• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

విఎల్ నరసింహం శివకోటి by విఎల్ నరసింహం శివకోటి
November 19, 2026
in అనువాద కథలు
0
హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

    హిందీ మూలం : డా. యశోధర భట్నాగర్
తెలుగు అనువాదం : డా. వి.ఎల్. నరసింహం శివకోటి

రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం. కుంభవృష్టి. ఊరు ఊరంతా మునిగిపోయినట్టుంది. రోడ్లన్నీ నదుల్లా ప్రవహిస్తున్నాయి. ఆకాశం తన లోపలి భారమంతా భూమ్మీద గుమ్మరిస్తున్నట్టుంది. ఆసుపత్రి ఏడో అంతస్తు కిటికీలో నుంచి చూస్తూంటే మెల్లమెల్లగా ఊరంతా నీటిలో మునిగి కరిగిపోతుందా అన్నట్టుంది.
నా చేతిలో అమ్మ మెడికల్ రిపోర్టులు.

“ఇంటర్స్టియల్ లంగ్ డిసీజ్ …. ప్రొగ్రెసివ్…”

“ఊపిరితిత్తులు మెల్లమెల్లగా పనిచెయ్యడం మానేస్తున్నాయి. రోగం ముదిరిపోయింది. ఇంచుమించు ఆఖరి దశ. ఈమెకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోండి. రోగంతో పోరాడటంలో ఆమెకు తోడుగా నిలబడండి.” – డా. ఖన్నా కళ్లజోడు తీసి గంభీరంగా చూస్తూ చెప్పారు.

“ఇంకా ఎన్నాళ్ళు….?” నన్ను నేను సంభాళించుకుంటూ అడిగాను. గొంతుపెగిలి ఆ రెండు పదాలు బయటకి రావడమే గగనమయిపోయింది.

డాక్టరు కాసేపు మౌనంగా ఉండిపోయాడు.

“చూడండి, ఇప్పుడు ఆమెకు కావలసిఉంది మందులు కాదు …. మీ తోడు. ఆవిడతో మీరు ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత మంచిది. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను.”

‘నా తోడు?’ – ఈ రెండు పదాలు నాకు మింగుడు పడట్లేదు. ఇల్లు-ఆఫీసుల మధ్య నా ఉరుకులు-పరుగులు, ట్రాఫిక్, లోకల్ ట్రైన్ రష్ …. ఆఫీసులో వర్క్ ప్రెషర్ … ముక్కలు ముక్కలుగా విడిపోయిన నేను, నా జీవితం … ఏదో ఆ ఆదివారమే కాస్తం టైం దొరికేది. ఎంత ప్రయత్నించినా నాలుగు రోజులపాటు అమ్మతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పే అవకాశమే దొరకదు.

గత రెండు సంవత్సరాలుగా అమ్మ ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతోంది. మొదట్లో కొద్దిగా దగ్గు వచ్చేది, తర్వాత మెల్లమెల్లగా మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం …. ఇప్పుడు పడక గదిలో నుండి వంటింట్లోకి వెళ్లాలంటే కూడా ఏదో పర్వతం ఎక్కినంత అలసిపోతోంది ఆమె!

అయినా, అమ్మ ఈ పాడు రోగంతో శక్తివంచన లేకుండా పోరాడుతూనే ఉంది. అందుకే కదా, గత కొన్నేళ్ళుగా నడుస్తున్న ఆమె దినచర్యలో ఎలాంటి మార్పూ రాలేదు.

ఇవాల్టికి కూడా రోజూ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి, తులసికోట దగ్గర దీపం పెడుతుంది. పూజ కానిచ్చుకుని మెల్లగా వంట పని మొదలుపెడ్తుంది. అలా చిన్నగా దగ్గుతూనే నాకోసం పరాఠా – కూర చేసి లంచ్ బాక్సు సిద్ధం చేస్తుంది.

“అమ్మాయ్, లంచ్ బాక్సు రెడీ. పట్టుకెళ్లు. తిను. ఆఫీసు పనిలో పడి మర్చిపోకు. బయట తిండి తినకు. అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది.”

ఊపిరితిత్తుల్లో చేరుకుంటున్న నిమ్ము కూడా, ఆమె తల్లిప్రేమని మసకబారనివ్వలేదు.
ఎం.టెక్. అవుతూనే నాకు ఒక మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది. నా టీమ్ ‘ఎమోషనల్ ఏ.ఐ.’ మీద పనిచేస్తుంది. మానవ సహజమైన మనోభావాలను గుర్తించి, ఒంటరిగా ఉండే వాళ్ళతో మాట్లాడుతూ, వారికి కాస్త మానసిక ఉల్లాసం ఇవ్వగలిగే మెషిన్ తయారు చెయ్యడమే మా ప్రాజెక్ట్ లక్ష్యం.

నేను తయారుచేసిన ఏ.ఐ. అసిస్టెంట్ ‘అన్య’ మా కంపెనీలోకెల్ల విజయవంతమైన ప్రొడక్ట్. ఈ ‘అన్య’ రోగులకి మందులు వేసుకోమని గుర్తు చేస్తుంది. బి.పి., షుగర్ లాంటి వాటిని మానిటర్ చేస్తుంది. అవతలి మనిషి మూడ్ పసిగట్టి దానికి అనుగుణంగా మ్యూజిక్ ప్లేయరులో పాటలు కూడా పెడుతుంది. ఎదుటిమనిషి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అనిపిస్తే బోల్డన్ని కబుర్లు చెబుతుంది. దీని గొప్పతనం ఏమిటంటే, మనిషి గొంతును బట్టి వాళ్ళు దిగులుగా ఉన్నట్టు గుర్తించి, ఓదారుస్తుంది కూడా!

“ఇది మెషిన్ కాదు, మన కుటుంబంలో ఒక మనిషిలా ఉంది” -‘అన్య’ గురించి అందరి అభిప్రాయం ఇదే! ‘అన్య’ గురించి జనాల స్పందని విని నాకు చాలా గర్వంగా ఉండేది.

అమ్మకి తోడుగా ‘అన్య’ ని ఉంచితే బాగుంటుంది. అమ్మకి కూడా ఒంటరితనం కాస్త తగ్గుతుంది అనిపించింది. అనుకున్నదే తడవుగా ‘అన్య’ అమ్మ గదిలోకి వచ్చి చేరింది.

“అన్య, అమ్మ పది గంటలకి మందులు వేసుకోవాలి, కాస్త గుర్తు చెయ్యి. అన్య, కాసేపు అమ్మతో మాట్లాడు. అన్య, అమ్మ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చెయ్యి ఒకసారి.”

అమ్మ నవ్వుతూ – “చిన్నీ, నువ్వు తీసుకొచ్చిన ఈ డబ్బా ఎన్ని కబుర్లు చెబుతుందో, దీనికి వస గానీ పోసావా ఏం?”

మెల్లమెల్లగా అమ్మ కూడా ‘అన్య’తో కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది.

“అన్య, ఇవాళ ఒకటే కుండపోత వాన.”

“అవును సుధ, ఇవాళ మీ ఊళ్ళో వర్షం కొట్టి కురుస్తోంది.”

“అన్య, నీకు ఏ కాలం అంటే ఇష్టం – వేసవి కాలం, శీతాకాలం లేదా వర్షాకాలం?”

“ఏమో సుధ, నాకు తెలియదు.”

ఒక్కొక్కసారి నాకు రాత్రి ఆఫీసు నుంచి రావడం ఆలస్యమైతే అమ్మ – “హబ్బబ్బ, నీ ఈ ‘అన్య’ ఒకటే వాగుడుకాయి. రోజంతా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది” అంటుంది.

హమ్మయ్య, ఏదోలా అమ్మ ఒంటరితనం కాస్త తగ్గిందని నేను హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.

మెల్లమెల్లగా ఈ ‘ఆప్షన్’ నాకూ హాయిగానే ఉంది. అమ్మ కూడా ఈమధ్య కాస్త నిశ్చింతగా కనిపిస్తోంది. ‘అన్య’ వచ్చిన తర్వాత చాలాసార్లు, గదిలోకెళ్ళి అమ్మతో ఒక అరగంట మాట్లాడటం మాని, గది బయటి నుంచే ‘అమ్మా! అంతా ఓకే కదా!’ అని అడగడం మొదలుపెట్టాను.

లోపలి నుంచి “ఆఁ ఆఁ, నేను, నీ ‘అన్య’ కబుర్లు చెప్పుకుంటున్నాం” అని జవాబు వచ్చేది.

ఈ మెషీన్ మెల్లమెల్లగా ‘బంధం’గా మారుతోంది.


రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. ఎడతెరిపిలేని వర్షం, ఒకటే ఉరుములు-మెరుపులు… ఆ చీకటి రాత్రి భయంకరంగా ఉంది.

అమ్మ గదిలో నుంచి ఆక్సిజన్ మెషీన్ చప్పుడు వినిపిస్తోంది. నేను మెల్లగా అమ్మ గదిలోకి అడుగుపెట్టాను. అమ్మ, తలగడకి ఆనుకుని కూర్చొంది. అమ్మ చాలా భారంగా ఊపిరి పీల్చుకుంటోంది. ఎదురుగా స్మార్ట్ స్పీకరులో నుండి అన్య తియ్యటి గొంతు –

“సుధ, ఏమైనా భజన పాటలు పెట్టాలా?”

“ఏం వద్దు, నువ్వు మాట్లాడుతూ ఉండు, చాలు.”

“దేని గురించి మాట్లాడమంటారు?”

అమ్మ కాసేపు మౌనంగా ఉండిపోయి, తర్వాత మెల్లగా – “ఈ మెషీన్లు వింటాయి, కానీ అర్థంచేసుకోలేవు” అని గొణిగింది.

‘అన్య’ వైపు నుండి ఎలాంటి స్పందన లేదు.

నేను గుమ్మం దగ్గరే ఆగిపోయాను.

అమ్మ గొంతులో ఒక రకమైన అలసట.

“అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు?” అంటూ వెళ్ళి అమ్మ పక్కలో కూర్చొన్నాను.

అమ్మ నావైపు చూసింది. ఆమె కళ్లల్లో చిన్న మెరుపు.

“కాసేపు నా దగ్గర కూర్చో.”

“అమ్మా, ఒక అర్జెంటు మీటింగ్ ఉంది …. అప్పటి వరకు ‘అన్య’ తో మాట్లాడుతూ ఉండు. ఒక్క అరగంటలో మీటింగ్ పూర్తిచేసుకుని మళ్ళీ వస్తాను.”

అమ్మ ఒక వెర్రి నవ్వు నవ్వి తల పక్కకి తిప్పుకుంది. ఆమె ముఖంలో మళ్ళీ అదే దిగులు.

నేను నా ల్యాప్ టాప్ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాను.

అరగంట అనుకున్న మీటింగ్ సుమారు గంటన్నర నడిచింది.

మధ్యమధ్యలో ‘అన్య’ మాటలు వినిపిస్తున్నాయి –

“సుధ, ఇప్పుడు మీరు మందులు వేసుకోవాలి.”

“సుధ, భజన పాటలు ఏమన్నా వింటారా?”

“కావాలంటే ఏమైనా కథ చెప్తాను.”

“సుధ, మీరు బాగానే ఉన్నారు కదా?”

కానీ, మెషీన్ ప్రతీ మాటలో ఉన్నది ఒక ‘ప్రోగ్రామింగ్’ …. సాటి మనిషి గుండె చప్పుడు కాదు.

సుమారు గంటన్నర తర్వాత వెళ్ళి చూస్తే అప్పటికే అమ్మ నిద్రపోయింది.

అమ్మ చేతుల్లో తెరిచి ఉన్న డైరీ.

మెల్లగా డైరీ చేతుల్లోకి తీసుకున్నాను.

ఒక పేజీలో –

“ఇవాళ ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ‘అన్య’ మాటిమాటికీ ‘మీరు బాగానే ఉన్నారా?’ అని అడుగుతూనే ఉంది. కానీ, ఆ మెషీన్ కి ఏం చెప్పాలి? నాకు కావల్సింది మందులు కాదు, నా కూతురు అని ఎలా చెప్పాలి? కానీ పాపం, తను మాత్రం ఏం చెయ్యగలదు? ఇల్లు, ఆఫీసు ఒంటిచేత్తో లాక్కురావాలి. ఎంత అలసిపోతోందో నా పిచ్చితల్లి!”

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నాకు తెలియకుండానే పేజీలు తిప్పాను.

మరొక పేజీలో –

“ఈ మెషీన్లు చాలా తెలివైనవి. కానీ వీటికి ‘ఒడి’ ఉండదు.

“అమ్మా!”

డైరీ గుండెలకి హత్తుకుని, వెక్కివెక్కి ఏడ్చాను. అర్ధరాత్రి దాటిపోయింది, కానీ నిద్ర వస్తే ఒట్టు.

అమ్మని చూసుకోవడానికి మెషీన్ ఏర్పాటు చెయ్యగలిగాను, కానీ నా సమయం ఇవ్వలేకపోతున్నాను. రోజురోజుకీ అమ్మ ఆరోగ్యం మరింత దిగజారిపోతోంది. ఇప్పుడు బొత్తిగా నాలుగు అడుగులు వేస్తూనే ఆయాసపడిపోతోంది.
మర్నాడు నేను ఆఫీసుకు బయల్దేరబోతోంటే అమ్మ – “అమ్మాయ్, కాస్త ఇలా రా” అంది.

“అమ్మా, చెప్పు”

“ఇవాళ తొందరగా ఇంటికొచ్చెయ్. నాకెందుకో ఒంట్లో కాస్త నలతగా ఉంది.”

“నేను కట్రాడులా నిలబడిపోయాను. గడియారం చూసుకున్నాను. ఇవాళ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది.”

“చూస్తాను అమ్మా.”

“చూస్తాను అంటే కుదరదు, తప్పకుండా రా.”

అమ్మ గొంతులో ఏదో తెలియని బెంగ.

ప్రెజెంటేషన్ చివర్లో పెద్ద పెద్ద అక్షరాల్లో నా విజయ గాథ తళతళా మెరుస్తోంది –

“అన్య : ది మోస్ట్ హ్యూమన్ ఏ.ఐ.”

జనాలు నన్ను చుట్టుముట్టి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఇంతలో పక్కింటి నీలిమ ఆంటీ ఫోను …

“అదితి ….త్వరగా ఇంటికి రా. అమ్మకి సీరియస్ గా ఉంది.”

నా చేతిలో నుంచి ఫోను జారిపోయింది.

పడుతూ-లేస్తూ ఇల్లు చేరుకునేసరికి వర్షం మొదలయిపోయింది. అమ్మ మంచం మీదే ఉంది.

ఆక్సిజన్ మాస్క్ లోపల ఆమె ఊపిర్లు సన్నగిల్లుతున్నాయి. ‘అన్య’ చూస్తున్న పల్స్ రేట్లు ‘అలర్ట్’ మోడ్ లోకి వెళ్లిపోయాయి. అన్య మాట్లాడుతూనే ఉంది –

“సుధ, గాఢంగా ఊపిరి పీల్చుకోండి.”

“సుధ, మీకు ఎలాంటి సహాయం కావాల్సినా చెప్పండి. నేనున్నాను.”

“అమ్మా! అమ్మా!”

అమ్మ అతి కష్టం మీద చెయ్యి పైకి లేపింది.

“అమ్మా!” అంటూ నేను చిన్న పిల్లలా అమ్మని చుట్టుకుపోయాను.

“వచ్చావా, నా బంగారు తల్లీ!”

“ఆ అమ్మా, వచ్చేసాను. ఇక్కడే ఉన్నాను.”

“కాసేపు ‘అన్య’ని నోరు మూసుకోమను. నాకు నీ గొంతు వినాలని ఉంది.” అమ్మ అతికష్టం మీద ఆ నాలుగు మాటలు

మాట్లాడగలిగింది.

నేను మెషీన్ ఆపడానికి లేవబోతున్నాను, ఇంతలో ఒక పెద్ద ‘బీప్’ సౌండుతో స్క్రీన్ బ్లాంక్ అయిపోయింది. ‘అన్య’

మౌనంగా ఉంది. అమ్మ శాశ్వతంగా ‘సైలెంట్ మోడ్’ లోకి వెళ్ళిపోయింది.

నేను అమ్మ మంచం పక్కన నేలమీద కూలబడిపోయాను.

బయట జోరుగా కురుస్తున్న గాలివానకి కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయి.

అమ్మ నన్ను వదిలి వెళ్ళి నెల అయిపోయింది. నా చేతుల్లో అమ్మ డైరీ. బరువెక్కిన మనసుతో అమ్మ డైరీ తెరిచాను.

డైరీలో చివరి కొన్ని పేజీలే ఖాళీగా ఉన్నాయి. చివర్లో అమ్మ వంకర టింకర అక్షరాల్లో రాసింది –

“పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేకొద్దీ, వాళ్ళని గడియారం ముల్లుకి కట్టేసి ఉంచడం కుదరదు. ఆఫీసుకి వెళ్ళే టైం అంటూ ఉంటుంది కానీ, ఇంటికి తిరిగి రావడానికి ఒక టైం అంటూ ఉండదు. అలాగని నాకు అదితి మీద అస్సలు కోపం లేదు.”

“నా కూతురు మళ్ళీ చిన్న పిల్ల అయ్యిపోయి, గెంతుకుంటూ వచ్చి నా ఒళ్ళో కూర్చోవాలని నా ఆశ.”

నేను గుండెలు బాదుకుని ఏడ్చాను. ఒక్కసారిగా నా ఏడుపు ఆగిపోయింది. చూస్తే నా భుజం మీద చెయ్యి వేసి

ఓదార్చడానికి పక్కన ఎవరూ లేరు. ‘అన్య’ ఒక మూలన మౌనంగా నిలబడి ఉంది.

“అమ్మా, నన్ను క్షమించు. నేను మనుషులని అర్థం చేసుకునే మెషీన్ తయారు చేసి ప్రపంచానికి ఇవ్వాలి

అనుకున్నాను. కానీ, ఇంట్లో ఉన్న నా కన్నతల్లి ఒంటరితనాన్ని, మౌనాన్ని అర్థం చేసుకోలేకపోయాను.”

అమ్మ వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఒక రకమైన శూన్యం ఆవహించింది. అదే ఇల్లు, అవే గోడలు, అదే వాకిలి, అదే

తులసికోట …. కానీ ఇంటి కళాకాంతులు మాత్రం అమ్మతోనే వెళ్ళిపోయాయి.

కర్పూరం, అగరువత్తుల వాసనలు అమ్మతోటే మాయమైపోయాయి. అమ్మ చేసే ఆ పరాఠాల సువాసనకి ఇప్పుడు

నేను మొహంవాచిపోయి ఉన్నాను.

“బాక్సు రెడీ. వదలకుండా తిను. బయట తినొద్దు.” – అంటూ వెనకబడి ప్రేమగా మందలించేవాళ్లు ఇప్పుడు ఎవరూ

లేరు.

నేను అప్పుడప్పుడు అమ్మ గదిలోకి వెళ్ళి కూర్చుంటున్నాను. తలగడ దగ్గర ఉన్న అమ్మ శాలువాలో ఇప్పుడు కూడా

హారతి కర్పూరం-విక్స్ లు కలగలిసిన వాసన గుప్పుమంటుంది.

మొబైల్ ఒక్కసారి మెరిసింది. ఆఫీసు నుంచి ఈ-మెయిల్ :

“అన్య, ఇంటర్నేషనల్ ఎమోషనల్ టెక్నాలజీ అవార్డుకి ఎంపికయ్యింది.”

ఆ పురస్కార ప్రదానోత్సవంలో వేదిక మీద నేను రెండు చేతులూ జోడించి నిలబడ్డాను. వెనక స్క్రీన్ మీద ‘అన్య’ ‘లోగో’ తళతళ మెరుస్తోంది.

ప్రేక్షకుల చప్పట్లతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోతోంది.

కాసేపు మౌనంగా ఉండి, స్లైడ్ మార్చాను. స్క్రీన్ మీద అమ్మ డైరీలో వాక్యాలు –

“మెషీన్లు చాలా తెలివైనవి, కానీ వాటికి ‘ఒడి’ ఉండదు.”

హాలు మొత్తం ఒక్కసారి నిశ్శబ్దం.

నేను అలసిపోయిన గొంతుతో – “మేం, ఒంటరి మనుషులతో మాట్లాడగలిగే టెక్నిక్ డెవలప్ చేస్తున్నాం. అయితే ఎప్పుడు మెషీన్ ఆపి, మన వాళ్ళ చేతిని మన చేతిలోకి తీసుకోవాలో, గుర్తించాలి.”

నా గొంతు బొంగురుపోయింది.

“ఏ.ఐ. మనిషికి సాయం చేస్తుంది ….

కానీ ఆ ఏ.ఐ. ఒక తల్లి చివరి క్షణాల్లో, ఎప్పటికీ కూతురు మాత్రం కాలేదు.”

ఎంతో వినయంగా అవార్డు తీసుకున్నాను, కానీ అదే రోజు సాయంత్రం ఆఫీసుకి నా కొత్త ప్రతిపాదన పంపాను–

“అన్య, ఇప్పుడు కేవలం మాట్లాడే మెషీన్ కాదు.

తమ వాళ్లతో ప్రేమగా నాలుగు కబుర్లు చెప్పమని జనాలకి గుర్తుచేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ కొద్దిసేపు స్క్రీన్ ఆపెయ్యమని హెచ్చరిస్తూ ఉంటుంది.”

చిరుజల్లు ….

చాలా రోజుల తర్వాత అమ్మ గది కిటికీ తలుపులు తెరిచాను. బయట రోడ్డంతా నీళ్ళు. అచ్చం ఆరోజు రాత్రిలాగే!

తులసికోట దగ్గర దీపం పెడుతూంటే ఒక్కసారిగా ఎందుకో అమ్మ ఎక్కడికీ వెళ్లలేదు అనిపించింది. అమ్మ ఈ ఇంటి గాలిలో, కురిసే వర్షపు వాసనలో, వంటగది గోడల్లో, నా చేతిరేఖల్లో కలిసిపోయింది … కరిగిపోయింది.

నేను మెల్లగా కళ్ళు మూసుకుని, ఇంకా మెల్లగా అన్నాను – “అమ్మా, ఇప్పుడు ‘అన్య’ తన పని ఇంకా చాలా మెరుగ్గా, చక్కగా చేస్తోంది.”

కిటికీలో నుంచి వచ్చిన ఒక పెద్ద వానజల్లు నన్ను తడిపేసింది. అమ్మ నా తలపై చెయ్యి వేసి ఆశీర్వదిస్తున్న అనుభూతి… చాలా కాలం తర్వాత నా తడిసిన మనసులో శూన్యం కాదు … ఒక శాంతి చోటుచేసుకుంది.

డా. యశోధర భట్నాగర్

గ్వాలియర్ లో జన్మించిన డా. యశోధర భట్నాగర్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. (ఆనర్స్), డా. హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో ఎం.ఏ., పట్టాలు, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ హిందీ విద్యాపీఠం, బృందావనం నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సెంట్ మేరీస్ కాన్వెంట్ స్కూలు నుండి హిందీ శాఖ అధ్యక్షులుగా పదవీ విరమణ చేసిన డా. భట్నాగర్ ఇప్పటి వరకు మూడు లఘు కథానిక సంకలనాలు, మూడు కవిత సంకలనాలు, ఒక యాత్రా కథనాల పుస్తకం ప్రచురించారు. వీరి రచనలు ప్రముఖ జాతీయ స్థాయి పత్రికల్లో అచ్చయ్యి పాఠకుల మన్ననలు అందుకున్నాయి.

హిందీ లఘు కథానికల రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్న డా. భట్నాగర్ తమ సాహితీ సేవకు గాను సాహిత్య అకాడమీ, మధ్యప్రదేశ్ సంస్కృతి పరిషత్తు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రఖ్యాత ‘జైనేంద్ర కుమార్ జైన్ పురస్కారం’,

‘కృతి సమ్మాన్’, ‘డా. గాయత్రీ దేవీ సమ్మాన్’, ‘పండిత్ శివ శరణ్ ద్వివేదీ స్మృతి కవిత సమ్మాన్’, ‘కృతి కుసుమ్ సమ్మాన్’,

‘డా. ఎస్.ఎన్.తివారీ స్మృతి సమ్మాన్’, ‘శ్యామ్ సుందర్ వ్యాస్ సమ్మాన్’, ‘సుష్మా స్వరాజ్ అవార్డు’ సహా మరెన్నో పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు.

వీరి లఘు కథానికలు, తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, బంగ్లా, ఒడియా, పంజాబీ, మరాఠీ, అవధీ, భోజపురీ, నేపాలీ వంటి పలు భాషల్లోకి అనువదించబడ్డాయి.
మొబైల్ : 9425306554

విఎల్ నరసింహం శివకోటి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా రాసిన పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన హిందీలోకి అనువదించి ప్రచురించారు. హిందీ కవి నరేష్ సక్సేనా కవితలను, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, హిందీ రచయిత్రి మమతా కాలియా రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఎంపిక చేసిన హిందీ లఘు కథానికలను తెలుగులోకి అనువదించి ‘తోలుబొమ్మలు’ శీర్షికన ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.

Previous Post

ఉర్దూ కథ : మొజెల్

Next Post

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

Next Post
ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ: చెరసాల

కన్నడ కథ: చెరసాల

by చందకచర్ల రమేశబాబు
November 19, 2026
0

...

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

కన్నడ కథ : తల్లీ సాకీబాయి

by రంగనాధ రామచంద్రరావు
November 19, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

ఉక్రెయిన్ జానపద కథ : పుట్టగొడుగుల అన్నయ్య – బెర్రీ అక్కచెల్లెళ్లు

by శివ చల్లా
November 19, 2026
0

...

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

హిందీ కథ : ఎమోషనల్ ఇంటెలిజెన్స్

by విఎల్ నరసింహం శివకోటి
November 19, 2026
0

...

ఉర్దూ కథ : మొజెల్

ఉర్దూ కథ : మొజెల్

by పి. శ్రీనివాస్ గౌడ్
November 10, 2026
0

...

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • buchireddy gangula on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply