• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కథ : ఉత్తమ నటుడు

రంగనాధ రామచంద్రరావు by రంగనాధ రామచంద్రరావు
March 10, 2026
in అనువాద కథలు
0
కన్నడ కథ : ఉత్తమ నటుడు

కన్నడ ములం: శ్రీధర బనవాసి
అనువాదం : రంగనాథ రామచంద్రరావు

ఆ సంవత్సరపు గొప్ప నటుడు, జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ నటుడి అవార్డును ప్రజాభిమాన నటుడు విశ్వజిత్‌కు లభించిన వార్త అన్నీ వార్తాపత్రికలు, టీవీ మాధ్యమాల్లో ప్రసారమవుతోంది. వార్తలవుతున్నాయి. విశ్వజిత్‌కు నలుమూలల నుంచీ అభినందనల జల్లులు… ఇంటి ముందు అభిమానుల జయకారాల హర్షధ్వానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంభ్రమాల మధ్య బెస్ట్ యాక్టర్ విశ్వజిత్‌ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక టీవీ ఛానెల్ ఎడిటర్ నేరుగా అతని ఇంటికి వచ్చాడు. ఆ సంపాదకుడు, నటుడి ఒకప్పటి పాత స్నేహితుడు. తన జీవితంలోని ఎత్తుపల్లాలన్నీ కళ్ళముందే చూశాడు. అతన్ని వ్యక్తిగతంగా తెలిసినవాడు… ఇలస ఉన్నప్పటికీ గొప్ప నటుడి ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పని అతని జీవిత విషయాలను తమ ఛానెల్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు. తన పాత్రికేయ జీవితంలో ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆ సంపాదకుడు, విశ్వజిత్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చిన సందర్భంగా తన ఛానెల్ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. వారిద్దరి ఇంటర్వ్యూ రికార్డ్ చేయడానికి మూడునాలుగు కెమెరాలు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, మరికొందరు సాంకేతిక నిపుణులు కూడా ఆ రోజు వచ్చారు.

ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ఆ సంపాదకుడు నటుడి గత జీవితాన్ని, సినిమా రంగానికి రాకముందు హోటల్లో పని చేస్తూవుండటం, సినిమా నటుడిగా నిలద్రొక్కుకోవడానికి కష్టపడుతుండటం, అనుభవించిన కష్టాలన్నీ చూసివుండటం వల్ల వాటి గురించి ప్రశ్నలను తయారు చేసుకుని అడగసాగాడు. అత్యంత ఉద్వేగభరితంగా అడుగుతున్న వారి ప్రశ్నలు, అతన్ని కూడా కొన్నిసార్లు భావోద్వేగానికి గురిచేశాయి. కొన్ని పాత సంఘటనలు గుర్తు చేసుకుంటూ నవ్వుతున్నాడు, కన్నీళ్లు పెడుతున్నాడు. అలా సంపాదకుని ప్రశ్నలు వచ్చినప్పుడు, ఒక్కొక్క ప్రశ్నకు అతని జవాబు అంతే ఆసక్తికరంగా ఉండేవి. కొన్ని ప్రశ్నలక అతను చాలా గంభీరంగా మారిపోయేవాడు. ప్రశ్నల జవాబులకు నడుమ నవ్వు, మందహాసం, మౌనం, చిన్నగా కళ్లలో నీళ్ళు నింపుకోవటం, దుఃఖం కలిగినా, దాన్ని ప్రదర్శించకుండా ఉండటం, ఇలాంటి ప్రతిస్పందనలతో సంపాదకుడితో మాట్లాడుతున్నాడు.

“మీరు నటుడిగా మరొక నటుడి నుండి నేర్చుకోవటం సామాన్యంగా జరిగే విషయం. కాబట్టి మీ ఉద్దేశంలో మీకు ప్రేరణ కలిగించిన నటుడు ఎవరు? మీరు అనుకుంటున్నారు? అలాగే మీ ప్రకారం ఉత్తమ నటుడు ఎవరని  అనుకుంటున్నారు?’

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఒక్క క్షణం మౌనం వహించాడు.

కొన్ని క్షణాల తర్వాత, ‘నాకు ప్రేరణ కలిగించిన నటుడు, నా బెస్ట్ యాక్టర్ అంటే… మా నాన్న” అని బదులిచ్చాడు.
అతని మాటలకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆ సంపాదకుడు, మీ నాన్న ఎవరు? ఏయే సినిమాల్లో నటించారు? అని అడుగుతాడు.

మళ్ళీ ఒక్క క్షణం మౌనం…

‘లేదు… మా నాన్నగారు ఏ సినిమాలోనూ నటించలేదు, ఆయన సినిమా యాక్టర్ కాదు… ఆయన ఒక సామాన్య వ్యక్తి…

‘మీ తండ్రిగారు మీ పాలిట బెస్ట్ యాక్టర్ అని ఎలా చెబుతారు? మీరు ఒక గొప్ప నటుడిగా నిలబడటానికి ఆయన ఎలా కారణమయ్యారు?’

సంపాదకుడు అడిగిన ఆ ముఖ్యమైన ప్రశ్నకు మహానటుడి సమాధానం…

‘నేను కళాకారుడిని కావాలి, సినిమా రంగంలో పెద్ద హీరో అవ్వాలి అని నా మనస్సులో ఏర్పడటానికి ముఖ్య కారణం మా నాన్నగారు… ఇదే నా జీవితంలో గొప్ప ఇంట్రెస్టింగ్ స్టోరీ…!”

‘మీరు కళాకారుడు కావడానికి కారణమైన ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీని మాకూ చెప్తారా?” అనే ప్రశ్న వెంటనే వచ్చినప్పటికీ, సంపాదకుడికి కూడా ఆ విషయం తెలుసుకోవాలనే అంతే ఉత్సాహంతో ఉన్నాడు.

ఆ గొప్ప నటుడు తన ముందున్న కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని ఒక సిప్ చేసి, తన తండ్రి, అతని కుటుంబం గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

దక్షిణ కన్నడలోని ఒక చిన్న గ్రామం నుండి ఆ నటుడి బాల్యం ప్రారంభమవుతుంది, చుట్టూ కొండలు గుట్టలు, నది, సముద్రం నుంచి వెనుకకు మరలిన నీటి అందమైన దృశ్యాలతో కూడిన ఆ చిన్న గ్రామం ఆ గొప్ప నటుడి కళ్ళను ఒక్కసారిగా ఆక్రమించుకుంటుంది. అతని కుటుంబం ఆ చిన్న గ్రామంలోని వెనుకబడిన కులానికి చెందినది. భూతనర్తనం చేసే వంశం వారిది. వాళ్ళకు ఉన్నది ఆ చిన్న ముక్క భూమి. ఆ భూమిలోనే నటుడి తండ్రి, తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.

ఆ నటుడు తన జీవితంలోని ఆసక్తికరమైన కథను చెబుతూ పోతాడు.

“మా నాన్నకు నాటకం, యక్షగానం, సినిమా, నాట్యం పట్ల పిచ్చి ఉండేది. మా ఊరిలో నాటకం, యక్షగాన మేళాలు/బందాలు వస్తే, మొదటి వరుసలో మా నాన్నే కూర్చునేవాడు. ఊరిలో ఉన్న యక్షగాన మేళంవారికి తానూ అఇనయిస్తాను, నాకొక అవకాశం ఇవ్వండని ఎంత చెప్పినా, వాళ్ళు నాన్నకు అవకాశం ఇవ్వనేలేదు. ప్రతిసారి విభిన్నమైన పాత్రల పరీక్షను పెట్టారు. అతను చేసే అభినయాన్ని వినోదంగా చూసి ఆనందించేవారు. తండ్రికి వాళ్ళు చేస్తున్న అవమానం అర్థమైనా, ఆన్ని బయటపెట్టకుండా, లోలోపల తనకు కలిగిన దుఃఖాన్ని దిగమింగుకుని, ఏడుస్తూనే ఇంటికి వచ్చేవాడు. తాను కళాకారుడు కాలేదనే ఓటమిని మర్చిపోవడానికి అతను విపరీతంగా తాగుడుకు బానిసయ్యాడు. అమ్మకు నాన్నకు ఉన్న ఈ అభినయపు పిచ్చి, దానికోసం అతను చేస్తున్న పిచ్చితనాలు అమ్మకుసాధారణమైపోయాయి. పశువులను కట్టివేస్తున్న కొట్టంలో చేరుకుని రాత్రిళ్ళు అతని చేసే పిచ్చిపనులు ఆమెకు అలవాటు అయిపోయాయి. తాను మంచి కళాకారుడని, తనకూ అభినయించడానికి, నత్యం చేయడానికి వస్తుణదని ఇతరుల ముందు అభినయించి చూపినా నాన్నను ఎవరూ తమ బందంలో చేర్చుకునేవారు కాదు. అయితే నాన్నకు రోజురోజుకూ నటుడు కావాలనే పిచ్చి పెరుగుతూ వుంది. బయట తనకు జరిగిన అవమానాలన్నీ మర్చిపోవడానికి అతను తాగుతుండేవాడు. పశువుల కొట్టంలో చేరుకుని , తన ముందున్న అద్దంలో చూసుకుంటూ నటించేవాడు. నాట్యం చేసేవాడు. యక్షగాన పదాలను పాడేవాడు. పాటలకు తగినట్లు అడుగులు వేసేవాడు. ఇదంతా అతని కొట్టమనే ప్రపంచంలో. అతని నటనను చూస్తున్నది, అక్కడున్న పశువులు మాత్రమే. అర్ధరాత్రి వరకు తనలో ఉన్న నటుడు నటన పూర్తయ్యేవరకూ తనదైన లోకంలో మునిగిపోయేవాడు. కొత్తగా చూసిన సినిమా, యక్షగానాలు, ప్రధాన పాత్రల అభినయాన్ని అంతే కచ్చితంగా తన పాటికి తాను అభినయించేవాడు. ప్రతిరోజూ ఒక్కొక్క కొత్త ప్రసంగాన్ని పెట్టుకుని ఏకపాత్రధారిగా కొట్టంలో తన పాటికి తాను నటించేవాడు. ఇతని మనస్సును ఎవరూ అర్థం చేసుకోలేదు. చార్లీ చాప్లిన్, బ్రూస్లీ, రాజ్‌కపూర్ సినిమాలు అతన్ని విపరీతంగా వేధించేవి. తాను వారిలా గొప్ప నటుడవ్వాలనే అతని తపనను పిచ్చితనమని అందరూ ఎగతాళి చేసేవారు’

సంభాషణ కొనసాగింది… ఎడిటర్లో కుతూహలం కూడా రెట్టింపు అయింది.

“అప్పట్లో నా వయసు పదో, పన్నెండేళ్ళో ఉంటాయి… నాన్న ప్రతి రోజూ రాత్రి పశువుల కొట్టంలో ఏం చేసేవాడనేదే నాకు పెద్ద ప్రశ్నగా మారింది. అమ్మ తిట్టి అక్కడికి వెళ్ళవద్దని చెప్పినప్పుడల్లా ఆ పశువు కొట్టం నాలో మరింత ఆసక్తిని పెంచింది. అక్కడికి నువ్వు వెళ్ళకు, నాన్నలా నువ్వూ పిచ్చివాడవుతావు అమ్మ కసిరి పడుకోబెట్టినా, రాత్రి పశువు కొట్టంలో ఉంటూ నాన్న ఇంట్లో ఉండి ఎందుకా అరుస్తూవుంటాడో చూడాలనే కుతూహలంగా వేధిస్తూ ఉండేది. ఒకరోజు అమ్మ పడుకున్న తర్వాత, ఆమె కళ్ళుగప్పి నేను పశువు కొట్టం వైపు నడిచాను. పశువు కొట్టానికి ఉన్న చిన్న కిటికి నుంచి నాన్న ప్రతి రోజు ఏం చేస్తున్నాడో ఆ రోజు నాకు తెలిసింది. నాన్న రోజూ రాత్రి అక్కడ ఏం చేస్తున్నాడో చూడాలని చాలా కుతూహలంతో చూడసాగాను. ప్రతిరోజూ ఆ కిటికి ద్వారా నాన్న నటనను చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. నాన్నలోని ప్రతిభను నేను చాలా మెచ్చుకున్నాను. నాన్నగారి విచ్తిమైన జీవితం, తన మనసులోని బాధనంతా మరవడానికి ఆ పశువుల కొట్టంలో ఆతన ప్రయత్నిస్తుండటం, అతని నిరాశా నిస్పృహలు ఆ చిన్నవయస్సులోనే అర్థమయ్యేది. తనలోని కళాకారుడిని ఎవరూ గుర్తించడం లేదన్న విచారం నాన్నను ప్రతి క్షణమూ వేధించేది. రోజులు, సంవత్సరాలు దొర్లిపోయాయి… పశువుల కొట్టం కిటికి, కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేది. ప్రతిరోజూ నాన్న అభినయాన్ని చూస్తూనే నాలో ఓ కళాకారుడు పుట్టుకొచ్చాడు.

ఉన్నత పాఠశాలల్లో చిన్న చిన్న నాటకాలు, ఏకపాత్రాభినయాల్లో నటించడం ప్రారంభించారు. స్కూల్లో టీచర్లు, స్నేహితులు అందరూ నా వీపు తట్టి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. నాకు తెలియకుండానే నాన్న నాలోకి వచ్చి చేరుకున్నాడు’

అదే సమయంలో రిపోర్టర్, “మీరు అతన్ని దొంగతనం చూస్తున్నారని ఆయనకు తెలియలేదా?” అని నన్ను ప్రశ్నించాడు.

నిజానికి అది ఏదో ఒక రోజు తెలియాల్సిందే. ఒక రోజు అది అతనికి తెలిసింది. ‘అది దాదాపు ఐదారేళ్ల తర్వాత… ఆ విషయమే నేను ముందు చెప్పబోతున్నాను’ అని చెప్పి తన జ్ఞాపకాల లోతుల్లోకి మరోసారి దిగాడు.

సంభాషణ కొనసాగింది.

“నాన్నకు తాను పశువుల కొట్టంలో రాత్రిపూట అభినయిస్తుండటాన్ని, నృత్యం చేయటాన్ని ఎవరో దొంగతనంగా చూస్తున్నారని అనిపించడం మొదలుపెట్టింది. ఒకరోజు నేనే చాటుగా చూస్తున్నానని తెలిశాక, నా ముఖాన్ని చూస్తూ మాట్లాడటానికి అతనికి మనస్కరించలేదు. సిగ్గుతో ముడుచుకుపోయాడు. తాగి తాగి దేహం అప్పటికే కశించిపోయింది. నాన్న మనసులోని బాధను నేను అప్పటికే అర్థం చేసుకున్నాను. నన్ను చూసి కళ్ళలో కన్నీళ్ళు నింపుకుని, ముఖం అటువైపు తిప్పుకుని సంకోచంతో నిలుచున్న నాన్నను చూసి నేనూ ఒక్క క్షణం కదిలిపోయాను. నాన్న పరిస్థితి చూసి నాకూ కన్నీళ్లు వచ్చాయి. ఎదిగిన కొడుకు ముందు తన బాధను పంచుకోవడానికి నాన్నకు సిగ్గు. అయినా కూడా నాన్నను ఒకసారి కౌగిలించుకోవాలని అనిపించింది. కశించిన అతని శరీరాన్ని ఒకసారి పట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాను. ఆ రోజు నా మనసులోని మాటలు ధైర్యంగా బయటకు వచ్చాయి. ‘నాన్నా నువ్వు నిజంగానే గొప్ప కళాకారుడివి… నీలో అద్భుతమైన ప్రతిభ ఉంది. నీ ప్రతిభను ఈ ప్రపంచం గుర్తించకపోయినా, నాకు మాత్రం గొప్ప కళాకారుడివి. నువ్వు నటుడిని కాలేదని కుమిలిపోవద్దు. నీ కోరికను నేను తీరుస్తాను. నేను నీలాగే కళాకారుడిని అవుతాను. నువ్వు గొప్ప కళాకారుడు కాలేదన్న నీ చింతను నేను కళాకారుడిని కావటం ద్వారా తీరుస్తాను’ అని నాన్నను బిగువుగా కౌగిలించుకుని చెప్పాను. నాన్న కన్నీళ్ళు నా భుజాన్ని తడిపాయి. నాన్న కౌగిలిలో అతని అంతరంగం అర్థమైంది… ఆ రోజు నేను నటుణ్ణి కావాలనే కోరికతో మా ఊరు వదిలి బొంబాయి వచ్చేశాను.హోటళ్ళలో పనిచేశాను. నేను పనిచేస్తున్నహోటల్‌కు చాలా మంది సినిమావాళ్ళు వచ్చేవారు. వచ్చినవారికి బాగా సేవలు చేసి, వారితో పరిచయం పెంచుకుని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసుకదా…! నేను పనిచేస్తున్న హోటల్‌కు మీరు కాఫీ తాగటానికి వచ్చేవారు. నువ్వు సినిమా జర్నలిస్ట్ అని తెలిశాక మీ వెనక నేను పడటం ఎక్కువైంది కదా? మీరు కూడా నాకు చాలామంది సినిమా దర్శకులను పరిచయం చేశారు. నాకు చాలా సినిమాల్లో అవకాశాలు ఇప్పించ్చారు… నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడివరకూ వచ్చి నిలుచున్నాను. సినీ పరిశ్రమలో నా ఎదుగుదల మీకు తెలిసిందే. అది మళ్ళీ మీకు చెప్పనవసరం లేదు’- అని కన్నీళ్ళతో నిండిన తన ముఖం తుడుచుకున్నాడు. ఆ గొప్ప నటుడు తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఎడిటర్‌ను ఒకసారి చూశాడు. ఎడిటర్ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. అక్కడున్న ప్రోగ్రాం ప్రొడ్యూసర్ కట్.. కట్… అన్నాడు. కెమెరాలు ఆఫ్ అయ్యాయి.

ఎడిటర్ జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. అతను కూడా నటుడి జీవితపు అంతరంగంలో ఈయన కూడా దిగిపోయాడు. కూడా ఆ నటుడి నొప్పి ఇంట్లో చేరాడు. తండ్రి పడిన బాధ అతని హృదయాన్ని కూడా తాకింది.

ఇంటర్వ్యూ అప్పటికే ముగింపు దశకు చేరుకుంది. బెస్ట్ యాక్టర్ అవార్డు పొందిన నటుడి చెవిలో అతని అసిస్టెంట్ ఏదో చెబుతున్నాడు.

“ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని తన పాత మిత్రుడైన ఎడిటర్ని సహజంగా అడిగాడు.

“నీ జీవితంలో బెస్ట్ యాక్టర్ ఎవరో నాకు అర్థమైంది… అదే నా ఇంటర్వ్యూలోని చాలా ముఖ్యమైన విషయం” అంటూ చిన్నగా నవ్వాడు.

ప్రోగ్రాం ప్రొడ్యూసర్, “ప్యాకప్… థ్యాంక్యూ ఆల్…” అని అరుస్తూ నటుడి దగ్గరకు, తన ఛానెల్ ఎడిటర్ దగ్గరికి వెళ్ళాడు.

మిగిలిన టెక్నీషియన్స్ అటుఇటు తిరగటం, చిన్నగా మాటలు మొదలయ్యాయి.

కెమెరాలు, లైట్లు అన్నీ ఆఫ్ చేశారు. ఇంటర్వ్యూ షూటింగ్ బెస్ట్ యాక్టర్ ఇంట్లోనే జరుగుతుండడంతో ఇంట్లో కాస్త చీకటి కమ్ముకుంది. మైకులు ఆఫ్ అయ్యాయి. ఆ నటుడు, సీనియర్ పాత్రికేయుడు ప్రైవేట్‌గా చిన్నగా మాట్లాడుకోసాగారు.

“మీ భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఆమెను చూసి చాలా రోజులైంది…” అని నటుడి భార్య అనారోగ్యం గురించి అడిగాడు ఎడిటర్.

“నేనైతే ఇలాంటి భయంకరమైన జబ్బు ఆమెను జీవితాంతం వేధిస్తుందని ఊహించలేదు. ఆమె పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. ఉన్నన్ని రోజులు ఆమెను సంతోషంగా చూసుకుంటున్నాను. ఆమె స్నానానికి వెళ్ళాలంటే, ఆమెకు నేనే స్నానం చేయిస్తేనే ఆమెకు సంతప్తి. అందుకే నా అసిస్టెంట్ ద్వారా చెప్పి పంపింది…” అని పక్కనే నిలబడిన పర్సనల్ అసిస్టెంట్ ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వాడు.

“నిజంగా యూ ఆర్ గ్రేట్ … నువ్వు రీల్ అండ్ రియల్ లైఫ్‌లోనూ గొప్ప నటుడివే… నీ స్థానంలో ఇంకెవరైనా పెద్ద హీరో

ఉండివుంటే, జబ్బుతో ఉన్న భార్యకు విడాకులు ఇచ్చి మరో పెళ్ళి చేసుకుని ఉండేవాడు. నువ్వు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూనే, ఇన్నేళ్లు ఆమెకు సేవ చేస్తున్నావు….ఇప్పటికీ ఆమెకు సేవ చేస్తున్నావు… ఇదే నీలో ఉన్న గొప్ప గుణం…” అని పొగిడాడు.

“అభిమానులకు, రసికులకు నేనొక నటుడు కావచ్చు. బెస్ట్ యాక్టర్, సూపర్ స్టార్ అని అనిపించొచ్చు. కానీ ఆమెకు నేను కేవలం భర్తను మాత్రమే. ఆమెకు ఈ రంగుల ప్రపంచం గురించి తెలియదు. కాబట్టి ఆమెకు సేవ చేయడం నా కర్తవ్యం…” అని ఆ గొప్ప నటుడు జవాబిచ్చాడు.

“నేను ఇప్పుడు నీ భార్యను చూడొచ్చా?”

“ఏయ్…కచ్చితంగా… నువ్వు ఎప్పుడొస్తావా అని ఉదయం నుంచీ అడుగుతూనే ఉంది. రా, ఆమెను చూడ్డమేమిటి, మాట్లాడుదువుగాని’ అని నటుడు తన స్నేహితుడిని తన గదికి తీసుకుని వెళ్ళాడు.

షూటింగ్ కుర్రాళ్ళు అప్పటికే అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ నటుడి అసిస్టెంట్ వాళ్ళకు అల్పాహారం, కాఫీ ఏర్పాటు చేశాడు.

నటుడి భార్య మంచం మీద పడుకుంది. ఆమె తలంతా బోడిగా ఉంది… జబ్బు వల్ల ఆమె తల వెంట్రుకలన్నీ రాలిపోయాయి. నటుడు గదిలోకి వెళ్ళగానే, “జాహ్నవి, ఇక్కడ ఎవరు వచ్చారో చూడు… ఉదయం నుంచి అడుగుతున్నావుకదా… మీ పాత స్నేహితుడు ఎప్పుడు వస్తాడని? చూడు, నా పాత స్నేహితుడు వచ్చాడు…” అని ఆమె పక్కనే కూర్చుని మిత్రుడిని చూపాడు.

ఆమె కళ్ళు ఎడిటర్ వైపు చూస్తున్నాయి సంతోషంగా. ఆ క్షణంలో మాట్లాడేంత శక్తి ఆమెకు లేదు. చేతులు జోడించడానికి ప్రయత్నించింది. నిస్సహాయంగా ఆమె చేతులు కిందకు జారి పక్కనే కూర్చున్న భర్త చేతులను గట్టిగా పట్టుకునాయి.

ఇంతకు ముందు ఆమెను చూడడానికీ, ఇప్పుడు చూడడానికీ చాలా తేడా ఉంది, మునుపట్లో ఉన్న సౌందర్యం లేదు, ఆమె శరీరంలో చైతన్యం లేదు. అది చూసిన ఎడిటర్ నోట మాట రాలేదు. అప్పటికే ఇంటర్వూ తర్వాత ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకున్న ఎడిటర్.. నటుడి భార్యను చూడగానే మరింత భావోద్వేగం అతన్ని ఆవరించింది. అక్కడ ఉంటే తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేడని, “విలాస్ నేను వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యాడు. అతని వెనుకే నటుడు అనుసరిస్తాడు.

కొద్దిదూరం నడిచాక మళ్లీ తాను ఏదో మర్చిపోయానన్న అనుమానంతో వెనుతిరుగుతాడు.

ఆ గొప్ప నటుడు అతన్ని బయట వరకూ వీడ్కోలు చెప్పటానికి వెనుకే వచ్చాడు. ఇలా వస్న్నుప్పుడు, “విలాస్, నువ్వు అపార్థం చేసుకోకపోతే నిన్ను మరో చివరి ప్రశ్న అడగొచ్చా?’

“తప్పకుండా అడగండి, దానికెందుకు సంకోచిస్తున్నారు? నాకంటే మీరు పెద్దవాళ్ళు. నా మార్గదర్శకులు… మిమ్మల్ని నా ఫ్యామిలీ అని అనుకున్నాను…” అని చెప్పి ఆయన ముఖంలోకి మరోసారి సంతోషంతో చూస్తాడు.

“నీ బెస్ట్ యాక్టర్ ఇంకా బతికే ఉన్నారా?” సంపాదకుడి ప్రశ్న నెమ్మదిగా వెలువడింది.

మళ్ళీ ఒక్క క్షణం మౌనం…

“అవును, నా బెస్ట్ యాక్టర్ ఇప్పటికీ బతికేవున్నారు…”

‘నేను ఆయన్ని చూడాలి… ఆయన్ను కలవడానికి తీసుకెళ్తారా?’

“తప్పకుండా చూపిస్తాను… ఒకసారి ఆయన్ను కలుద్దాం…”

ఇలా చెప్పి, ఆ నటుడు తన స్నేహితులకు వీడ్కోలు పలుకుతూ కౌగిలించుకున్నాడు. వాళ్ళు తమ కారు దగ్గరకు వెళ్ళి కూర్చునే వరకూ సంపాదకుడిని ఆ నటుడు చూస్తూనే ఉన్నాడు.

బయట కార్ డ్రైవర్ ఆ సంపాదకుడి కోసం ఎదురు చూస్తున్నాడు, షూటింగ్ బాయ్స్, టెక్నీషియన్లు అప్పటికే వారి ఛానెల్ వైపు వెళ్ళారు.

ఆ రోజు ఛానల్ సంపాదకుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంటర్వ్యూ కాకుండా, ఆ నటుడి నిజమైన జీవితాన్ని

చూశాడు. ఈ రోజు ఆతను తన జీవితంలో నిజమైన బెస్ట్ యాక్టర్‌ను చూసిన అనుభవం కలిగిందని మనస్సులో అనుకున్నాడు.

కారు కదులుతోంది. ఛానల్ సంపాదకుడికి అన్నేళ్ళు స్నేహితుడిగా ఉన్న ఈ నటుడు ఆ రోజు భిన్నంగా కనిపించాడు. తమ మనస్సులో అతనికి గొప్ప స్థానాన్ని కల్పించుకోవడం మొదలుపెట్టారు.

ఆ మహా నటుడిని తెరపై చూసి ఆనందిస్తున్న అతని కళ్ళు, ఆ రోజుకూడా నిజజీవితంలోనూ ఇంకొద్ది సేపు చూస్తూ ఉండాలని చెబుతున్నాయి.

ఆ పాత్ర తెరపై నుంచి కనుమరుగయ్యేంత వరకూ, ఈ పాత్ర కళ్ళు అతని అస్పష్టమైన ఊహలను వెతుకుతూనే ఉన్నాయి… కొన్ని క్షణాల తర్వాత ఆ రెండు పాత్రలూ తమ పాటికి తాము దూరంగా జరిగాయి.

బెస్ట్ యాక్టర్ను కలుసుకునే తదుపరి క్షణాల కోసం కాలం ఎదురుచూస్తోంది.

 

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

Previous Post

ఒడియా కథ : తప్పెవరిది?

Next Post

నిజమే చెప్తాను

Next Post
నిజమే చెప్తాను

నిజమే చెప్తాను

Discussion about this post

ఈ సంచికలో…

  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..
  • ఆంగ్ల కథ : పిరికి పంద
  • తమిళ కథ : సైకిలు డాక్టరు
  • రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి
  • విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’
  • నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను
  • అనువాద కవిత : మహిళల మధ్య
  • అనువాద కవిత : ఓ  లక్ష్మణా!
  • కన్నడ కథ: బేలా
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com