• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
November 19, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ : తల్లీ సాకీబాయి

     కన్నడ మూలం: డా. బి.టి. లలితా నాయక్
అనువాదం: రంగనాథ రామచంద్రరావు

ఆకాశం అంతటా మబ్బులు కమ్మినందువల్ల మధ్యాహ్నమో, అపరాహ్నమో అన్నది కనిపెట్టడమే కష్టమైంది. అరుదుగా ఒకసారి మబ్బు తొలగి సూర్యుడు దర్శనమిచ్చి కిరణాలు చురుకు ముట్టించినపుడు “ఇంకా మధ్యాహ్నమే” అని ఊహించింది సాకీబాయి.

నిన్న రాత్రి తిన్న చద్దన్నం ఎప్ప్పుడో భస్మమై పొట్ట చురుక్కుమనసాగింది. ఒంటి నొప్ప్పులు బాధిస్తున్నాయి. అలసిన కాళ్ళు ముందుకు సాగటానికి ఇబ్బంది పెట్టసాగాయి. తలమీది గడ్డిమోపు తిరుపతి కొండను మోస్తున్నట్టు భారమవుతోంది.

అయినా ఊరు తప్పకుండా చేరుకోవలసి ఉండటం వల్ల కాళ్ళీడుస్తూ నడుస్తోంది. కూతవేటు దూరంలో కొందరు గ్రామీణ యువతులు గలగలమని మాట్లాడుకుంటూ తనకు ఎదురుగా రావటం చూసి ఆమె సిగ్గు, సంకోచాలతో కుంగిపోయింది.

తప్పుకోవటానికి మరో దారి ఉందా? అని అటూఇటూ చూసింది. ఊహూఁ చుట్టూ కంచె ఉంది.. దాని మధ్య వచ్చిపోయే వాళ్ళకు ఒకటే దారి. తప్పనిసరిగా సూటిగా నడిచింది.

తాను ఊరివాళ్ళ నాలుకకు ఆహారమై ఉండటంవల్ల వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటూ ఉండొచ్చని అనిపించింది. వాళ్ళు దగ్గర పడ్డట్టల్లా దేవల్యా, పీరి, మునియ, సంక్రా అనే పేర్లు చెవినపడి ఆమె ఊహకు అవకాశం దొరికింది.

వీళ్ళ నోట సంక్రా పేరు ఎందుకు వచ్చింది? అని సాకీబాయి చింతితురాలైంది. అతను ఊరికి వచ్చాడా అని గాభరా మొదలైంది. గుంపు తనకు దగ్గర కాగానే మాటలు నిలిపి ‘థూ’ అని నేలమీద ఉమ్మటం ద్వారా తన తిరస్కారాన్ని వ్యక్తపరిచి ముందుకుసాగింది.

అలాంటి ప్రవర్తన తనకు కొత్తదేమీ కాకపోవటం వల్ల గుండెలో లేచిన మంటను బయటపెట్టకుండా మౌనం వహించింది.

“సిగ్గులేని ముసిల్ది. సవితి కొడుకూ, కోడలూ ఇచారణకు వచ్చిండారు. బిరీనపో. ఇనుప గూటం కాల్చి వాత పెడ్తారు. పెట్టించుకో పో” అని ఆడవాళ్ళ మాటలు వెనుక నుంచి బాణాల్లా దూసుకుని వచ్చినపుడు సాకీబాయి చలి వేసినట్లు వణికింది. తల మీది మోపును నేలమీదికి విసిరి నేలమీద కూలబడింది.

‘సంక్రా వచ్చాడు. ఇచారణ …’ అనే మాటలు ఆమెను భయాందోళనతో వణికేలా చేశాయి.

నాలుగు రోజుల క్రితం ఆమె సొంత కొడుకు దేవల్య ఎద్దులను కొట్టే చెర్నాకోలతో మూతిముఖం చూడకుండా తల్లిని తీవ్రంగా కొట్టాడు. వీధంతటా ఇష్టమొచ్చినట్టు కొట్టుకుంటూ, కిందపడేసి తొక్కుతూ ఇంటి నుంచి బయటికి తోశాడు. కోడలు పీరి కూడా భర్త కార్యంలో సమాన భాగస్థురాలై అత్త ముఖం మీద ఉమ్మింది.

తమాషా చూస్తున్న ఇరుగుపొరుగు జనం తప్పుచేసిన దానికి బాగా దెబ్బలు పడటం చూస్తూ సంతృప్తితో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి సాకీబాయి సేవాలాల్ గుడి అరుగు మీదనే నివసిస్తోంది. రాత్రీపగలూ పడినచోటే పడివుండి మూల్గుతున్నప్పటికీ కొడుకుకానీ, కోడలు కానీ తిరిగి చూడలేదు.

అంగడింటి మునియ అర్ధరాత్రి సమయంలో దొంగతనంగా ఒకింత అన్నం తెచ్చి, తినిపించి వెళ్ళడంతో రెండో రోజున ఆమెకు తనంతట తానే లేచి కూర్చోవటానికి సాధ్యమైంది.

బోరుబావికి దగ్గరికి వెళ్ళి కూర్చుని ముఖం కాళ్ళుచేతులు కడుక్కుని, పొలానికి వెళ్ళి గడ్డి, చొప్పదంట్లు పెరికి, సంతకు వెళ్ళి అమ్మి, గింజలు తెచ్చుకుని కడుపుకు దారి చూసుకోవాలని బయలుదేరిన ఆమెను గ్రామానికి గ్రామమే ఎత్తిపొడుపు మాటలతో పొడిచింది.

“నానైతే యిట్లాంటి మొగం పెట్టుకుని ఊళ్ళో తిరగేదాన్ని కాదు. ఈ పాటికి యా చెరువులోనో, బావిలోనో దుముకి పేణాలు తీసుకునేదాన్ని”

సాకీబాయికీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎన్నోసార్లు వచ్చింది. అయితే మునియ ముఖం చూడగానే, ఆ ఆలోచన పుట్టిన చోటే మరణించేది. ప్రేమ, విశ్వాసాలు చూపించే ఒక మృదువైన హృదయం, వందలాది ముళ్ళ నాలుకల దాడిని తట్టుకునే శక్తిని ఇచ్చింది.

అయితే ఆ శక్తి ఇక ముందు తనలో మిగలదని ఆమెకు కచ్చితంగా అనిపించింది. ఆకలిదప్పులతో కలవరపడిన ఆమె ఏదో విధంగా ఊరు చేరాలని నిర్ణయించుకుంది.

అయితే అక్కడికి ఎలా వెళ్ళాలి? అతనూ, దేవల్యా కలిసి తనను ఎట్లాంటి హింసలకు గురిచేస్తారో ఏమో? ఆ రోజు తాను, మునియ జొన్న పొలంలో ఉండటం చూసి ఎవరో ఊరంతా పుకారు లేపిననందుకు, కొడుకు, కోడలు తనను ఎంత హింసించారు? ఎంతటి అవమానం భరించాల్సి వచ్చింది. ఇప్ప్పుడు పెద్దకోడలు వచ్చిందట…

కానీ నిజానికి ఆమె మంచి పిల్ల. శంకర ఉద్యోగం చేస్తున్న ఆఫీసులోనే ఆమె కూడా ఉద్యోగం చేస్తుండేదట. అప్ప్పుడే ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి నమ్మకం పెరిగి, ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళిచేసుకున్నారట.

కన్నతల్లి అయివుంటే పెళ్ళికి పిలిచేవాడేమో సంక్రా. తనకు ఒక్క మాటా చెప్పలేదు. ‘మీ సంక్రా వేరే కులపోళ్ళ పిల్లని పెండ్లి సేసుకున్నాడు’ అని వాళ్ళు వీళ్ళు చెప్పిన విషయం నిజమో అబద్దమో చూడాలని దేవల్యాను తోడుతీసుకుని హరిహర బస్సు ఎక్కింది. పగలంతా వెతికి సాయంత్రానికి ఇంటిని కనుక్కుని తలుపు తట్టినపుడు, మెరుపు కళ్ళతో, సౌమ్యమైన ముఖంతో సాధారణమైన దుస్తులు ధరించిన యువతి తలుపు తెరిచింది.

“ఇది సంక్రా ఇల్లేనా అమ్మా?” అని అడగ్గానే, “అవును” అనే జవాబు వచ్చింది.

“నేను అతడి తల్లిని- సాకీబాయిని. ఇతను దేహల్యా అని సంక్రా తమ్ముడు” అని పరిచయం చేసుకుంది.

“ఓహ్! అవునా? రండి, లోపలికి రండి అత్తయ్యా. నేను మీ కోడలు సీతను” అని సీత ప్రేమాదరాలతో అత్తను, మరిదిని లోపలికి ఆహ్వానించి, సంతోషంతో కాఫీ, టిఫిన్ పెట్టి మర్యాద చేసింది. “మీ అబ్బాయి కూరగాయలు తీసుకుని రావటానికి మార్కెట్‌కు వెళ్ళారు. ఇంకొద్ది సేపట్లో వచ్చేస్తారు” అని మాటలు మొదలుపెట్టింది. వర్షం, పంటలు, గ్రామీణ జీవితం గురించి ప్రశ్నలు అడిగింది.

తన భర్త ఇంటి విషయాలన్నీ తెలుసుకునే కోరిక బయటపెట్టినపుడు, సాకీ బాయి శంకర తల్లిదండ్రుల గురించి, కొన్నేళ్ళ క్రితం చనిపోయిన తన అత్తామామల గురించి వివరంగా చెప్పింది.

విషయాలన్నీ శ్రద్దగా విన్న సీత`“అత్తయ్యా, మీరు దేవల్యా తల్లి అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్ప్పుడు మీ వయస్సెంత?” అని ఆడిగింది.

సాకీబాయి నవ్వుతూ “ఆ మాట వదిలెయ్యమ్మా, వచ్చే ఏడు మా దేవల్యాకు పెండ్లి సేస్తాను. కోడలు వస్తుందంటే నేను ముసలిదాన్ని అయినట్టే లెక్కకదమ్మా?” అని అడిగింది.

“గ్రామాల్లో అలాగే ఆలోచిస్తారని తెలుస్తోంది. అయితే అలా అనుకోవడం పొరబాటు అత్తయ్య. మీ పెళ్ళయినపుడు మీకు 14-16 ఏళ్ళుండొచ్చని అన్నారు. తరువాత సంవత్సరానికి దేవల్యా పుట్టాడని చెప్పారు. ఇప్ప్పుడు ఇతనికి 16 ఏళ్ళు ఉండొచ్చు. అంటే మీ వయస్సు ఎంతో తెలుసా? ముప్ఫయి ఒకటో లేదా ముప్ఫయి రెండో ఉంటుంది. అంతే, ఈ వయసులో ఎంతో మంది అమ్మాయిలకు పెళ్ళే జరిగివుండదు”.

అత్త నల్లటి ఒత్తయిన జుత్తు, ముత్యాల్లా మెరిసే పలువరుస, ఎత్తయిన ఆకారం, ఆకర్షణీయమైన శరీర నిర్మాణం- అన్నిటినీ గమనించిన సీత, ఆమె శారీరక సంపద పట్ల అభిమానం ఏర్పరుచుకుంది.

ఇంత చిన్న వయసులోనే తన అత్త ఈ విధంగా వితంతువు కాకుండా ఉండాల్సిందని అనుకుంది. తన భర్త అప్పుడప్పుడు చెప్పే ‘మునియ’ అనే వ్యక్తి గురించి అడగాలని అనుకున్నా, మరిది ముందు ఆ మాటలు సమంజసం కాదని మౌనం వహించింది.

‘అత్తయ్యా, నేను మీ ఊరికి ఒకసారి రానా? అక్కడికి రావాలని నాకు చాలా కోరికగా ఉంది” అని ఆడిగింది.

“అయ్యో నా తల్లీ, అది నీ ఇల్లేనమ్మా. నువ్వు యా పొద్దు రావాలనుకున్నా వచ్చి పోమ్మా. ఈ రోజే వొస్తావా? నాతో తీస్కుని పోతాను” అని సాకీబాయి మనసారా ఆహ్వానిస్తుండగా కూరగాయల సంచి పట్టుకుని శంకర లోపలికి వచ్చాడు.

పిన్నిని చూడగానే మండిపడ్డాడు. “మా నాన్న చనిపోయినప్పుడే మా పిన్ని కూడా చనిపోయిందని నేను భావించాను. మొదట ఈమెను ఇంటి నుంచి బయటికి పంపు సీతా. ఇలా నువ్వు ఇంటికి పిల్చి చోటు ఇస్తే, రేపు తన మిండేగాళ్ళను పిల్చుకుని వస్తుంది, చూస్తుండు… గ్రామంలో మా మర్యాద కాసుకు కిలో లెక్కన వేలం వేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంది- సిగ్గులేకుండా” అని లోపలి గది నుంచి కేకలు పెట్టడంతో సాకీబాయి చప్పున పైకి లేచి బయటికి నడిచింది.

ఎర్రబడిన ముఖంతో దేవల్యా కూడా లేచి తల్లిని అనుసరిస్తూ బయలుదేరుతుండగా శంకర వచ్చి, “ఆగరా దేవల్యా, నీ మీద నాకేమి కోపం లేదు. ఇంకో నాలుగు రోజులు ఉండి వెళ్ళు” అని తమ్ముడిని ఆపాడు.

ఒక వారం తర్వాత ఇంటికి తిరిగొచ్చిన దేవల్యా తల్లికి పరమశత్రువుగా మారిపోయాడు. సరిగ్గా మీసాలు కూడా మొలవక ముందే పొరుగు పల్లెలోని పీరిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. భర్తకు తగిన భార్య అయిన ఆ అమ్మాయి బుద్ధి అత్తను వేధించటంలోనే అదో రకమైన ఆనందాన్ని అనుభవిస్తోంది.

పొలం గట్టుమీదో, కొండగుట్ట చివరలోనో, మునియతోపాటు కూర్చుని కన్నీళ్ళు పెడుతూ తన సమస్యలన్నీ చెప్పుకునేది సాకీబాయి.

అతను తన కండువా చివరతో ఆమె కన్నీళ్ళను తుడుస్తూ సాహసవంతమైన పరిష్కారం సూచించాడు.

“ఇంకెన్ని రోజులు ఈ బాధ అనుభవిస్తావు సాకీ? ఈ జనం మనల్ని బతకనివ్వరు. మనమిద్దరం ఇంకా దృఢంగా ఉన్నాం. ఎక్కడైనా పనీపాటలు చేసుకుని బతుకుదాం పదా, దూరంగా వెళ్ళిపోదాం” అన్నాడు.

సాకీ అడ్డంగా తలూపింది.

“ఎట్లా పోయేది మునియా? నీ భార్య సూస్తే రోగిష్ఠి మనిషి. ఇప్డో ఇంగో గడియలోనో సచ్చిపోయేలా ఉండాది. నీ బిడ్డ పెండ్లి కాలేదు. నీ కష్టంతోనే వాండ్ల కడుపులు నిండాలి. అట్లాంటప్పుడు వాళ్ళను మధ్యన వొదిలేసి పారిపోతే ఆ దేవుడు మెచ్చుతాడా? నీ భార్య బిడ్డల సాపాలు మనిద్దర్ని కాల్చేయవా?”

ఆమె మాటకు ఎదురు చెప్పలేక మునియ మౌనం వహించాడు. ఆమె కన్నీళ్ళను తుడిచి, అదే కండువాతో తన కన్నీళ్ళను తుడుచుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. దుఃఖాన్ని భరించలేనట్టు సాకీబాయి తన తలను గడ్డిమోపు మీద ఒరిగించింది. ఇప్పటిదాకా తన జీవితంలో తాను పడిన సుఖమెంత? దుఃఖమెంత? అని ఆమె లెక్కపెట్టడానికి ప్రయత్నించింది.

దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం నడి వయస్సులోని సేవ్యా తన చేయి పట్టుకున్నప్పుడు తాను చిన్న వయస్సులోని లేత పిల్ల. అతను బతికివున్న ఐదారు సంవత్సరాల కాలంలో తనకు అతని వల్ల దక్కింది ఒక మగబిడ్డ మాత్రమే. ప్రేమ`ప్రీతి, అనురాగం ఇలాంటివి చవిచూడని సంసారం తనది. అప్పుడప్పుడు అతను తన శరీరం మీద దాడి చేసినపుడు ఆ క్షణాలను పళ్ళు బిగపట్టి భరించడం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది.

ఇంటి పనులు చేయడానికి, అత్తామామల సేవ చేయడానికి, చనిపోయిన తన భర్త మొదటి పెండ్లాం కొడుకును చూసుకోవడానికే వాళ్ళు తనను కోడలిగా తెచ్చుకున్నారని అర్థమైంది. తొమ్మిదేళ్ళ సవితి కొడుకుతోపాటు తన కొడుకునూ చూసుకునే బాధ్యత తప్ప జీవితంలో ఏ కొత్తదనాన్ని తాను చూడలేదు. అదే నిర్లిప్తమైన యాంత్రికమైన దినచర్య.

భర్త గొంతులో పుండుతో బాధపడి చనిపోయిన సమయంలో తనకు ఇరవై ఏళ్ళు. సంవత్సరం పాట తాను ఒంటరిగా రోజులు గడిపిన తర్వాత తన తల్లిదండ్రులు తగిన వరుడితో తనకు మారుమనువు చేయాలనే మాట ఎత్తారు.

అయితే తన జీవితంలో అకస్మాత్తుగా ప్రవేశించి, ప్రీతి, ప్రేమ, వలపులను పరిచయం చేసిన అంగడింటి మునియను వదిలి తాను దూరంగా వెళ్ళలేకపోయింది.

భార్యాపిల్లలున్న అతనితో తన మనువు అసాధ్యం అనే మాట నిజమైనప్పటికీ, అతని మాటలు వినటం, ముఖం చూడటం, ఇవిమాత్రమే తనపాలిట ఇష్టమయ్యాయి. అతను తన కంటి ముందుంటే చాలు. జీవితమంతా ఉత్సాహంతో గడపగలదని అనిపించింది. దాంతో తల్లితండ్రుల ఆలోచనను మృదువుగా తోసివేసి, అత్తామామల చాకిరీ చేస్తూ అక్కడే శాశ్వతంగా ఉండిపోయింది.

‘అత్తా…” మృదుమధురమైన స్వరం వినిపించటంతో, సాకీబాయి కలల లోకం నుంచి బయటికి వచ్చినట్లు తలెత్తి చూసింది. తనకు ఇష్టమైన కోడలు సీత వచ్చి ఎదుట నిల్చుంది. తోడుగా చేతిలో సంచి పట్టుకుని నిల్చున్న మునియ!

సాకీబాయి నోటి నుంచి ఒక్క అక్షరం వెలువడలేదు. సీత అత్త ముందు మోకాళ్ళపై కూర్చుని మెల్లగా అంది`

“అత్తా, నాకు అన్ని విషయాలు తెలిశాయి. మీ తప్పేమి లేదు. అయినా మీకు శిక్ష మాత్రం తప్పలేదు. అందువల్ల మీరు, మునియ మామ ఇద్దరూ ఎక్కడికైనా దూరంగా వెళ్పిపోండి”

సాకీబాయి ఏమీ అర్థంకానట్టు కళ్ళు విప్పార్చుకుని కోడలినే చూసింది.

“అత్తా, నా మాట వినండి. మీరు ఆలస్యం చేసినకొద్దీ ప్రమాదం ఎక్కువ. దేవల్యా నిన్న మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి అన్నతమ్ముళ్ళు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. మీ ఇద్దరి మీద విషం కక్కుతున్నారు. పల్లెకు వాళ్ళిద్దరే రావాలనుకున్నారు. నేను పట్టుబట్టి వారితోపాటు వచ్చాను”

సాకీబాయి మునియ ముఖం చూసింది.

“లే సాకీ. నీ కోడలు మన ప్రాణాలు కాపాడే దేవిలా వచ్చింది. వెళ్ళిపోదాంరా. ఈ తల్లి పేరు చెప్పుకుని ఎక్కడైనా నాలుగు కాలాలు బతుకుదాం” అని మునియ సాకీతో అనగానే ఆమె లేచి నిలుచుంది. సీత చేతులు తన కళ్ళకు ఒత్తుకుని `“ఇతను రావడం వద్దు సీతమ్మ. నానొక్కదాన్నే దూరంగా పోతాను. ఎందుకంటే ఇతని భార్య పోయింది. ఆడబిడ్డ ఒక్కతే ఇంట్లో ఉండాది. ఇతను లేకపోతే ఆమె వీధిపాలవుతాది…” అంది. అయితే సీత మునియ మామ కూతురు బాధ్యత తాను మోస్తానని మాట ఇవ్వడంతో సాకీబాయికి అడుగు ముందుకు వేయడానికి ఏ భయమÖ లేకపోయింది. సీత ఆమె చేతికి వంద రూపాయల నోటిచ్చి “మీకేమైనా ఇబ్బంది కలిగితే ఈ చిరునామాకు ఉత్తరం రాయండి” అని ఆఫీసు అడ్రెస్ ఇచ్చి, వీడ్కోలు పలికింది.

పొలం గట్టుమీద నిల్చొని వాళ్ళు వెలుతుండటమే చూస్తూన్న సీత, ‘ప్రస్తుతం వాళ్ళు బయటపడ్డారు’ అని సంతృప్తి చెందింది. తమ పాలిటి దేవతకు పదేపదే కృతజ్ఞతతో చేతులు ఊపుతూ ప్రేమికులు కొద్ది సేపట్లోనే తగ్గు ప్రదేశంలో కనుమరుగవ్వటంతో, సీత సంతృప్తితో నిట్టూర్పు విడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది.

“మొగోళ్ళిద్దరూ యాడ సీతక్కా? నువ్వొక్కదానివే వచ్చిండావుకదా?” అని పీరి ప్రశ్నించటంతో సీత గుండె గుభేల్‌మంది. “వాళ్ళు నాకెక్కడా కనిపించలేదే. నేనొక్కదాన్నే కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చాను…” అంది.

“అట్లయితే ఈడ్నే చావడికట్ట దగ్గర కూసునివుండాలి. మనమిద్దరం తిందాంరా” అని పీరి పిలిచింది.

“ఇంకా ఏడుగంటలు కూడా కాలేదు. వాళ్ళిద్దరు రానివ్వు, కలిసి భోంచేద్దాం” అని సీత చెప్పటంతో “భోజనాలకి మా కోసం ఎదురు సూడొద్దని సెప్పారక్కా, సీకటిపడిన తర్వాత కూసుని సేసేడిదేముండాది? బిరీన తిని పడుకుందాం” అని పీరి పిలిచింది.

“చీకటి పడటం, తిని పడుకోవటానికి” అని పీరి ఒత్తిడి పెట్టడంతో, సీత భోజనం అయిందనిపించి, చాపమీద మేను వాల్చింది. క్షణక్షణానికి ఆమె భయం పెరుగుతోంది. భర్తకు, మరిదికి తన ప్లాను అంతా తెలిసిపోయిందా… ఎలా…? చాలాసేపటి వరకూ ఆమె నిద్రపట్టకుండా దొర్లుతూ ఉన్నప్ప్పుడు “పీరి,చాప తీస్కునిరా, ఈడ నాను, అన్న వసారాలో పడుకుంటాం” అని దేవల్యా అడగటం వినిపించింది.

పీరి లేచి తలుపు తెరిచి భర్తకు చాప, తలగడ ఇచ్చింది.

“మీరిద్దరూ ఇంతసేపు ఎక్కడికి పొయారు? సీత వాచీ చూస్తూ భర్తను అడిగింది.

“ఇక్కడే చావడికట్ట మీద కూర్చున్నాం. ఆ తర్వాత నింగప్ప మామ ఇంట్లో భోంచేశాం. మాటల్లో కాలం గడిచిందే తెలియలేదు.” అతను సహజంగా జవాబిచ్చి చాప మీద పడుకున్నాడు. సీత నిశ్చింతగా నిద్రపోయింది.

తెల్లవారి గంట గడిచివుండొచ్చు. బయటి నుంచి ఎవరో, ‘పీరక్కా’ అని ఒకేలా కేకలు వేసినపుడు సీతకు మెలకువ వచ్చింది. ఆమె లేచి పీరితోపాటు గుమ్మంలోకి వచ్చింది.

భయంతో వణుకుతున్న కుర్రవాళ్ళు ఒక్కగుక్కలో చెప్పారు. “మీ సాకవ్వ, అంగడింటి మునితాత చెరువు గట్టుమింది రావి సెట్టుకు ఉరివేసుకుండారు”

“యెవరో ముందుగాలే సంపేసి, సివరికి ఉరివేశారక్కా, సూస్తే అర్థమైపోతాంది” అని వాళ్ళల్లో ఒకడు చెప్పినపుడు, సీత కళ్ళు నిప్ప్పులు రాల్చుతూ ఎవరినో వెతికాయి.

కోపంతో ఆమె పిడికిలి బిగిస్తున్నట్టే మగవాళ్ళిద్దరూ హడావుడిగా ముంగిలి దాటి రోడ్డు మీద పడ్డారు…

బి.టి. లలితా నాయక్
జననం: 1945, తంగలి తాండ, (చిక్కమగళూరు జిల్లా)
చదువు: హిందీ విశారద
వృత్తి: మాజీ శాసన సభ్యులు, మాజీ మంత్రి, మాజీ విధాన పరిషత్ సభ్యులు, లంబాణి సేవా సంఘం అధ్యకులు, సమాజసేవకురాలు, నగర జిల్లా కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యకులు,
రచనా వ్యాసంగం: చిన్న కథలు, కవిత్వం, నవల, రేడియో నాటకాలు, బాలసాహిత్యం రంగాలలో రచనలు ప్రచురితం.

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

Next Post

కన్నడ కథ: చెరసాల

Next Post
కన్నడ కథ: చెరసాల

కన్నడ కథ: చెరసాల

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ: చెరసాల

కన్నడ కథ: చెరసాల

by చందకచర్ల రమేశబాబు
November 19, 2026
0

...

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

by రంగనాధ రామచంద్రరావు
November 19, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

by శివ చల్లా
November 19, 2026
0

...

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

by విఎల్ నరసింహం శివకోటి
November 19, 2026
0

...

ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ కథ : మొజెల్

by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
0

...

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • buchireddy gangula on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply