• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

కేశవ్ గోపాల్ by కేశవ్ గోపాల్
September 10, 2026
in అనువాద కథలు
0
రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ మూలం: అంతోన్ చేహొవ్
తెలుగు అనువాదం : కేశవ్ గోపాల్

ఒక అజ్ఞాత లేఖ ద్వారా పిలుపు అందడంతో ప్యోత్ర్ పాల్లొవిచ్ పోసుదిన్ తన గుర్తింపును పూర్తిగా దాచి, అద్దెకు తీసుకున్న మూడు గుర్రాల బండిలో ‘‘ఎన్’’ అనే చిన్న పట్టణానికి కచ్చారోడ్డు మీద వేగంగా ప్రయాణం చేస్తున్నాడు.

‘‘వాళ్లు అజాగ్రత్తగా వున్నప్పుడే పట్టుకోవాలి… ఆకాశం నుండి పిడుగుపడినట్లు..’’ అతడు తన కాలర్‌తో ముఖం దాచుకుంటూ మనసులో అనుకున్నాడు. ‘‘వాళ్లు- ఆ దుర్మార్గులు తమ తప్పుడు పనులు ముగించి సంబరాలు చేసుకుంటూ వుంటారు. ఆ అక్రమాల ఆనవాళ్లు చెరిపేశామని ఆనందిస్తూ వుంటారు.. హ్హహ్హ..! వాళ్ల సంబరాలు పతాకస్థాయిలో వున్నప్పుడు ‘‘త్యాప్కిన్- ల్యాప్కిన్’’ను పట్టుకురండి!’’ అని వాళ్లకు వినిపిస్తుంది. అప్పుడక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది! హ్హహ్హ!’’

ఇలా కలల్లో మునిగి తేలిన పోసుదిన్ బండి తోలేవాడితో సంభాషణ మొదలెట్టాడు.

‘‘నీకు పోసుదిన్ తెలుసా?’’

‘‘తెలియకేం… తెలుసు!’’ అంటూ బండివాడు చిరునవ్వుతో జవాబు చెప్పాడు.

‘‘మాకు అతడు తెలుసు!’’

‘‘ఎందుకు నవ్వుతున్నావ్?’’

‘‘మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది! నాకు అందరూ, చివరికి గుమాస్తా వరకూ అందరూ తెలుసు. అలాంటప్పుడు పోసుదిన్ తెలీకుండా ఎలా వుంటాడు? అందుకే అతణ్ని ఇక్కడ పెట్టారు- అందరికీ అతడు తెలియాలని’’

‘‘అలాగా.. మరి? అతణ్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? మంచోడేనా?!’’

‘‘పాస్ అవుతాడు.. మంచోడే!’’ ఆవులిస్తూ చెప్పాడు బండివాడు. ‘‘అతడికి తన పనేమిటో తెలుసు. అతణ్ణి ఇక్కడికి పంపి రెండేళ్లు కూడా కాలేదు. ఇప్పటికే చాలా పనులు పూర్తిచేశాడు.’’

‘‘ప్రత్యేకంగా అతడు ఏం పనులు చేశాడు?’’

‘‘అతడు చాలా మంచి పనులు చేశాడు. దేవుడు నాలుగు కాలాల పాటు అతణ్ని చల్లగా చూడాలి!- మాకు రైలుమార్గం తెప్పించాడు. ఖొహ్ర్యూకొవ్‌ను ఉద్యోగంలోంచి తొలగించాడు… ఖొహ్ర్యూకొవ్ చేయని మోసమంటూ లేదు… అతడొక దుర్మార్గుడు. అందరూ అతనితో స్నేహంగా వుండేవాళ్లు. కానీ పోసుదిన్ రాకతో అతడి ఆటకట్టింది- అసలతడు వున్నాడా లేడా అనిపించేంతగా! వెయ్యి రూబుళ్లిచ్చినా సరే పోసుదిన్ ఎవర్నీ గండం నుంచీ గట్టెక్కించడు.. అతణ్ని మాత్రం కొనలేరు!’’

‘‘దేవుడి దయ వల్ల కనీసం ఈ ప్రాంతంలోనైనా నన్ను సరిగా అర్థం చేసుకున్నారు!’’ అని పోసుదిన్ విజయగర్వంతో మనసులో అనుకున్నాడు.

‘‘చదువుకున్న పెద్దమనిషి’’ బండివాడు కొనసాగించాడు. ‘‘కానీ, గర్వం లేదు. మా వాళ్లు ఒక ఫిర్యాదు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్లారు. వాళ్లను ఆయన ఎంతో గౌరవంగా చూశాడు. అందరితో కరచాలనం చేశాడు. ‘‘కూచోండి’’ అన్నాడు- అగ్గిపిడుగు… ఏ విషయం నాన్చడు… టకటకమని తెగిపోవాలి. అంతే! అతడు నేలమీద నడవడు… అస్సలు నడవడు! అంతా రెండింతలు వేగంగా చేస్తాడు. రెండింతలు..! మా వాళ్ల నోట్లో మాట నోట్లో వుండగానే ‘‘గుర్రాలు!’’ అని అరిచి నేరుగా ఇక్కడికి వచ్చేశాడు.. వచ్చి అన్నిట్నీ గట్టిగా కుదిపేశాడు.. ఒక్క కోపెక్కు కూడా ముట్టుకోలేదు. అంతకుముందున్నాయన కంటే చాలా మంచోడు! ముందున్నాయన కూడా మంచోడే- హుందాగా, ముఖ్యమైన వ్యక్తిలాగా. జిల్లా మొత్తం మీద అతడికంటే పెద్ద గొంతు ఎవరికీ లేదనిపించేది. బండి నడుపుతుంటే పదిమైళ్లదాకా అతడి అరుపులు వినిపించేవి. కానీ బయటి విషయాలకొస్తే, లేదా సొంత విషయాలకొస్తే ఇతడు- అంటే పోసుదిన్ చాలా తెలివైనవాడు! వందరెట్లు ఎక్కువ తెలివైన వాడు… కానీ ఒక్కటే విచారకరమైన విషయం- ఇతడొక తాగుబోతు!’’

‘‘అయ్యో!’’ అనుకున్నాడు పోసుదిన్ మనసులో.

‘‘అవును మహాప్రభో! అతడు తాగడం నేను కళ్లారా ఎప్పుడూ చూళ్లేదు. కాబట్టి నేను అబద్ధాలు చెప్పను. కానీ, అతని గురించి పుకారు మాత్రం వినిపిస్తోంది. జనాలు అలా అనుకుంటున్నారు. వాళ్లు కూడా అతను తాగుతుండగా చూళ్లేదు. అయితే అతని గురించి పుకారు మాత్రం చెవిన పడుతోంది… బహిరంగ ప్రదేశాల్లో, లేదా ఏదైనా నాట్య ప్రదర్శనకు వెళ్లినా, ఎవర్నైనా కలిసినా అతనెప్పుడూ తాగడు. ఇంట్లోనే గటగటా తాగేస్తాడు. ఉదయాన్నే నిద్ర  లేవగానే కళ్లు నులుముకుని మొట్టమొదట వోద్కా కావాలని అడుగుతాడు! అతని సేవకుడు ఒక గ్లాసు నిండా తెస్తాడు. అక్కడికక్కడే తాగేసి ఇంకొక గ్లాసు అడుగుతాడు… రోజంతా అలాగే గటగటా తాగేస్తాడు. ఒకసారి వూహించుకోండి- అతను తాగుతాడు కానీ కనురెప్పకూడా వాల్చడు! తాగినప్పుడు అదుపులో ఎలా వుండాలో అతనికి బాగా తెలిసినట్లుంది. మన ఖొహ్ర్యూకొవ్ తాగడం మొదలుపెడ్తే మనుషుల సంగతి అటుంచి, కుక్కలు కూడా ఎలుగెత్తి మొరుగుతాయి. కానీ, పోసుదిన్ విషయానికొస్తే, అతని ముక్కు కూడా ఎర్రబడదు! స్టడీరూంలో తనను తాను బంధించుకుని తాగుతాడు… కాబట్టి ప్రజలకు తెలియకూడదని అతడు తన బల్ల సొరుగులో ఒక గొట్టం ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో ఎప్పుడూ వోద్కా వుంటుంది. ఆ గొట్టం వైపు వొంగి పీల్చి మత్తులో మునిగిపోతాడు. బండిలో అతని బ్రీఫ్ కేస్‌లో కూడా వుంటుంది…’’

‘‘వీళ్లకు ఈ సంగతి కూడా ఎలా తెలిసింది?’’ అని పోసుదిన్ భయంతో తనలో తనే అనుకున్నాడు. ‘‘అయ్యో దేవుడా! ఇదికూడా తెలిసిపోయిందా! ఎంత నీచం!’’

‘‘ఇక ఆడవాళ్ల విషయానికొస్తే.. అతడొక లంపటుడు! (బండివాడు నవ్వి తల వూపాడు) ఇది అవమానకరం- బొత్తిగా అంతే! అతని దగ్గర అలాంటివాళ్లు- ఏమంటారో గానీ- పదిమంది లం..లు వున్నారు. వాళ్లలో ఇద్దరు అతని ఇంట్లోనే వుంటున్నారు. వాళ్లలో ఒకతె నస్తాసియా ఇవానొవ్న. అతడి ఇంట్లో పనిమనిషిగా వుంటోంది. ఇంకొకతె- పేరేందబ్బా.. ఛత్? ల్యుద్మీల సిమ్యోనవ్న- ఒకరకమైన గుమాస్తా. అయితే నస్తాసియేదే పై చేయి. ఆమె కోరిందల్లా అతడు చేస్తాడు. ఒక ఆడనక్క తోక వూపినట్లు ఆమె అతణ్ని ఆడిస్తుంది. ఆమెకు చాలా అధికారాలున్నాయి. ఆమెకు భయపడినంతగా అతనికి ఎవరూ భయపడరు. హ్హ హ్హ! ఇక, మూడో లం.. కచాల్నయా వీధిలో వుంటుంది… చెప్పుకుంటూ పోతే అసహ్యం!

‘‘ఇదంతా నీకు ఎలా తెలిసింది?’’ పోసుదిన్ అడిగాడు.

‘‘జనాలు మాట్లాడుకుంటున్నారు. నేను కళ్లారా చూళ్లేదు గానీ, వాళ్లూ వీళ్లూ మాట్లాకుంటూంటే విన్నాను.

‘‘వీడికి వాళ్ల పేర్లు కూడా తెలుసు.’’ సిగ్గుపడుతూ మనసులో అనుకున్నాడు పోసుదిన్. 

‘‘మరి వీడెవడు? పల్లెటూరి బైతు. బండి నడుపుకునే వాడు. పట్నం ముఖం ఎప్పుడూ చూడని వాడు! ఎంత నీచం… ఎంత రోత… ఎంత అసహ్యం!’’

‘‘ఇదంతా నీకెలా తెలిసింది?’’- అడిగాడు పోసుదిన్ చీకాకు పడుతూ.

‘‘జనాలు మాట్లాడుకుంటున్నారు. నేను కళ్లారా చూళ్లేదు.. కానీ వాళ్లూ వీళ్లూ మాట్లాడుకుంటూంటే విన్నాను. అయినా తెలుసుకోవడం అంత కష్టమా? పనివాళ్ల నాలుకలను, బండి వాళ్ల నాలుకలను కోసేయలేరు కదా.. ఏదేమైనా నస్తాసియా తన అదృష్టాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ వీధుల వెంట షికార్లు చేస్తుంది కదా! ఏం చేసినా ఎవరూ జనాల కళ్లు కప్పలేరు. పోసుదిన్ ఈ మధ్య దర్యాప్తులు చేయడానికి గుట్టుగా బండిమీద వెళ్లడం మొదలెట్టాడట. ఇంతకు ముందున్నాయన ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక నెలరోజులు ముందుగా ఆ సంగతి తెలియజేసేవాడు. ఇక, ఆయన బయల్దేరిరనప్పుడు ఎంత ధూంధాం, ఎంత హడావుడి, ఎంత రచ్చ జరిగేదంటే… దేవుడు మనల్ని కాపాడాలి!… ఆయనకు ముందూ వెనుకా, ఇరువైపులా గుర్రపు స్వారీ చేసే రౌతులు దూసుకొచ్చేవాళ్లు. ఆయన వెళ్లాల్సిన చోటుకు వెళ్లేవారు. మంచి నిద్దర తీసేవాడు. సుష్టుగా తినడం తాగడం ముగించి అప్పుడు తన పనికి సంబంధించి తలలు దిమ్మెక్కేటట్లు రంకెలు వేసేవాడు. కాళ్లు నేలకేసి తాటించేవాడు. మళ్లీ నిద్రపోయి లేచి, ఎలా వచ్చాడో అలాగే తిరుగుముఖం పట్టేవాడు. కానీ, ఇప్పుడు పోసుదిన్ ఏదైనా విషయం పసిగట్టగానే చడీచప్పుడూ లేకుండా ఎవరూ చూడకుండా, పిట్టకు కూడా తెలీకుండా ఇంట్లోంచి బయటకొస్తాడు. రైలెక్కుతాడు. తను వెళ్లాల్సిన స్టేషన్‌కు గుర్రం మీద వెళ్తాడు. అద్దె గుర్రాల మీద, అంతకన్నా మెరుగైన వాహనాల మీద గాకుండా, ఒక రైతును కూలికి పెట్టుకుంటాడు. తనూ ఒక రైతులా ముఖం, ఒళ్లూ పూర్తిగా కప్పుకుని దారి పొడుగునా గొంతు గుర్తుపట్టలేని విధంగా ముసలికుక్కలా ఆయాసపడుతూ వెళ్తాడు. ఈ విషయం గురించి జనాలు చెప్తుంటే పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వకుండా  వుండలేరు ఎవరూ. అలా గుర్రం మీద వెళ్తుంటే – మూర్ఖుడు తనను ఎవరూ గుర్తుపట్టలేదని అనుకుంటాడు. కానీ రవ్వంత బుర్ర వున్నవాడెవడైనా అతణ్ని సులభంగా గుర్తుపట్టొచ్చు!’’

‘‘కానీ అతణ్ని ఎలా గుర్తుపడ్తారు?’’

‘‘చాలా సులభం. ఇంతకుముందు మన ఖొహ్ర్యూకొవ్ గుట్టు చప్పుడు కాకుండా ప్రయాణించేటప్పుడు అతని దురుసుతనం వల్ల అందరికీ తెలిసిపోయేది. ప్రయాణీకుడు బండివాడి చెంపపై ఒక్కటి కొడితే, అది ఖొహ్ర్యూకొవ్ అని అర్థం. అలాగే మీరు పోసుదిన్ ను కూడా వెంటనే గుర్తుపట్టొచ్చు.. మామూలు ప్రయాణీకుడు మామూలుగానే నడుచుకుంటాడు. కానీ, పోసుదిన్ విషయాలను మామూలుగా వుంచే రకం కాదు. అతడు అనుకున్న స్టేషన్ కు చేరగానే ఫిర్యాదు చేయడం మొదలెడతాడు. అక్కడ దుర్వాసనగా వుందనీ, ఉక్కగా, చల్లగా వుందనీ అంటాడు.. అతనికి కోడిమాంసం, పండ్లు, ఇంకా రకరకాల జామ్‌లు వడ్డించాలట… స్టేషన్‌లో అందరికీ తెలుసు- శీతాకాలంలో ఎవరైనా కోడిమాంసం, పండ్లు కావాలని అడిగితే అది పోసుదినే అని. ఎవరైనా స్టేషన్ మాస్టర్ ను ‘‘ఓహో మంచి మనిషి!’’ అని పలకరించి జనాలకు రకరకాల పనులు పురమాయించి పంపితే అది పోసుదిన్ పనే అని కచ్చితంగా చెప్పొచ్చు. అంతేకాదు.. ఇతరుల మాదిరి ఒంటివాసన అతని దగ్గర రాదు.. అతడు తనదైన ప్రత్యేక పద్ధతిలో నిద్రపోతాడు.. స్టేషన్‌లో ఒక సోఫాలో పడుకుని తన చుట్టూ సెంటు చల్లుకుంటాడు. తన దిండు పక్కన మూడు కొవ్వొత్తులు పెట్టుకుంటాడు. అక్కడ పడుకుని వార్తాపత్రికలు చదువుతూ వుంటాడు. ఒక స్టేషన్ మాస్టరేనా? అతడెలాంటివాడో ఒక పిల్లి కూడా కనిపెట్టగలదు..’’

‘‘నిజమే నిజమే!’’ అనుకున్నాడు పోసుదిన్ మనసులో. ‘‘ఈ సంగతి నాకెందుకు ఇంతకుముందు తెలీలేదు!’’

‘‘ఇంకా- ఎవరైనా కావాలనుకుంటే పండ్లూ, కోడిమాంసం వూసు లేకుండానే అతణ్ని గుర్తుపట్టొచ్చు. అంతా టెలిగ్రాఫ్ ద్వారా తెలిసిపోతుంది. తన ముచ్చు ముఖాన్ని ఎంతగా కప్పుకున్నా, దారిలో వస్తున్నది అతడేనని తెలిసిపోతుంది. అతడు వస్తున్నాడని ఎదురుచూస్తారు. పోసుదిన్ ఇంట్లోంచి అడుగు బయటపెట్టకముందే ఏర్పాట్లన్నీ జరిగిపోతాయి. దేవుడా! అతడొచ్చి అజాగ్రత్త వున్నప్పుడు పట్టుకుని, విచారణ నిమిత్తం పంపిస్తాడు. లేదా ఎవర్నైనా వుద్యోగంలోంచి తీసేసి వేరే మనిషిని పెడతాడు. కానీ జనం అతణ్ని చూసి లోలోపల నవ్వుకుంటారు.’’ ప్రభూ! మీరు ఎవ్వరికీ తెలీకుండా వచ్చినా, చూడండి- ఇక్కడంతా సవ్యంగానే వుంది!’’ అనుకుంటారు. అతడు ఇటూ అటూ పచార్లు చేస్తాడు. ఆ తర్వాత ఒట్టి చేతుల్తో తిరిగి వెళ్లిపోతాడు… అంతేకాదు- అతడు పొగడ్తలు కుమ్మరిస్తాడు. కరచాలనాలు చేస్తాడు. అంత ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ కోరుతాడు. అంతా ఇలా జరుగుతుంది! మీరేమనుకున్నారు మహాప్రభూ! హ్హహ్హ.. ఇక్కడున్నది జిత్తులమారి మనుషులు. మహా తెలివైన వాళ్లు! వాళ్లెంత దుర్మార్గులో తెలుసుకోవడం సంతోషంగా వుంది! మాట వరుసకు… ఈ రోజు పొద్దున నేను సవారీ ఎవరూ లేకుండా బండి తోలుకుంటూ వెళ్తుండగా యూదు బప్ఫే సహాయకుడు స్టేషన్ నుంచీ నా వైపు దూసుకొచ్చాడు. ‘‘యూదు ప్రభువా! తమరు ఎక్కడికి వెళ్తున్నారు?’’ అని అడిగాను. ‘నేను ‘ఎన్’ స్టేషన్‌కు ద్రాక్షసారా, చిరుతిండి తీసుకెళ్తున్నాను. అక్కడ పోసుదిన్ వస్తాడని ఎదురుచూస్తున్నారు’ అన్నాడు. ఏం తెలివి? బహుశ బయల్దేరడానికి అప్పటికింకా ఇంటిదగ్గర పోసుదిన్ తయారౌతూ వుండొచ్చు. లేదా ఎవరూ తనను గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగు వేసుకుంటూ వుండొచ్చు. బహుశా అప్పటికే దారిలో వుండి తన రాక ఎవరికీ తెలీదని అనుకుంటూ వుండొచ్చు. కానీ అందరరూ అతనికోసం ద్రాక్షసారా, సాల్మన్ చేప, జున్ను వగైరా సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు.. అవునా? పోసుదిన్ గుర్రబ్బండి మీద వస్తూ ‘మీ పనైపోయిందిరా నాయనలారా’ అనుకుంటూ వుండొచ్చు. కానీ కుర్రాళ్లు మాత్రం అంతగా ఖాతరు చేయడం లేదు! వస్తే రానివ్వండి! సర్వం ఎప్పుడో దాచిపెట్టేశారు!’’

‘‘వెనక్కు!’’ అని అరిచాడు పోసుదిన్ బొంగురు గొంతుకతో. ‘‘బండి వెనక్కు తిప్పు, దరిద్రుడా!’’

ఆశ్చర్యపోయిన బండివాడు మళ్లీ వెనక్కు మళ్లించాడు బండిని.

* 1885లో ప్రచురితం

వివరణలు :

త్యాప్కిన్- ల్యాప్కిన్ : నికలాయ్ గోగొల్ రచించిన ‘‘ప్రభుత్వ ఇన్‌స్పెక్టర్’’ అనే హాస్యనాటకంలో ఒక ప్రధాన పాత్ర. ల్యాప్కిన్- త్యాప్కిన్- జడ్జి. ఈ పేరును రచయిత అంతోన్ చేహొవ్ తిరగేసి వాడుకున్నాడు.

కథలోని వ్యక్తుల పేర్లు :

  1. ప్యోత్ర్ పావ్లొవిచ్ పోసుదిన్
  2. ఖొహ్ర్యూకొవ్
  3. నస్తాసియా ఇవానొవ్న
  4. ల్యుద్మీల సిమ్యోనవ్న
కేశవ్ గోపాల్

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.

అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం

Previous Post

కన్నడ కథ : చావు

Next Post

హిందీ కథ : ఓడిపోయాను 

Next Post
హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో అనువాద కథలు..

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 

by రంగనాధ రామచంద్రరావు
September 10, 2026
0

...

ఒరియా కథ : పులి 

ఒరియా కథ : పులి 

by స్వాతి శ్రీపాద
September 10, 2026
0

...

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

by వాడ్రేవు చినవీరభద్రుడు
September 14, 2026
0

...

కాశ్మీరీ కథ: అపరిచితుడు

కాశ్మీరీ కథ: అపరిచితుడు

by చింతపట్ల సుదర్శన్
September 10, 2026
0

...

హిందీ కథ : పింఛను

హిందీ కథ : పింఛను

by దండిభొట్ల నాగేశ్వరరావు
September 14, 2026
0

...

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 

by రమేశ్ రాచపూటి
September 14, 2026
0

...

హిందీ కథ : కొత్త గాలి

హిందీ కథ : కొత్త గాలి

by విఎల్ నరసింహం శివకోటి
September 10, 2026
0

...

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1

by పి. శ్రీనివాస్ గౌడ్
September 10, 2026
0

...

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!

by తిరువాయపాటి రాజగోపాల్
September 10, 2026
0

...

మళయాళ చిన్న కథలు

మళయాళ చిన్న కథలు

by ఎడిటర్
September 10, 2026
0

...

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 

by డా. ఎ.యం. అయోధ్యారెడ్డి
September 10, 2026
0

...

హిందీ కథ : ఓడిపోయాను 

హిందీ కథ : ఓడిపోయాను 

by వెన్నా వల్లభరావు
September 10, 2026
0

...

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది

by కేశవ్ గోపాల్
September 10, 2026
0

...

కన్నడ కథ : చావు

కన్నడ కథ : చావు

by చందకచర్ల రమేశబాబు
September 10, 2026
0

...

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్

by శివ చల్లా
September 10, 2026
0

...

ఈ సంచికలో అనువాద కవితలు..

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
అనువాద కవితలు

మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి

September 11, 2026
జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
అనువాద కవితలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

September 10, 2026
తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట
అనువాద కవితలు

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

September 10, 2026
ఓ హెన్రీ కవితలు రెండు..
అనువాద కవితలు

ఓ హెన్రీ కవితలు రెండు..

September 10, 2026
హిందీ కవిత: చావు
అనువాద కవితలు

హిందీ కవిత: చావు

September 14, 2026
నా కలల ప్రపంచం
అనువాద కవితలు

నా కలల ప్రపంచం

September 10, 2026
యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు
అనువాద కవితలు

యుద్ధవీరులు-మరి కొన్ని కవితలు

September 10, 2026
పుష్పవృక్షం
అనువాద కవితలు

పుష్పవృక్షం

September 10, 2026
హిరోషిమా బిడ్డ 
అనువాద కవితలు

హిరోషిమా బిడ్డ 

September 10, 2026
హిందీ కవిత: అడవిలో వర్షం
అనువాద కవితలు

హిందీ కవిత: అడవిలో వర్షం

September 10, 2026
హిందీ కవితలు: గోధుమ + గోవు
అనువాద కవితలు

హిందీ కవితలు: గోధుమ + గోవు

September 10, 2026
సచ్చిదానందన్ కవితలు రెండు..
అనువాద కవితలు

సచ్చిదానందన్ కవితలు రెండు..

August 15, 2026
హిందీ కవిత: నా చిరునామా
అనువాద కవితలు

హిందీ కవిత: నా చిరునామా

August 15, 2026

అభిప్రాయాలు

  • GOPALAKRISHNA MURTHY VADDADI on పుష్పవృక్షం
  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply