకరమైన, ఒక భయంకరమైన సత్యాన్ని పోలినది- అది తక్షణమే అతని శరీరాన్ని చలితో, వర్ణించలేని నిరాశతో అతని ఆత్మను నింపేసింది. వికృతమైన ముఖంతో అతడు హఠాత్తుగా లేచి తలపట్టుకున్నాడు. బ్రూనీ చెప్పిన ఆసన్నమరణాన్ని తన కళ్లెదుటే చూస్తున్నట్టుగా, భయంతో అరనిముషంపాటు అక్కడే నిలబడి, ఆ తర్వాత కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాడు.

‘‘అయ్యో, ఏమైంది? మీకేమైంది?’’ ఆందోళనతో కూడిన స్వరాలు అతనికి వినిపించాయి. ‘‘కొంచెం నీళ్లు తాగండి!’’

కొంతసేపటి తర్వాత ఉపాధ్యాయుడు శాంతించాడు. కానీ, భోజనం చేస్తున్న వాళ్లలో మునుపటి సందడి తిరిగి రాలేదు. ఒక నిస్తేజమైన నిశ్శబ్దంతో విందుభోజనం ముగిసింది.

ఇంటికి చేరుకున్న సిసోయెవ్ అన్నిటికంటే ముందు అద్దంలో తనను తాను చూసుకున్నాడు.

‘‘అయ్యో! నేనక్కడ ఏడవకుండా వుండాల్సింది!’’ అని తన కళ్ల కింద నల్లటి వలయాలను, లోపలికి పీక్కుపోయిన చెంపలను చూసుకుంటూ అనుకున్నాడు.

‘‘నిన్నటికన్నా ఈరోజు నా ముఖం చాలా బాగుంది. నాకు రక్తహీనత, కడుపులో కఫం వున్నాయి. నా దగ్గు కేవలం కడుపు నొప్పి వల్ల మాత్రమే!’’

అప్పటికి శాంతించిన అతడు నెమ్మదిగా బట్టలు మార్చుకుని, తన నల్లప్యాంటును చాలాసేపు బ్రష్ తో శుభ్రం చేసి, తర్వాత వాటిని జాగ్రత్తగా మడిచి బల్ల సొరుగులలో పెట్టి తాళం వేశాడు.

తర్వాత అతడు విద్యార్థుల నోట్ బుక్కుల కట్ట వున్న బల్ల దగ్గరికి నడిచి, బాబ్కిన్ నోట్ బుక్ ను ఎంచుకుని, కూర్చుని ఆ పిల్లాడి అందమైన చేతి రాతను చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు…

అదే సమయంలో పక్క గదిలో కూున్న జిల్లా డాక్టరు, బహుశా అప్పటికి ఇక వారం రోజుల జీవితం మాత్రమే మిగిలివున్న వ్యక్తిని రాత్రి భోజనానికి బయటికి వెళ్లనివ్వకూడదని అతడి భార్య చెవిలో గుసగుసలాడుతున్నాడు.

1886లో ప్రచురితం

వివరణ:
జేమ్‌స్వొ : స్థానిక పరిపాలన సంస్థ- రహదారులు, ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణకు (విప్లవానికి పూర్వం) బాధ్యత వహించేది.
క్యచక్: పైనుంచీ మడమల దాకా బిగుతుగా వుం డే వస్త్రవిశేషం.రోమన్ కాథలిక్, ఆంగ్లికన్ చర్చ్ మాట గురువులు
ధరిస్తారు.

కేశవ్ గోపాల్

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.

అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం

Previous Post

హిందీ కవిత : పోస్టర్లూ – మనుషులు!

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

రష్యన్ కథ: బడిపంతులు

రష్యన్ కథ: బడిపంతులు

by కేశవ్ గోపాల్
November 19, 2026
0

...

కన్నడ కథ: చెరసాల

కన్నడ కథ: చెరసాల

by చందకచర్ల రమేశబాబు
November 19, 2026
0

...

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

by రంగనాధ రామచంద్రరావు
November 19, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

by శివ చల్లా
November 19, 2026
0

...

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

by విఎల్ నరసింహం శివకోటి
November 19, 2026
0

...

ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ కథ : మొజెల్

by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
0

...

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

హిందీ కవిత : పోస్టర్లూ – మనుషులు!
అనువాద కవితలు

హిందీ కవిత : పోస్టర్లూ – మనుషులు!

November 19, 2026
మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026

అభిప్రాయాలు

  • buchireddy gangula on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply