• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

రష్యన్ కథ : శస్త్రచికిత్స

కేశవ్ గోపాల్ by కేశవ్ గోపాల్
August 10, 2026
in అనువాద కథలు
0
రష్యన్ కథ : శస్త్రచికిత్స

రష్యన్ మూలం: అంతోన్ చేహొవ్
తెలుగు అనువాదం: కేశవ్ గోపాల్

జేమ్స్ స్త్వొ ఆస్పత్రి. డాక్టర్ పెళ్లి చేసుకోడానికి వెళ్లాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో బొద్దుగా, సుమారు నలభై ఏళ్ల వయసున్న పారామెడిక్ కుర్యాటిన్ రోగులను చూస్తున్నాడు. అతడు పాతబడిన చెచుంచా జాకెట్, చిరిగిన ట్రికోట్ ప్యాంట్ ధరించి వున్నాడు. ముఖంలో కర్తవ్యభావం, సౌమ్యత కనిపిస్తున్నాయి. ఎడమ చేతి రెండువేళ్ల మధ్య (చూపుడువేలు, మధ్యవేలు) చుట్టవుంది. దాన్నుంచి దుర్వాసన వస్తోంది.

గోధుమరంగు కాసోక్ (మతగురువుల వస్త్రం), వెడల్పాటి తోలు బెల్టు ధరించి, పొడుగ్గా, దృఢంగా వున్న వృద్ధుడైన డీకన్ (చర్చి పరిచారకుడు) రిసెప్షన్ గదిలోకి ప్రవేశించాడు. అతడి కుడికన్ను శుక్లంతో సగం మూసుకుపోయి వుంది. ముక్కు మీదున్న పులిపిరి దూరంనుంచీ చూస్తే ఒక పెద్ద ఈగలా కనిపిస్తోంది. ఒక క్షణం పాటు అతడు క్రీస్తుపటం కోసం వెదికాడు. కానీ, ఏదీ కనిపించకపోవడంతో కార్బాలిక్ ద్రావణమున్న ఒక సీసాపై శిలువ గుర్తు వేసుకున్నాడు. తర్వాత ఎర్ర రుమాలు నుంచి ప్రాస్పొరా (ఆరాధనా కార్యక్రమంలో ప్రసాదంగా వుపయోగించే గుండ్రటి రొట్టె) తీసి నమస్కరించి, దాన్ని పారామెడిక్ ముందు బల్లమీద పెట్టాడు. 

పారామెడిక్ ఆవులిస్తూ ‘‘ఏమిటి మీ సమస్య?’’ అని అడిగాడు.

‘‘మీకు ఆదివారం శుభాకాంక్షలు సెర్గేయ్ కుజ్మీచ్.. మీ దయకు.. క్షమించండి.. కీర్తనల గ్రంథంలో నిజంగా సరిగ్గా చెప్పారు: ‘‘నా పానీయాన్ని కన్నీళ్లతో కలిపి సేవించాను’’. మొన్న నా భార్యతో కలిసి టీ తాగడానికి కూచున్నాను- దేవుడా! ఒక చుక్క మింగలేకపోయాను. అక్కడే పడి చచ్చిపోవాలనిపించింది. నాలో శక్తి లేదు.! కేవలం పంటిలో మాత్రమే కాదు. చెంప చెంపంతా ఒకటే పోటు! క్షమించండి! నొప్పి చెవిదాకా పాకింది. మేకు లేదా అలాంటిదేదో వస్తువు నా చెవిలో వున్నట్టు అనిపిస్తోంది. అది గుచ్చుకుంటూనే వుంది.. గుచ్చుకుంటూనే వుంది. భయంకరమైన నొప్పి! పాపం చేశాను.. చెడుదారులు తొక్కాను.. ఎందుకంటే- నా ఆత్మను పాపాలతో అపవిత్రం చేసుకున్నాను. నా జీవితాన్ని సోమరితనంతో వృథా చేసుకున్నాను. ఇది నా పాపాలకు ప్రతిఫలం. చర్చిలో ప్రార్థనల తర్వాత పూజారి నన్ను గద్దించాడు: ‘‘యెఫీమ్! నీ మాటలు తడబడుతున్నాయి. గొంతు బొంగురుపోయింది. పాడుతున్నావు. కానీ నువ్వేం పాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు…!’’ నోరు తెరవలేనప్పుడు మరి ఎలా పాడగలను? క్షమించండి- రాత్రంతా కంటిమీద రెప్ప పడలేదు!’’

‘‘సరే… కూర్చోండి. నోరు తెరవండి!’’ -పారామెడిక్.

చెప్పినట్టు చేశాడు వొమ్నిగ్లాసొవ్.

పారామెడిక్ కుర్యాటిన్ ముఖం చిట్లించి అతని నోటిలోపల పరీక్షించాడు.

పొగాకు వాడకం వల్ల పసుపుదేరిన అతని పళ్ల మధ్య పెద్ద రంధ్రంతోవున్న ఒక పల్లు కనిపించింది.

‘‘ఒక రకమైన ముల్లంగిలో కలిపి వూరబెట్టిన వోద్కాను పూయమని ఫాదర్ డీకన్ (దైవారాధనలో బిషప్ లకు, పూజారులకు సహాయం చేసే వ్యక్తి) చెప్పాడు. కానీ, దాని వల్ల ప్రయోజనం కనిపించలేదు. మణికట్టుకు కట్టుకోడానికి గ్లికేరియా అనిసిమోవ్నా (వారికి దేవుడి ఆశీస్సులు) మౌంట్ అథోస్ నుంచి తెచ్చిన ఒక దారాన్నిచ్చారు; గోరువెచ్చని పాలతో నోరు పుక్కిలించమని చెప్పారు. నిజం ఒప్పుకోవాలి.. నేను ఆ దారాన్ని కట్టుకున్నాను. కానీ పాల నియమాన్ని పాటించలేదు. నాకు దేవుడంటే భయం.. ఉపవాసం వున్నాను..’’

‘‘మూఢ నమ్మకాలు!… ఆ పల్లును పీకి పారేయాలి యెషీమ్ మిఖైచ్!’’ -అన్నాడు పారామెడిక్.

‘‘సెర్గేయ్ కుజ్మీన్! ఏం చేయాలో మీకు బాగా తెలుసు. విషయాన్ని వున్నది వున్నట్టుగా అర్థం చేసుకోడానికి, దేన్ని పీకేయాలో, దేనికి చుక్కల మందుతో చికిత్స చేయాలో తెలుసుకునేందుకే మీకు శిక్షణ నిచ్చారు… అందుకే మిమ్మల్ని నియమించారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక! మా ప్రియమైన తండ్రులారా! అందుకే మేము జీవితాంతం రేయింబళ్లు మీకోసం ప్రార్థన చేస్తాం…’’

‘‘అదేం లేదు’’ అంటూ పారామెడిక్ వినయంగా అలమర దగ్గరకు వెళ్లి అందులోని పరికరాలను వెతుకుతూ అన్నాడు. ‘‘శస్త్రచికిత్స అంటే మరేం కాదు. అంతా అలవాటు, అనుభవమున్న హస్తం మీద ఆధారపడి ఉంటుంది… చాలా తేలిక… మొన్ననే, మీలాగే అలెక్సాంద్ర్ ఇవనోవిచ్ ఎగెప్తేవ్‌స్కీ అనే భూస్వామి ఆస్పత్రికి వచ్చాడు. ఆయనకు కూడా పంటినొప్పే… బాగా చదువుకున్న వ్యక్తి. ప్రతి విషయాన్ని గ్రహిస్తాడు. పేరు పెట్టి తండ్రి పేరుతో పిలిచి కరచాలనం చేశాడు. సెయింట్ పీటర్స్‌బుర్గ్ లో ఏడేళ్లు నివశించాడు. అక్కడి ప్రొఫెసర్లందరూ బాగా పరిచయం. అతనితో చాలా సమయం గడిపాను; క్రీస్తుదేవుని ఆరాధిస్తాడు-’’ 

‘‘సెర్గేయ్ కుజ్మీచ్! ఆ పన్ను పీకేయండి.’’

‘‘ఎందుకు పీకేయకూడదు? పీకేయొచ్చు. కానీ, ఒక అవగాహన అవసరం. అవగాహన లేకుండా పీకేయకూడదు.. పళ్లు రకరకాలుగా వుంటాయి. ఒక దాన్ని పట్టకారుతో పీకుతారు. మరొకదాన్ని మోలార్ ఫోర్‌సిప్స్ తో. ఇంకొకదాన్ని ఇంకొక పరికరంతో… అది వ్యక్తిని బట్టి వుంటుంది.’’

పారామెడిక్ మోలార్ ఫోర్‌సిప్స్ పట్టుకుని ఒక నిముషం పాటు దాన్ని అనుమానంగా చూసి, తర్వాత దాన్ని కింద పెట్టి పట్టకారు తీసుకున్నాడు. 

‘‘సరే… మీ నోరు బాగా తెరవండి!’’ అన్నాడు సెర్గేయ్ కుజ్మీచ్ పట్టకారుతో రోగి దగ్గరకు వస్తూ… ‘‘ఇప్పుడు మనం… చాలా సులభం… చిగుళ్లను కత్తిరిస్తే చాలు… నిలువు అక్షం వెంబడి లాగితే చాలు..’’ అతను చిగుళ్లను కత్తిరించాడు. 

‘‘అంటే…’’

 ‘‘మీరు మా ఉపకారులు… మూర్ఖులమైన మాకు ఏమీ తెలీదు. కానీ ప్రభువు మీకు జ్ఞానోదయం కలిగించాడు…’’

‘‘నోరు తెరిచివున్నప్పుడు ఉపన్యాసం వద్దు…’’

‘‘దీన్ని పీకడం సులభమే… కానీ కొన్నిసార్లు కొన్ని ఇబ్బంది పెడ్తాయి. వాటికి వేర్లు తప్ప ఏమీ వుండవు… ఇది చాలా సులభం. (పట్టకారును ప్రయోగిస్తూ) ఆగండి, కదలకండి… మెదలకుండా కూచోండి… రెప్పపాటులో… (లాగుతూ) ముఖ్యమైన విషయమేమంటే, బాగా లోతుగా పట్టు దొరకాలి.’’ లాగుతూ 

‘‘అప్పుడైతే పన్ను పైభాగం విరగదు…’’

‘‘మా తాతముత్తాతలు కనిపిస్తున్నారు… పవిత్రమాతా!… అబ్బా…’’

‘‘అది కాదు… అదికాదు.. దాని పేరేంటి? దాన్ని చేతుల్తో పట్టుకోవద్దు.! ఇక్కడ.. ఇక్కడ.. ఇది అంత తేలికైన పని కాదు…’’

‘‘అమ్మా.. అయ్యో!’’ (అరుపులు).. దేవదూతలారా!.. ఓహొహో… లాగండి.. లాగండి..! ఎందుకంత సాగదీసి కాలం గడుపుతున్నారు?’’

‘‘విషయమేమంటే.. శస్త్రచికిత్స… దాన్ని వెంటనే చేయలేరు.. ఇదిగో.. ఇదిగో..’’

వోమ్నిగ్లాసొవ్ తన మోకాళ్లను మోచేతుల దాకా మీదికి లేపి, వేళ్లను మెలిదిప్పుతూ., కళ్లు పెద్దవి చేసి ఆయాసంగా వూపిరి పీల్చుకుంటున్నాడు. ఎర్రబారిన అతని ముఖం చెమటలు పట్టింది. కళ్లలో నీళ్లు నిండాయి. పారామెడిక్ కుర్యాటిన్ గట్టిగా శ్వాస తీసుకుంటూ, తన బరువు ఒక కాలి నుంచి మరొక కాలికి మార్చుకుంటూ ముందుకు వంగి రోగి పన్ను లాగాడు. బాధాకరమైన అర నిముషం గడిచింది. పట్టకారు పంటినుండి జారిపోయింది. రోగి వులిక్కి పడి లేచి తన నోట్లో చెయ్యి పెట్టాడు. లోపల పన్ను యథాస్థానంలో వున్నట్లు చేతికి తగిలింది.

‘‘కానీ, నువ్వు లాగావు కదా!’’ -రోగి అరిచాడు రోదిస్తూ. వెక్కిరింతతో కూడిన స్వరంతో అన్నాడు : ‘‘పరలోకంలో నిన్ను కూడా ఇలాగే లాగాలి. చాలా ధన్యవాదాలు! పన్ను లాగడం ఎలాగో తెలీకపోతే వూరుకోండి. నాకు చుక్కలు కనిపిస్తున్నాయి!’’

‘‘చేతుల్తో ఎందుకు పట్టుకుంటున్నావు?’’ పారామెడిక్ కోపంగా అడిగాడు.

‘‘నేను లాగుతుంటే నువ్వేమో నా చెయ్యి తోసేస్తూ పిచ్చివాగుడు వాగుతున్నావు… మూర్ఖుడా!’’

‘‘నువ్వే మూర్ఖుడివి!’’

‘‘పన్ను పీకడమంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఒకసారి ప్రయత్నించి చూడు! అదేమీ గంటలగోపురం ఎక్కి గంటలు కొట్టడం కాదు! (వెటకారంగా) 

‘‘నీకు చేతకాదు… నీకు చేతకాదు’’ అంటూ అనుకరించాడు పారామెడిక్.

‘‘అలెక్సాంద్ర్ ఇవనోవిచ్ గారికి ఒక పన్ను పీకాను. ఆయన బాగానే వున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీలాగా కాదు.. మంచివాడు.. చేతుల్తో పట్టుకోలేదు!… కూర్చో.. కూర్చో.. చెప్తున్నాను!’’

‘‘నాకింకా చుక్కలు కనిపిస్తున్నాయి… ఒక్క క్షణం వూపిరి పీల్చుకోనివ్వు… ఓహ్!’’ (లేచి కూచున్నాడు).. ఎక్కువ సేపు సాగదీయొద్దు.. ఒక్కసారిగా లాగు… గబుక్కున లాగు!’’

‘‘తాతకు దగ్గు నేర్పుతున్నావా? దేవుడా!.. ఎలాంటి చదువురాని మొద్దులు… ఇలాంటి వాళ్లతో కలిసి బతికితే పిచ్చెక్కుతుంది… నోరు తెరు (పట్టకారు ప్రయోగిస్తాడు) శస్త్రచికిత్స మిత్రమా, ఆట కాదు.. ఇది బృందగానంలో గొంతు కలపడం కాదు. (లాగుతాడు). కదలొద్దు… పంటిని చూస్తే చాలాకాలం నిర్లక్ష్యం చేసినట్లుంది. వేర్లు బాగా లోతుకు వున్నాయి. (లాగుతాడు) వుండు… వుండు. కదలొద్దు… అదుగో… అదుగో (విరిగే శబ్దం వినిపిస్తుంది) నాకు తెలుసు!’’

వోమ్నిగ్లాసొవ్ స్పృహ కోల్పోయినట్లుగా ఒక క్షణం పాటు అచేతనంగా కూచుండిపోయాడు. దిగ్భ్రాంతి చెందాడు. పాలిపోయిన ముఖంపై చెమటలు పడుతుండగా, అతని కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి.

‘‘బహుశ నేను మోలార్ ఫోర్‌సిప్స్ వాడి వుండాల్సింది.’’ పారామెడిక్ గొణిగాడు. ‘‘ఎంత గందరగోళం!’’

స్పృహలో కొచ్చిన రోగి తన వేళ్లను నోట్లో పెట్టుకొని చూడగా నొప్పి పెట్టిన పన్ను స్థానంలో పొడుచుకొచ్చిన రెండు ముక్కలు కనిపించాయి. 

‘‘ఓరి దుర్మార్గుడా!’’ అరిచాడు రోగి. ‘‘మమ్మల్ని చంపడానికే నిన్ను ఈ భూమ్మీద పెట్టినట్లుంది!’’

‘‘కానీ.. కానీ.. ఇంకా తిట్టు!’’ అంటూ పారామెడిక్ గొణుగుతూ పట్టకారును అలమరలో పెట్టాడు. ‘‘సెమినారీలో నిన్ను తగినంతగా దండించలేదు. అలెక్సాంద్ర్ ఇవానిచ్ యెగిపేత్స్‌స్కీ గారు సెయింట్ పీటర్స్ బుర్గ్ లో ఏడేళ్లు నివశించారు. సంస్కారం గల వ్యక్తి. ఆయన ధరించే ఒక జత దుస్తుల ఖరీదు సమారు వంద రూబుళ్లు- అయినా కూడా ఆయనెప్పుడూ బూతులు మాట్లాడలేదు. అసలు నువ్వేమైనా సుకుమారుడివా? కంగారు పడకు. నువ్వేం చావవులే!’’

రోగి వొమ్నిగ్లాసొవ్ రొట్టె ప్రసాదాన్ని బల్ల మీదినుంచి తీసుకుని చేత్తో చెంప పట్టుకుని వెళ్లిపోయాడు.

..1884లో ప్రచురితం.

కొన్ని వివరణలు:

  1. జేమ్స్ స్త్వొ  ఆస్పత్రి : స్థానిక సంస్థలు నిర్వహించే ఆస్పత్రి.
  2. చెచుంచా జాకెట్ : దట్టమైన పట్టుతో తయారైనది.
  3. ట్రికోట్ ప్యాంట్ : ఉన్నితో తయారైనది.
  4. పారామెడిక్ : అత్యవసర పరిస్థితులలో వైద్యుని సహాయకుడు
  5. మౌంట్ అథోస్ : ఉత్తర గ్రీస్ లోని అథోస్ ద్వీపకల్పం మీద పర్వతశిఖరం. ప్రాచ్య ఆర్తొడాక్స్ పాటించేవారి పవిత్ర స్థలం.
  6. మోలార్ ఫోర్‌సిప్స్ : దవడపళ్లు పీకడానికి వుపయోగించే పట్టకారు.
  7. సెమినారీ: చర్చికి కావలసిన సిబ్బందికి శిక్షణనిచ్చే ఉన్నత విద్యాసంస్థ.

 

కేశవ్ గోపాల్

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో సీనియర్ రష్యన్ డిప్లొమా చేశారు. 6 ఏళ్లు మాస్కోలో అనువాదంలో శిక్షణ పొంది, ఉద్యోగం చేశారు. జర్మన్ భాషతో కూడా పరిచయం ఉంది.

అభిరుచులు: చిత్రలేఖనం,ఫోటోగ్రఫీ, భాషల అధ్యయనం

Previous Post

కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి

Next Post

ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

Next Post
ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!
  • రష్యన్ కథ : శస్త్రచికిత్స
  • కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • హిందీ కథ : లెక్క తప్పింది !

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply